< యోహాను 6 >

1 ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.
After these things, Jesus went away across the sea of Galilee, that is, of Tiberias;
2 రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
and there was following him a great multitude, because they had been viewing the signs which he did upon such as were sick.
3 యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.
But Jesus had gone up into the mountain, and, there, was sitting with his disciples.
4 యూదుల పస్కా పండగ దగ్గర పడింది.
Now the passover was near, the feast of the Jews.
5 యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.
So then Jesus, lifting up his eyes, and beholding that a great multitude was coming unto him, saith unto Philip—Whence are we to buy loaves, that these may eat?
6 యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
But, this, he was saying, to test him; for, he himself, knew, what he was about to do.
7 దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.
Philip answered him—Two hundred denaries-worth of loaves, are not sufficient for them, that, each one, may take, a little.
8 ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ
One from among his disciples, Andrew, the brother of Simon Peter, saith unto him—
9 “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.
There is a little lad here, that hath five barley loaves, and two small fishes, —but, these, —what are they, for such numbers?
10 ౧౦ యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.
Jesus said—Make the people recline. Now there was much grass in the place. So the men reclined, to the number of about five thousand.
11 ౧౧ యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.
Jesus therefore took the loaves, and, giving thanks, went on distributing unto them that reclined; in like manner, of the small fishes also: as much as they were wishing.
12 ౧౨ అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.
And, when they were well-filled, he saith unto his disciples—Gather up the broken pieces left over, that nothing be lost.
13 ౧౩ అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
So they gathered them up, and filled twelve baskets, with broken pieces out of the five barley loaves, —which were left over by them who had eaten.
14 ౧౪ వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.
The people, therefore, seeing what signs he wrought, began to say—This, is, of a truth, the prophet who was to come into the world.
15 ౧౫ వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.
Jesus, therefore, getting to know that they were about to come, and seize him, that they might make him king, retired again into the mountain, himself, alone.
16 ౧౬ సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.
But, when evening came, his disciples went down unto the sea;
17 ౧౭ అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.
and, entering into a boat, were going across the sea into Capernaum. And, dark, already, had it become, and, not yet, had Jesus reached them;
18 ౧౮ అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
moreover the sea, by reason of a great wind that blew, was rising high.
19 ౧౯ వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
Having therefore rowed about twenty-five or thirty furlongs, they observe Jesus, walking upon the sea, and, near the boat, coming; and they were affrighted.
20 ౨౦ అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.
But, he, saith unto them—It is, I: be not affrighted!
21 ౨౧ ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
They were willing, therefore, to receive him into the boat; and, straightway, the boat was at land, whither they had been slowly going.
22 ౨౨ తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు.
On the morrow, the multitude that was standing on the other side of the sea, saw that there was not, another small-boat, there, save one, —and that Jesus entered not, along with his disciples, unto the boat, but that, alone, his disciples departed: —
23 ౨౩ అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
howbeit there came boats out of Tiberias, near the place where they did eat the bread, after the Lord had given thanks: —
24 ౨౪ యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు.
When, therefore, the multitude saw, that, Jesus, was not there, nor yet his disciples, they themselves, got into the small boats, and came unto Capernaum, seeking Jesus;
25 ౨౫ సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.
and, finding him on the other side of the sea, they said unto him—Rabbi! when, camest thou, hither?
26 ౨౬ యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు.
Jesus answered them, and said—Verily, verily, I say unto you: Ye seek me, not because ye saw signs, but because ye did eat of the loaves and were filled.
27 ౨౭ పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. (aiōnios g166)
Be working, not for the food that perisheth, but for the food that endureth unto life age-abiding, —which, the Son of Man, unto you, will give; for upon, the same, hath the Father, even God, set his seal. (aiōnios g166)
28 ౨౮ అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు.
They said, therefore, unto him—What are we to do, that we may be working the works of God?
29 ౨౯ దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.
Jesus answered, and said unto them—This, is the work of God: that ye believe on him whom, he, hath sent forth.
30 ౩౦ వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు?
They said, therefore, unto him—What, then, art, thou, doing, by way of sign, that we may see, and believe in thee: what art thou working?
31 ౩౧ ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు.
Our fathers, did eat, the manna, in the desert, —just as it is written: Bread out of heaven, he gave them to eat.
32 ౩౨ అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.
Jesus said unto them—Verily, verily, I say unto you: Not Moses, gave you the bread out of heaven; but, my Father, giveth you the real bread out of heaven.
33 ౩౩ అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.”
For, the bread of God, is that which is coming down out of heaven, and giving, life, unto the world.
34 ౩౪ అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.
They said, therefore, unto him—Sir! Evermore, give us this bread.
35 ౩౫ దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
Jesus said unto them—I, am the bread of life: he that cometh unto me, in nowise shall hunger, and, he that believeth on me, in nowise shall thirst, any more.
36 ౩౬ కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.
But I told you—Ye have even seen [me], and yet do not believe.
37 ౩౭ తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను.
