< యోహాను 5 >

1 ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
ཏཏཿ པརཾ ཡིཧཱུདཱིཡཱནཱམ྄ ཨུཏྶཝ ཨུཔསྠིཏེ ཡཱིཤུ ཪྻིརཱུཤཱལམཾ གཏཝཱན྄།
2 యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి.
ཏསྨིནྣགརེ མེཥནཱམྣོ དྭཱརསྱ སམཱིཔེ ཨིབྲཱིཡབྷཱཥཡཱ བཻཐེསྡཱ ནཱམྣཱ པིཥྐརིཎཱི པཉྩགྷཊྚཡུཀྟཱསཱིཏ྄།
3 (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
ཏསྱཱསྟེཥུ གྷཊྚེཥུ ཀིལཱལཀམྤནམ྄ ཨཔེཀྵྱ ཨནྡྷཁཉྩཤུཥྐཱངྒཱདཡོ བཧཝོ རོགིཎཿ པཏནྟསྟིཥྛནྟི སྨ།
4
ཡཏོ ཝིཤེཥཀཱལེ ཏསྱ སརསོ ཝཱརི སྭརྒཱིཡདཱུཏ ཨེཏྱཱཀམྤཡཏ྄ ཏཏྐཱིལཱལཀམྤནཱཏ྄ པརཾ ཡཿ ཀཤྩིད྄ རོགཱི པྲཐམཾ པཱནཱིཡམཝཱརོཧཏ྄ ས ཨེཝ ཏཏྐྵཎཱད྄ རོགམུཀྟོ྅བྷཝཏ྄།
5 అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
ཏདཱཥྚཱཏྲིཾཤདྭརྵཱཎི ཡཱཝད྄ རོགགྲསྟ ཨེཀཛནསྟསྨིན྄ སྠཱནེ སྠིཏཝཱན྄།
6 యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు.
ཡཱིཤུསྟཾ ཤཡིཏཾ དྲྀཥྚྭཱ བཧུཀཱལིཀརོགཱིཏི ཛྙཱཏྭཱ ཝྱཱཧྲྀཏཝཱན྄ ཏྭཾ ཀིཾ སྭསྠོ བུབྷཱུཥསི?
7 అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు.
ཏཏོ རོགཱི ཀཐིཏཝཱན྄ ཧེ མཧེཙྪ ཡདཱ ཀཱིལཱལཾ ཀམྤཏེ ཏདཱ མཱཾ པུཥྐརིཎཱིམ྄ ཨཝརོཧཡིཏུཾ མམ ཀོཔི ནཱསྟི, ཏསྨཱན྄ མམ གམནཀཱལེ ཀཤྩིདནྱོ྅གྲོ གཏྭཱ ཨཝརོཧཏི།
8 యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు.
ཏདཱ ཡཱིཤུརཀཐཡད྄ ཨུཏྟིཥྛ, ཏཝ ཤཡྻཱམུཏྟོལྱ གྲྀཧཱིཏྭཱ ཡཱཧི།
9 వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.
ས ཏཏྐྵཎཱཏ྄ སྭསྠོ བྷཱུཏྭཱ ཤཡྻཱམུཏྟོལྱཱདཱཡ གཏཝཱན྄ ཀིནྟུ ཏདྡིནཾ ཝིཤྲཱམཝཱརཿ།
10 ౧౦ అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు.
ཏསྨཱད྄ ཡིཧཱུདཱིཡཱཿ སྭསྠཾ ནརཾ ཝྱཱཧརན྄ ཨདྱ ཝིཤྲཱམཝཱརེ ཤཡནཱིཡམཱདཱཡ ན ཡཱཏཝྱམ྄།
11 ౧౧ అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు.
ཏཏཿ ས པྲཏྱཝོཙད྄ ཡོ མཱཾ སྭསྠམ྄ ཨཀཱརྵཱིཏ྄ ཤཡནཱིཡམ྄ ཨུཏྟོལྱཱདཱཡ ཡཱཏུཾ མཱཾ ས ཨེཝཱདིཤཏ྄།
12 ౧౨ అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు.
ཏདཱ ཏེ྅པྲྀཙྪན྄ ཤཡནཱིཡམ྄ ཨུཏྟོལྱཱདཱཡ ཡཱཏུཾ ཡ ཨཱཛྙཱཔཡཏ྄ ས ཀཿ?
13 ౧౩ అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ཀིནྟུ ས ཀ ཨིཏི སྭསྠཱིབྷཱུཏོ ནཱཛཱནཱད྄ ཡཏསྟསྨིན྄ སྠཱནེ ཛནཏཱསཏྟྭཱད྄ ཡཱིཤུཿ སྠཱནཱནྟརམ྄ ཨཱགམཏ྄།
14 ౧౪ ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు.
