< యోహాను 7 >
1 ౧ ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు.
తతః పరం యిహూదీయలోకాస్తం హన్తుం సమైహన్త తస్మాద్ యీశు ర్యిహూదాప్రదేశే పర్య్యటితుం నేచ్ఛన్ గాలీల్ ప్రదేశే పర్య్యటితుం ప్రారభత|
2 ౨ ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
కిన్తు తస్మిన్ సమయే యిహూదీయానాం దూష్యవాసనామోత్సవ ఉపస్థితే
3 ౩ అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు.
తస్య భ్రాతరస్తమ్ అవదన్ యాని కర్మ్మాణి త్వయా క్రియన్తే తాని యథా తవ శిష్యాః పశ్యన్తి తదర్థం త్వమితః స్థానాద్ యిహూదీయదేశం వ్రజ|
4 ౪ అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు.
యః కశ్చిత్ స్వయం ప్రచికాశిషతి స కదాపి గుప్తం కర్మ్మ న కరోతి యదీదృశం కర్మ్మ కరోషి తర్హి జగతి నిజం పరిచాయయ|
5 ౫ ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు.
యతస్తస్య భ్రాతరోపి తం న విశ్వసన్తి|
6 ౬ అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
తదా యీశుస్తాన్ అవోచత్ మమ సమయ ఇదానీం నోపతిష్ఠతి కిన్తు యుష్మాకం సమయః సతతమ్ ఉపతిష్ఠతి|
7 ౭ లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
జగతో లోకా యుష్మాన్ ఋతీయితుం న శక్రువన్తి కిన్తు మామేవ ఋతీయన్తే యతస్తేషాం కర్మాణి దుష్టాని తత్ర సాక్ష్యమిదమ్ అహం దదామి|
8 ౮ మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు.
అతఏవ యూయమ్ ఉత్సవేఽస్మిన్ యాత నాహమ్ ఇదానీమ్ అస్మిన్నుత్సవే యామి యతో మమ సమయ ఇదానీం న సమ్పూర్ణః|
9 ౯ వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు.
ఇతి వాక్యమ్ ఉక్త్త్వా స గాలీలి స్థితవాన్
10 ౧౦ కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు.
కిన్తు తస్య భ్రాతృషు తత్ర ప్రస్థితేషు సత్సు సోఽప్రకట ఉత్సవమ్ అగచ్ఛత్|
11 ౧౧ ఆ ఉత్సవంలో యూదులు ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు.
అనన్తరమ్ ఉత్సవమ్ ఉపస్థితా యిహూదీయాస్తం మృగయిత్వాపృచ్ఛన్ స కుత్ర?
12 ౧౨ ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు.
తతో లోకానాం మధ్యే తస్మిన్ నానావిధా వివాదా భవితుమ్ ఆరబ్ధవన్తః| కేచిద్ అవోచన్ స ఉత్తమః పురుషః కేచిద్ అవోచన్ న తథా వరం లోకానాం భ్రమం జనయతి|
13 ౧౩ అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
కిన్తు యిహూదీయానాం భయాత్ కోపి తస్య పక్షే స్పష్టం నాకథయత్|
14 ౧౪ పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు.
తతః పరమ్ ఉత్సవస్య మధ్యసమయే యీశు ర్మన్దిరం గత్వా సముపదిశతి స్మ|
15 ౧౫ ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు.
తతో యిహూదీయా లోకా ఆశ్చర్య్యం జ్ఞాత్వాకథయన్ ఏషా మానుషో నాధీత్యా కథమ్ ఏతాదృశో విద్వానభూత్?
16 ౧౬ దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే.
తదా యీశుః ప్రత్యవోచద్ ఉపదేశోయం న మమ కిన్తు యో మాం ప్రేషితవాన్ తస్య|
17 ౧౭ దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.
యో జనో నిదేశం తస్య గ్రహీష్యతి మమోపదేశో మత్తో భవతి కిమ్ ఈశ్వరాద్ భవతి స గనస్తజ్జ్ఞాతుం శక్ష్యతి|
18 ౧౮ తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు.
యో జనః స్వతః కథయతి స స్వీయం గౌరవమ్ ఈహతే కిన్తు యః ప్రేరయితు ర్గౌరవమ్ ఈహతే స సత్యవాదీ తస్మిన్ కోప్యధర్మ్మో నాస్తి|
19 ౧౯ మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు.
మూసా యుష్మభ్యం వ్యవస్థాగ్రన్థం కిం నాదదాత్? కిన్తు యుష్మాకం కోపి తాం వ్యవస్థాం న సమాచరతి| మాం హన్తుం కుతో యతధ్వే?
20 ౨౦ అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు.
తదా లోకా అవదన్ త్వం భూతగ్రస్తస్త్వాం హన్తుం కో యతతే?
21 ౨౧ యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు.
