< యోహాను 6 >
1 ౧ ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.
Po teh besedah se je Jezus peljal preko Galilejskega morja, kar je Tiberijsko morje.
2 ౨ రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
Sledila mu je velika množica, ker so videli njegove čudeže, ki jih je storil na teh, ki so bili bolni.
3 ౩ యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.
In Jezus je odšel gor na goro ter tam sédel s svojimi učenci.
4 ౪ యూదుల పస్కా పండగ దగ్గర పడింది.
In blizu je bila pasha, judovski praznik.
5 ౫ యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.
Ko je Jezus tedaj povzdignil svoje oči in zagledal k njemu prihajati veliko skupino, reče Filipu: »Od kod naj kupimo kruha, da bodo ti lahko jedli?«
6 ౬ యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
To pa je rekel, da bi ga preizkusil, kajti sam je vedel, kaj bo storil.
7 ౭ దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.
Filip mu je odgovoril: »Dvesto denarjev kruha zanje ni zadosti, da bi vsak izmed njih lahko nekaj vzel.«
8 ౮ ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ
Eden izmed njegovih učencev, Andrej, brat Simona Petra, mu reče:
9 ౯ “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.
»Tukaj je deček, ki ima pet ječmenovih hlebov in dve majhni ribi. Toda kaj je to med tako mnogimi?«
10 ౧౦ యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.
In Jezus je dejal: »Storite, da se ljudje usedejo.« Torej na tem kraju je bilo mnogo trave. Tako so se ljudje usedli, po številu okoli pet tisoč.
11 ౧౧ యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.
In Jezus je vzel hlebe in ko se je zahvalil, je razdelil učencem in učenci tem, ki so se usedli, in podobno od rib, toliko, kolikor so hoteli.
12 ౧౨ అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.
Ko so bili nasičeni, je svojim učencem rekel: »Zberite odlomke, ki ostanejo, da ne bo nič izgubljeno.«
13 ౧౩ అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
Zato so jih zbrali skupaj in napolnili dvanajst košar z odlomki od petih ječmenovih hlebov, ki so ostali vrh tega tem, ki so jedli.
14 ౧౪ వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.
Tedaj so ti ljudje, ko so videli čudež, ki ga je Jezus storil, rekli: »To je resnično ta prerok, ki naj bi prišel na svet.«
15 ౧౫ వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.
Ko je torej Jezus zaznal, da bodo prišli in ga s silo odvedli, da ga postavijo za kralja, je ponovno sam odšel na goro.
16 ౧౬ సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.
In sedaj, ko je prišel večer, so njegovi učenci odšli dol k morju
17 ౧౭ అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.
in vstopili na ladjo ter se preko morja peljali proti Kafarnáumu. Bilo pa je že temno in Jezus ni prišel k njim.
18 ౧౮ అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
Zaradi velikega vetra, ki je pihal, se je morje vzdignilo.
19 ౧౯ వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
Ko so preveslali že okoli petindvajset ali trideset dolžin brazd, so zagledali Jezusa hoditi po morju in prihajati bliže k ladji in bili so prestrašeni.
20 ౨౦ అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.
Toda on jim reče: »Jaz sem, ne bodite prestrašeni.«
21 ౨౧ ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
Potem so ga voljno sprejeli na ladjo in ladja je bila takoj pri deželi, kamor so šli.
22 ౨౨ తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు.
Naslednjega dne, ko je množica, ki je stala na drugi strani morja, videla, da tam ni bilo nobenega drugega čolna, razen tistega, v katerega so vstopili njegovi učenci in da Jezus s svojimi učenci ni vstopil na čoln, temveč, da so njegovi učenci odšli sami
23 ౨౩ అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
(čeprav so iz Tiberije prišli drugi čolni v bližino kraja, kjer so jedli kruh, potem ko se je Gospod zahvalil);
24 ౨౪ యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు.
ko je množica torej videla, da Jezusa ni bilo tam niti njegovih učencev, so se tudi sami, ker so iskali Jezusa, vkrcali in prišli v Kafarnáum.