ཏཏཿ པརཾ ཡེཤུ རྨནྡིརེ ཏཾ ནརཾ སཱཀྵཱཏྤྲཱཔྱཱཀཐཡཏ྄ པཤྱེདཱནཱིམ྄ ཨནཱམཡོ ཛཱཏོསི ཡཐཱདྷིཀཱ དུརྡཤཱ ན གྷཊཏེ ཏདྡྷེཏོཿ པཱཔཾ ཀརྨྨ པུནརྨཱཀཱརྵཱིཿ།
15 ౧౫ వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
ཏཏཿ ས གཏྭཱ ཡིཧཱུདཱིཡཱན྄ ཨཝདད྄ ཡཱིཤུ རྨཱམ྄ ཨརོགིཎམ྄ ཨཀཱརྵཱིཏ྄།
16 ౧౬ ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
ཏཏོ ཡཱིཤུ ཪྻིཤྲཱམཝཱརེ ཀརྨྨེདྲྀཤཾ ཀྲྀཏཝཱན྄ ཨིཏི ཧེཏོ ཪྻིཧཱུདཱིཡཱསྟཾ ཏཱཌཡིཏྭཱ ཧནྟུམ྄ ཨཙེཥྚནྟ།
17 ౧౭ యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.
ཡཱིཤུསྟཱནཱཁྱཏ྄ མམ པིཏཱ ཡཏ྄ ཀཱཪྻྱཾ ཀརོཏི ཏདནུརཱུཔམ྄ ཨཧམཔི ཀརོཏི།
18 ౧౮ ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
ཏཏོ ཡིཧཱུདཱིཡཱསྟཾ ཧནྟུཾ པུནརཡཏནྟ ཡཏོ ཝིཤྲཱམཝཱརཾ ནཱམནྱཏ ཏདེཝ ཀེཝལཾ ན ཨདྷིཀནྟུ ཨཱིཤྭརཾ སྭཔིཏརཾ པྲོཙྱ སྭམཔཱིཤྭརཏུལྱཾ ཀྲྀཏཝཱན྄།
19 ౧౯ కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
པཤྩཱད྄ ཡཱིཤུརཝདད྄ ཡུཥྨཱནཧཾ ཡཐཱརྠཏརཾ ཝདཱམི པུཏྲཿ པིཏརཾ ཡདྱཏ྄ ཀརྨྨ ཀུཪྻྭནྟཾ པཤྱཏི ཏདཏིརིཀྟཾ སྭེཙྪཱཏཿ ཀིམཔི ཀརྨྨ ཀརྟྟུཾ ན ཤཀྣོཏི། པིཏཱ ཡཏ྄ ཀརོཏི པུཏྲོཔི ཏདེཝ ཀརོཏི།
20 ౨౦ తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు.
པིཏཱ པུཏྲེ སྣེཧཾ ཀརོཏི ཏསྨཱཏ྄ སྭཡཾ ཡདྱཏ྄ ཀརྨྨ ཀརོཏི ཏཏྶཪྻྭཾ པུཏྲཾ དརྴཡཏི; ཡཐཱ ཙ ཡུཥྨཱཀཾ ཨཱཤྩཪྻྱཛྙཱནཾ ཛནིཥྱཏེ ཏདརྠམ྄ ཨིཏོཔི མཧཱཀརྨྨ ཏཾ དརྴཡིཥྱཏི།
21 ౨౧ “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
ཝསྟུཏསྟུ པིཏཱ ཡཐཱ པྲམིཏཱན྄ ཨུཏྠཱཔྱ སཛིཝཱན྄ ཀརོཏི ཏདྭཏ྄ པུཏྲོཔི ཡཾ ཡཾ ཨིཙྪཏི ཏཾ ཏཾ སཛཱིཝཾ ཀརོཏི།
22 ౨౨ తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
སཪྻྭེ པིཏརཾ ཡཐཱ སཏྐུཪྻྭནྟི ཏཐཱ པུཏྲམཔི སཏྐཱརཡིཏུཾ པིཏཱ སྭཡཾ ཀསྱཱཔི ཝིཙཱརམཀྲྀཏྭཱ སཪྻྭཝིཙཱརཱཎཱཾ བྷཱརཾ པུཏྲེ སམརྤིཏཝཱན྄།
23 ౨౩ దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
ཡཿ པུཏྲཾ སཏ྄ ཀརོཏི ས ཏསྱ པྲེརཀམཔི སཏ྄ ཀརོཏི།
24 ౨౪ కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. (aiōnios g166)
ཡུཥྨཱནཱཧཾ ཡཐཱརྠཏརཾ ཝདཱམི ཡོ ཛནོ མམ ཝཱཀྱཾ ཤྲུཏྭཱ མཏྤྲེརཀེ ཝིཤྭསིཏི སོནནྟཱཡུཿ པྲཱཔྣོཏི ཀདཱཔི དཎྜབཱཛནཾ ན བྷཝཏི ནིདྷནཱདུཏྠཱཡ པརམཱཡུཿ པྲཱཔྣོཏི། (aiōnios g166)
25 ౨౫ మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.