తతో యీశురవోచద్ ఏకం కర్మ్మ మయాకారి తస్మాద్ యూయం సర్వ్వ మహాశ్చర్య్యం మన్యధ్వే|
22 ౨౨ మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు.
మూసా యుష్మభ్యం త్వక్ఛేదవిధిం ప్రదదౌ స మూసాతో న జాతః కిన్తు పితృపురుషేభ్యో జాతః తేన విశ్రామవారేఽపి మానుషాణాం త్వక్ఛేదం కురుథ|
23 ౨౩ విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు?
అతఏవ విశ్రామవారే మనుష్యాణాం త్వక్ఛేదే కృతే యది మూసావ్యవస్థామఙ్గనం న భవతి తర్హి మయా విశ్రామవారే మానుషః సమ్పూర్ణరూపేణ స్వస్థోఽకారి తత్కారణాద్ యూయం కిం మహ్యం కుప్యథ?
24 ౨౪ బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
సపక్షపాతం విచారమకృత్వా న్యాయ్యం విచారం కురుత|
25 ౨౫ యెరూషలేము వారిలో కొందరు, “వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా?
తదా యిరూశాలమ్ నివాసినః కతిపయజనా అకథయన్ ఇమే యం హన్తుం చేష్టన్తే స ఏవాయం కిం న?
26 ౨౬ చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయనను ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి?
కిన్తు పశ్యత నిర్భయః సన్ కథాం కథయతి తథాపి కిమపి అ వదన్త్యేతే అయమేవాభిషిక్త్తో భవతీతి నిశ్చితం కిమధిపతయో జానన్తి?
27 ౨౭ అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు” అని చెప్పుకున్నారు.
మనుజోయం కస్మాదాగమద్ ఇతి వయం జానోమః కిన్త్వభిషిక్త్త ఆగతే స కస్మాదాగతవాన్ ఇతి కోపి జ్ఞాతుం న శక్ష్యతి|
28 ౨౮ కాబట్టి యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ, “మీకు నేను తెలుసు. నేను ఎక్కడ నుండి వచ్చానో కూడా మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.
తదా యీశు ర్మధ్యేమన్దిరమ్ ఉపదిశన్ ఉచ్చైఃకారమ్ ఉక్త్తవాన్ యూయం కిం మాం జానీథ? కస్మాచ్చాగతోస్మి తదపి కిం జానీథ? నాహం స్వత ఆగతోస్మి కిన్తు యః సత్యవాదీ సఏవ మాం ప్రేషితవాన్ యూయం తం న జానీథ|
29 ౨౯ నేను ఆయన దగ్గర నుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు” అని గొంతెత్తి చెప్పాడు.
తమహం జానే తేనాహం ప్రేరిత అగతోస్మి|
30 ౩౦ దానికి వారు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు.
తస్మాద్ యిహూదీయాస్తం ధర్త్తుమ్ ఉద్యతాస్తథాపి కోపి తస్య గాత్రే హస్తం నార్పయద్ యతో హేతోస్తదా తస్య సమయో నోపతిష్ఠతి|
31 ౩౧ ప్రజల్లో అనేక మంది ఆయనలో విశ్వాసముంచారు. “క్రీస్తు వచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటి” అని వారు చెప్పుకున్నారు.
కిన్తు బహవో లోకాస్తస్మిన్ విశ్వస్య కథితవాన్తోఽభిషిక్త్తపురుష ఆగత్య మానుషస్యాస్య క్రియాభ్యః కిమ్ అధికా ఆశ్చర్య్యాః క్రియాః కరిష్యతి?
32 ౩౨ ప్రజలు ఆయనను గురించి ఇలా మాట్లాడుకోవడం పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. అప్పుడు ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆయనను పట్టుకోడానికి సైనికులను పంపించారు.
తతః పరం లోకాస్తస్మిన్ ఇత్థం వివదన్తే ఫిరూశినః ప్రధానయాజకాఞ్చేతి శ్రుతవన్తస్తం ధృత్వా నేతుం పదాతిగణం ప్రేషయామాసుః|
33 ౩౩ యేసు మాట్లాడుతూ, “నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. ఆ తరువాత నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్ళిపోతాను.
తతో యీశురవదద్ అహమ్ అల్పదినాని యుష్మాభిః సార్ద్ధం స్థిత్వా మత్ప్రేరయితుః సమీపం యాస్యామి|
34 ౩౪ అప్పుడు మీరు నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు” అన్నాడు.
మాం మృగయిష్యధ్వే కిన్తూద్దేశం న లప్స్యధ్వే రత్ర స్థాస్యామి తత్ర యూయం గన్తుం న శక్ష్యథ|
35 ౩౫ దానికి యూదులు, “మనకు కనిపించకుండా ఈయన ఎక్కడికి వెళ్తాడు? గ్రీసు దేశం వెళ్ళి అక్కడ చెదరి ఉన్న యూదులకు, గ్రీకు వారికి ఉపదేశం చేస్తాడా?