25 ౨౫ సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.
In ko so ga našli na drugi strani morja, so mu rekli: »Rabi, kdaj si prišel sèm?«
26 ౨౬ యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు.
Jezus jim je odgovoril in rekel: »Resnično, resnično, povem vam: ›Ne iščete me, ker ste videli čudeže, temveč ker ste jedli od hlebov in bili nasičeni.‹
27 ౨౭ పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. (aiōnios )
Ne trudite se za jed, ki propada, temveč za jed, ki vzdrži v večno življenje, ki vam jo bo dal Sin človekov, kajti njega je potrdil Oče Bog.« (aiōnios )
28 ౨౮ అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు.
Tedaj so mu rekli: »Kaj naj storimo, da bomo lahko delali Božja dela?«
29 ౨౯ దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.
Jezus je odgovoril in jim rekel: »Božje delo je to, da verujete v tistega, ki ga je on poslal.«
30 ౩౦ వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు?
Rekli so mu torej: »Kakšno znamenje torej pokažeš, da bomo lahko videli in ti verovali? Kaj delaš?
31 ౩౧ ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు.
Naši očetje so v puščavi jedli mano, kakor je pisano: ›Kruh iz nebes jim je dajal jesti.‹«
32 ౩౨ అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.
Potem jim je Jezus rekel: »Resnično, resnično, povem vam: ›Ni vam Mojzes dal tega kruha iz nebes, temveč vam moj Oče daje resničen kruh iz nebes.‹
33 ౩౩ అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.”
Kajti Božji kruh je tisti, ki prihaja dol iz nebes in daje svetu življenje.«
34 ౩౪ అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.
Tedaj so mu rekli: »Gospod, vselej nam daj tega kruha.«
35 ౩౫ దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
In Jezus jim je rekel: »Jaz sem kruh življenja. Kdor prihaja k meni, ne bo nikoli lačen. In kdor vame veruje, ne bo nikoli žejen.
36 ౩౬ కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.
Toda rekel sem vam: ›Da ste me vi tudi videli, pa ne verujete.‹
37 ౩౭ తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను.
Vse, kar mi daje Oče, bo prišlo k meni, in tistega, ki prihaja k meni, nikakor ne bom izgnal ven.
38 ౩౮ ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.
Kajti prišel sem dol iz nebes, ne da delam svojo lastno voljo, temveč voljo tistega, ki me je poslal.
39 ౩౯ ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం.
In to je volja Očeta, ki me je poslal, da od vsega, kar mi je dal, ne bi ničesar izgubil, temveč bi ob poslednjem dnevu to ponovno dvignil.
40 ౪౦ ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.” (aiōnios )
In to je volja tistega, ki me je poslal, da bo vsakdo, ki vidi Sina in veruje vanj, lahko imel večno življenje in jaz ga bom dvignil na poslednji dan.« (aiōnios )
41 ౪౧ ‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.
Judje so tedaj godrnjali nad njim, ker je rekel: »Jaz sem kruh, ki je prišel dol iz nebes.«
42 ౪౨ “ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు.
In govorili so: »Ali ni to Jezus, Jožefov sin, katerega očeta in mater poznamo? Kako to potem, da pravi: ›Prišel sem dol iz nebes?‹«
43 ౪౩ యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి.
Jezus je torej odgovoril in jim rekel: »Ne godrnjajte med seboj.
44 ౪౪ తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.
Nihče ne more priti k meni, razen če ga ne pritegne Oče, ki me je poslal in jaz ga bom dvignil na poslednji dan.
45 ౪౫ వారికి దేవుడు ఉపదేశిస్తాడు, అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు.
V prerokih je pisano: ›In vsi bodo poučeni od Boga.‹ Vsak torej, ki je slišal in se naučil od Očeta, prihaja k meni.
46 ౪౬ దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు.
Ne da je katerikoli človek videl Očeta, samo tisti, ki je od Boga, on je videl Očeta.