All that which the Father is giving me, unto me, will have come, and, him that cometh unto me, in nowise will I cast out, —
38 ౩౮ ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.
Because I have come down from heaven, —Not that I should be doing my own will, but the will of him that sent me.
39 ౩౯ ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం.
And, this, is the will of him that sent me, That, of all that which he hath given me, I should lose nothing, but should raise it up at the last day.
40 ౪౦ ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.” (aiōnios g166)
For, this, is the will of my Father, That, every one that vieweth the Son, and believeth on him, should have life age-abiding, and, I, should raise him up, at the last day. (aiōnios g166)
41 ౪౧ ‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.
The Jews, therefore, began to murmur concerning him, because he said—I, am the bread that came down out of heaven;
42 ౪౨ “ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు.
and were saying—Is not, this, Jesus, the son of Joseph, —of whom, we, know the father and the mother! How is it then, that he, now, saith: Out of heaven, have I come down?
43 ౪౩ యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి.
Jesus answered, and said unto them—Be not murmuring, one with another:
44 ౪౪ తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.
No one, can come unto me, except, the Father who sent me, draw him, —and, I, will raise him up, in the last day.
45 ౪౫ వారికి దేవుడు ఉపదేశిస్తాడు, అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు.
It is written in the prophets, —And they shall be, all, the instructed of God: Every one who hath heard of the Father, and learned, cometh unto me.
46 ౪౬ దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు.
Not that any one hath seen, the Father, save he who is from God, —this one, hath seen the Father.
47 ౪౭ కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు. (aiōnios g166)
Verily, verily, I say unto you: He that believeth, hath life age-abiding. (aiōnios g166)
48 ౪౮ జీవాహారం నేనే.
I am the bread of life: —
49 ౪౯ మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
Your fathers, did eat, in the desert, the manna, —and died:
50 ౫౦ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.
This, is the bread which, out of heaven, cometh down, that one, thereof, may eat, —and not die.
51 ౫౧ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.” (aiōn g165)
I, am the living bread, which, out of heaven, came down: If one eat of this bread, he shall live unto times age-abiding; and, the bread, moreover, which, I, will give, is, my flesh—for the world’s life. (aiōn g165)
52 ౫౨ యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు.
The Jews, therefore, began to strive one with another, saying—How can this one, unto us, give his flesh to eat?
53 ౫౩ అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
Jesus, therefore, said unto them—Verily, verily, I say unto you—Except ye eat the flesh of the Son of Man, and drink his blood, ye have not life within yourselves.
54 ౫౪ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. (aiōnios g166)
He that feedeth upon my flesh, and drinketh my blood, hath life age-abiding, and, I, will raise him up at the last day; (aiōnios g166)
55 ౫౫ నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.
For, my flesh, is, true, food, and, my blood, is, true, drink:
56 ౫౬ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను.
He that feedeth upon my flesh, and drinketh my blood, in me, abideth, and, I, in him.
57 ౫౭ సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.
Just as the living Father sent me, —and I live by reason of the Father, he also that feedeth upon me, even he, shall live by reason of me.
58 ౫౮ పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” (aiōn g165)
This, is the bread, which, out of heaven, came down: —Not just as your fathers did eat—and died! He that feedeth upon this bread, shall live unto times age-abiding. (aiōn g165)
59 ౫౯ ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
These things, said he, as, in a synagogue, he was teaching, in Capernaum.
60 ౬౦ ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.
Many, of his disciples, therefore, when they heard, said—Hard, is this discourse, —Who can, thereunto, hearken?
61 ౬౧ తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా?
But Jesus, knowing within himself that his disciples were murmuring concerning this, said unto them—Doth, this, cause, you, to stumble?
62 ౬౨ మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?
[What] then, if ye should view the Son of Man ascending where he was before? …
63 ౬౩ జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.
The spirit, it is, that giveth life, —the flesh, profiteth, nothing: The declarations which, I, have spoken unto you, are, spirit, and, are, life.
64 ౬౪ కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.
But there are some from among you, who do not believe. For Jesus knew from the beginning, who they were that did not believe, and who it was would deliver him up; —
65 ౬౫ ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.
and he went on to say—For this cause, have I said unto you: No one, can come unto me, except it have been given him, of the Father.
66 ౬౬ ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.
Because of this, many from among his disciples, went away back, and, no longer, with him, were walking.
67 ౬౭ అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
Jesus, therefore, said unto the twelve—Are, ye also, wishing to withdraw?
68 ౬౮ సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. (aiōnios g166)
Simon Peter answered him—Lord! unto whom, shall we go? Declarations of life age-abiding, thou hast; (aiōnios g166)
69 ౬౯ నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.
And, we, have believed, and come to know, —that, thou, art the Holy One of God.
70 ౭౦ యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు.
Jesus answered them—Did not, I, make choice, of you, the twelve? And yet, from among you, one, is, an adversary.
71 ౭౧ పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.
Now he was speaking of Judas, son of Simon Iscariot: for, the same, was about to deliver him up, —one of the twelve.

< యోహాను 6 >