తదా యిహూదీయాః పరస్పరం వక్త్తుమారేభిరే అస్యోద్దేశం న ప్రాప్స్యామ ఏతాదృశం కిం స్థానం యాస్యతి? భిన్నదేశే వికీర్ణానాం యిహూదీయానాం సన్నిధిమ్ ఏష గత్వా తాన్ ఉపదేక్ష్యతి కిం?
36 ౩౬ ‘నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు’ అన్న మాటలకి అర్థం ఏమిటో” అంటూ తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు.
నో చేత్ మాం గవేషయిష్యథ కిన్తూద్దేశం న ప్రాప్స్యథ ఏష కోదృశం వాక్యమిదం వదతి?
37 ౩౭ ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి.
అనన్తరమ్ ఉత్సవస్య చరమేఽహని అర్థాత్ ప్రధానదినే యీశురుత్తిష్ఠన్ ఉచ్చైఃకారమ్ ఆహ్వయన్ ఉదితవాన్ యది కశ్చిత్ తృషార్త్తో భవతి తర్హి మమాన్తికమ్ ఆగత్య పివతు|
38 ౩౮ లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు.
యః కశ్చిన్మయి విశ్వసితి ధర్మ్మగ్రన్థస్య వచనానుసారేణ తస్యాభ్యన్తరతోఽమృతతోయస్య స్రోతాంసి నిర్గమిష్యన్తి|
39 ౩౯ తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
యే తస్మిన్ విశ్వసన్తి త ఆత్మానం ప్రాప్స్యన్తీత్యర్థే స ఇదం వాక్యం వ్యాహృతవాన్ ఏతత్కాలం యావద్ యీశు ర్విభవం న ప్రాప్తస్తస్మాత్ పవిత్ర ఆత్మా నాదీయత|
40 ౪౦ ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు.
ఏతాం వాణీం శ్రుత్వా బహవో లోకా అవదన్ అయమేవ నిశ్చితం స భవిష్యద్వాదీ|
41 ౪౧ మరికొందరు, “ఈయన క్రీస్తే” అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, “ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా?
కేచిద్ అకథయన్ ఏషఏవ సోభిషిక్త్తః కిన్తు కేచిద్ అవదన్ సోభిషిక్త్తః కిం గాలీల్ ప్రదేశే జనిష్యతే?
42 ౪౨ క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు.
సోభిషిక్త్తో దాయూదో వంశే దాయూదో జన్మస్థానే బైత్లేహమి పత్తనే జనిష్యతే ధర్మ్మగ్రన్థే కిమిత్థం లిఖితం నాస్తి?
43 ౪౩ ఈ విధంగా ప్రజల్లో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది.
ఇత్థం తస్మిన్ లోకానాం భిన్నవాక్యతా జాతా|
44 ౪౪ వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు.
కతిపయలోకాస్తం ధర్త్తుమ్ ఐచ్ఛన్ తథాపి తద్వపుషి కోపి హస్తం నార్పయత్|
45 ౪౫ పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, “మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు.
అనన్తరం పాదాతిగణే ప్రధానయాజకానాం ఫిరూశినాఞ్చ సమీపమాగతవతి తే తాన్ అపృచ్ఛన్ కుతో హేతోస్తం నానయత?
46 ౪౬ దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.
తదా పదాతయః ప్రత్యవదన్ స మానవ ఇవ కోపి కదాపి నోపాదిశత్|
47 ౪౭ దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా?
తతః ఫిరూశినః ప్రావోచన్ యూయమపి కిమభ్రామిష్ట?
48 ౪౮ అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా?
అధిపతీనాం ఫిరూశినాఞ్చ కోపి కిం తస్మిన్ వ్యశ్వసీత్?
49 ౪౯ ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు.
యే శాస్త్రం న జానన్తి త ఇమేఽధమలోకాఏవ శాపగ్రస్తాః|
50 ౫౦ అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు,
తదా నికదీమనామా తేషామేకో యః క్షణదాయాం యీశోః సన్నిధిమ్ అగాత్ స ఉక్త్తవాన్
51 ౫౧ “ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు.
తస్య వాక్యే న శ్రుతే కర్మ్మణి చ న విదితే ఽస్మాకం వ్యవస్థా కిం కఞ్చన మనుజం దోషీకరోతి?
52 ౫౨ దానికి వారు, “నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు” అన్నారు.
తతస్తే వ్యాహరన్ త్వమపి కిం గాలీలీయలోకః? వివిచ్య పశ్య గలీలి కోపి భవిష్యద్వాదీ నోత్పద్యతే|
53 ౫౩ ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.
తతః పరం సర్వ్వే స్వం స్వం గృహం గతాః కిన్తు యీశు ర్జైతుననామానం శిలోచ్చయం గతవాన్|