47 ౪౭ కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు. (aiōnios )
Resnično, resnično, povem vam: ›Kdor veruje vame, ima večno življenje.‹ (aiōnios )
Jaz sem ta kruh življenja.
49 ౪౯ మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
Vaši očetje so v divjini jedli mano in so mrtvi.
50 ౫౦ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.
To je kruh, ki prihaja dol iz nebes, da lahko človek od tega jé in ne umre.
51 ౫౧ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.” (aiōn )
Jaz sem živi kruh, ki je prišel dol iz nebes. Če katerikoli človek od tega kruha jé, bo živel večno, in kruh, ki ga bom jaz dal, je moje meso, ki ga bom dal za življenje sveta.« (aiōn )
52 ౫౨ యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు.
Judje so se torej med seboj prepirali, rekoč: »Kako nam lahko ta človek da jesti svoje meso?«
53 ౫౩ అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
Tedaj jim je Jezus rekel: »Resnično, resnično, povem vam: ›Razen, če ne jeste mesa Sina človekovega in ne pijete njegove krvi, v sebi nimate življenja.
54 ౫౪ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. (aiōnios )
Kdorkoli jé moje meso in pije mojo kri, ima večno življenje in jaz ga bom dvignil na poslednji dan.‹ (aiōnios )
55 ౫౫ నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.
Kajti zares je moje meso hrana in zares je moja kri pijača.
56 ౫౬ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను.
Kdor jé moje meso in pije mojo kri, prebiva v meni in jaz v njem.
57 ౫౭ సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.
Kakor me je poslal živi Oče in jaz živim po Očetu. Ravno tako, kdor mene jé, celó ta bo živel po meni.
58 ౫౮ పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” (aiōn )
To je ta kruh, ki je prišel dol iz nebes. Ne kakor vaši očetje, ki so jedli mano in so mrtvi. Kdor jé od tega kruha, bo živel večno.« (aiōn )
59 ౫౯ ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
Te stvari je povedal v sinagogi, ko je učil v Kafarnáumu.
60 ౬౦ ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.
Zatorej so mnogi izmed njegovih učencev, ko so to slišali, rekli: »To je trda beseda, kdo jo lahko posluša?«
61 ౬౧ తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా?
Potem ko je Jezus v sebi vedel, da so njegovi učenci nad tem godrnjali, jim je rekel: »Ali vas to pohujšuje?
62 ౬౨ మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?
Kaj pa, če boste videli Sina človekovega dvigniti se gor, kjer je bil prej?
63 ౬౩ జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.
Duh je, ki oživlja, meso nič ne koristi. Besede, ki vam jih govorim, te so duh in te so življenje.
64 ౬౪ కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.
Toda tam so nekateri izmed vas, ki ne verujejo.« Kajti Jezus je že od začetka vedel kdo so bili ti, ki niso verovali in kdo naj bi ga izdal.
65 ౬౫ ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.
In rekel je: »Zato sem vam rekel, da nihče ne more priti k meni, razen če mu ni dano od mojega Očeta.«
66 ౬౬ ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.
Od tega časa je mnogo izmed njegovih učencev odšlo nazaj in niso več hodili z njim.
67 ౬౭ అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
Tedaj je Jezus dvanajsterim rekel: »Ali hočete tudi vi oditi?«
68 ౬౮ సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. (aiōnios )
Potem mu je Simon Peter odgovoril: »Gospod, h komu naj gremo? Ti imaš besede večnega življenja. (aiōnios )
69 ౬౯ నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.
In mi verujemo in smo prepričani, da si ti ta Kristus, Sin živega Boga.«
70 ౭౦ యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు.
Jezus jim je odgovoril: »Ali vas nisem izbral dvanajst in je eden izmed vas hudič?«
71 ౭౧ పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.
Govoril je o Judu Iškarijotu, Simonovem sinu, kajti on je bil ta, ki naj bi ga izdal in je izmed dvanajsterice.