ཨཧཾ ཡུཥྨཱནཏིཡཐཱརྠཾ ཝདཱམི ཡདཱ མྲྀཏཱ ཨཱིཤྭརཔུཏྲསྱ ནིནཱདཾ ཤྲོཥྱནྟི ཡེ ཙ ཤྲོཥྱནྟི ཏེ སཛཱིཝཱ བྷཝིཥྱནྟི སམཡ ཨེཏཱདྲྀཤ ཨཱཡཱཏི ཝརམ྄ ཨིདཱནཱིམཔྱུཔཏིཥྛཏི།
26 ౨౬ తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
པིཏཱ ཡཐཱ སྭཡཉྫཱིཝཱི ཏཐཱ པུཏྲཱཡ སྭཡཉྫཱིཝིཏྭཱདྷིཀཱརཾ དཏྟཝཱན྄།
27 ౨౭ అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.
ས མནུཥྱཔུཏྲཿ ཨེཏསྨཱཏ྄ ཀཱརཎཱཏ྄ པིཏཱ དཎྜཀརཎཱདྷིཀཱརམཔི ཏསྨིན྄ སམརྤིཏཝཱན྄།
28 ౨౮ “దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
ཨེཏདརྠེ ཡཱུཡམ྄ ཨཱཤྩཪྻྱཾ ན མནྱདྷྭཾ ཡཏོ ཡསྨིན྄ སམཡེ ཏསྱ ནིནཱདཾ ཤྲུཏྭཱ ཤྨཤཱནསྠཱཿ སཪྻྭེ བཧིརཱགམིཥྱནྟི སམཡ ཨེཏཱདྲྀཤ ཨུཔསྠཱསྱཏི།
29 ౨౯ అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
ཏསྨཱད྄ ཡེ སཏྐརྨྨཱཎི ཀྲྀཏཝནྟསྟ ཨུཏྠཱཡ ཨཱཡུཿ པྲཱཔྶྱནྟི ཡེ ཙ ཀུཀརྨཱཎི ཀྲྀཏཝནྟསྟ ཨུཏྠཱཡ དཎྜཾ པྲཱཔྶྱནྟི།
30 ౩౦ “నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
ཨཧཾ སྭཡཾ ཀིམཔི ཀརྟྟུཾ ན ཤཀྣོམི ཡཐཱ ཤུཎོམི ཏཐཱ ཝིཙཱརཡཱམི མམ ཝིཙཱརཉྩ ནྱཱཡྻཿ ཡཏོཧཾ སྭཱིཡཱབྷཱིཥྚཾ ནེཧིཏྭཱ མཏྤྲེརཡིཏུཿ པིཏུརིཥྚམ྄ ཨཱིཧེ།
31 ౩౧ నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
ཡདི སྭསྨིན྄ སྭཡཾ སཱཀྵྱཾ དདཱམི ཏརྷི ཏཏྶཱཀྵྱམ྄ ཨཱགྲཱཧྱཾ བྷཝཏི;
32 ౩౨ నా గురించి సాక్షమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
ཀིནྟུ མདརྠེ྅པརོ ཛནཿ སཱཀྵྱཾ དདཱཏི མདརྠེ ཏསྱ ཡཏ྄ སཱཀྵྱཾ ཏཏ྄ སཏྱམ྄ ཨེཏདཔྱཧཾ ཛཱནཱམི།
33 ౩౩ “మీరు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
ཡུཥྨཱབྷི ཪྻོཧནཾ པྲཏི ལོཀེཥུ པྲེརིཏེཥུ ས སཏྱཀཐཱཡཱཾ སཱཀྵྱམདདཱཏ྄།
34 ౩౪ కానీ నేను పొందిన సాక్ష్యం మనుషులు ఇచ్చినది కాదు. మీ రక్షణ కోసం ఈ మాటలు చెబుతున్నాను.
མཱནུཥཱདཧཾ སཱཀྵྱཾ ནོཔེཀྵེ ཏཐཱཔི ཡཱུཡཾ ཡཐཱ པརིཏྲཡདྷྭེ ཏདརྠམ྄ ཨིདཾ ཝཱཀྱཾ ཝདཱམི།
35 ౩౫ యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉండే వాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
ཡོཧན྄ དེདཱིཔྱམཱནོ དཱིཔ ཨིཝ ཏེཛསྭཱི སྠིཏཝཱན྄ ཡཱུཡམ྄ ཨལྤཀཱལཾ ཏསྱ དཱིཔྟྱཱནནྡིཏུཾ སམམནྱདྷྭཾ།
36 ౩౬ అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి.
ཀིནྟུ ཏཏྤྲམཱཎཱདཔི མམ གུརུཏརཾ པྲམཱཎཾ ཝིདྱཏེ པིཏཱ མཱཾ པྲེཥྱ ཡདྱཏ྄ ཀརྨྨ སམཱཔཡིཏུཾ ཤཀྟྟིམདདཱཏ྄ མཡཱ ཀྲྀཏཾ ཏཏྟཏ྄ ཀརྨྨ མདརྠེ པྲམཱཎཾ དདཱཏི།
37 ౩౭ నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
ཡཿ པིཏཱ མཱཾ པྲེརིཏཝཱན྄ མོཔི མདརྠེ པྲམཱཎཾ དདཱཏི། ཏསྱ ཝཱཀྱཾ ཡུཥྨཱབྷིཿ ཀདཱཔི ན ཤྲུཏཾ ཏསྱ རཱུཔཉྩ ན དྲྀཥྚཾ
38 ౩౮ ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
ཏསྱ ཝཱཀྱཉྩ ཡུཥྨཱཀམ྄ ཨནྟཿ ཀདཱཔི སྠཱནཾ ནཱཔྣོཏི ཡཏཿ ས ཡཾ པྲེཥིཏཝཱན྄ ཡཱུཡཾ ཏསྨིན྄ ན ཝིཤྭསིཐ།
39 ౩౯ లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. (aiōnios g166)
དྷརྨྨཔུསྟཀཱནི ཡཱུཡམ྄ ཨཱལོཙཡདྷྭཾ ཏཻ ཪྻཱཀྱཻརནནྟཱཡུཿ པྲཱཔྶྱཱམ ཨིཏི ཡཱུཡཾ བུདྷྱདྷྭེ ཏདྡྷརྨྨཔུསྟཀཱནི མདརྠེ པྲམཱཎཾ དདཏི། (aiōnios g166)
40 ౪౦ అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.
ཏཐཱཔི ཡཱུཡཾ པརམཱཡུཿཔྲཱཔྟཡེ མམ སཾནིདྷིམ྄ ན ཛིགམིཥཐ།
41 ౪౧ మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
ཨཧཾ མཱནུཥེབྷྱཿ སཏྐཱརཾ ན གྲྀཧླཱམི།
42 ౪౨ ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
ཨཧཾ ཡུཥྨཱན྄ ཛཱནཱམི; ཡུཥྨཱཀམནྟར ཨཱིཤྭརཔྲེམ ནཱསྟི།
43 ౪౩ “నేను నా తండ్రి పేరిట వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
ཨཧཾ ནིཛཔིཏུ རྣཱམྣཱགཏོསྨི ཏཐཱཔི མཱཾ ན གྲྀཧླཱིཐ ཀིནྟུ ཀཤྩིད྄ ཡདི སྭནཱམྣཱ སམཱགམིཥྱཏི ཏརྷི ཏཾ གྲཧཱིཥྱཐ།
44 ౪౪ ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
ཡཱུཡམ྄ ཨཱིཤྭརཱཏ྄ སཏྐཱརཾ ན ཙིཥྚཏྭཱ ཀེཝལཾ པརསྤརཾ སཏྐཱརམ྄ ཙེད྄ ཨཱདདྷྭྭེ ཏརྷི ཀཐཾ ཝིཤྭསིཏུཾ ཤཀྣུཐ?
45 ౪౫ నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
པུཏུཿ སམཱིཔེ྅ཧཾ ཡུཥྨཱན྄ ཨཔཝདིཥྱཱམཱིཏི མཱ ཙིནྟཡཏ ཡསྨིན྄, ཡསྨིན྄ ཡུཥྨཱཀཾ ཝིཤྭསཿ སཨེཝ མཱུསཱ ཡུཥྨཱན྄ ཨཔཝདཏི།
46 ౪౬ మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
ཡདི ཡཱུཡཾ ཏསྨིན྄ ཝྱཤྭསིཥྱཏ ཏརྷི མཡྻཔི ཝྱཤྭསིཥྱཏ, ཡཏ྄ ས མཡི ལིཁིཏཝཱན྄།
47 ౪౭ మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”
ཏཏོ ཡདི ཏེན ལིཁིཏཝཱནི ན པྲཏིཐ ཏརྷི མམ ཝཱཀྱཱནི ཀཐཾ པྲཏྱེཥྱཐ?

< యోహాను 5 >