< యోహాను 5 >
1 ౧ ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
Depois destas coisas, houve uma festa dos judeus, e Jesus subiu a Jerusalém.
2 ౨ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి.
Agora em Jerusalém, junto ao portão das ovelhas, há uma piscina, que é chamada em hebraico, “Betesda”, tendo cinco alpendres.
3 ౩ (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
Nestes havia uma grande multidão de doentes, cegos, coxos ou paralisados, esperando o movimento da água;
for um anjo desceu em certos momentos para dentro da piscina e agitou a água. Quem pisou primeiro após a agitação da água foi curado de qualquer doença que tivesse.
5 ౫ అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
Um certo homem estava lá, que estava doente há trinta e oito anos.
6 ౬ యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు.
Quando Jesus o viu ali deitado, e soube que estava doente há muito tempo, perguntou-lhe: “Você quer ficar bem?
7 ౭ అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు.
O doente respondeu-lhe: “Senhor, não tenho ninguém para me colocar na piscina quando a água está agitada, mas enquanto eu estou chegando, mais um degrau para baixo diante de mim”.
8 ౮ యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు.
Jesus lhe disse: “Levante-se, pegue sua esteira e caminhe”.
9 ౯ వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.
Imediatamente, o homem foi bem feito, pegou seu tapete e caminhou. Agora aquele dia era um sábado.
10 ౧౦ అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు.
Então os judeus disseram a ele que estava curado: “É o sábado”. Não é lícito para você carregar a esteira”.
11 ౧౧ అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు.
Ele lhes respondeu: “Aquele que me fez bem me disse: 'Pegue seu tapete e caminhe'”.
12 ౧౨ అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు.
Então lhe perguntaram: “Quem é o homem que lhe disse: 'Pegue seu tapete e caminhe'”?
13 ౧౩ అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
Mas aquele que foi curado não sabia quem era, pois Jesus havia se retirado, uma multidão estava no lugar.
14 ౧౪ ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు.
Depois, Jesus o encontrou no templo e lhe disse: “Eis que estás bem. Não pequeis mais, para que nada pior vos aconteça”.
15 ౧౫ వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
O homem foi embora e disse aos judeus que era Jesus quem o tinha feito bem.
16 ౧౬ ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
Por esta causa, os judeus perseguiram Jesus e procuraram matá-lo, porque ele fez estas coisas no sábado.
17 ౧౭ యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.
Mas Jesus lhes respondeu: “Meu Pai ainda está trabalhando, então eu também estou trabalhando”.
18 ౧౮ ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
Por esta causa, portanto, os judeus procuraram ainda mais matá-lo, pois ele não só quebrou o sábado, mas também chamou Deus de seu próprio Pai, fazendo-se igual a Deus.
19 ౧౯ కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
Jesus, portanto, lhes respondeu: “Certamente, eu lhes digo, o Filho não pode fazer nada de si mesmo, mas o que ele vê o Pai fazer”. Por tudo o que Ele faz, o Filho também faz o mesmo”.
20 ౨౦ తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు.
Pois o Pai tem afeição pelo Filho, e lhe mostra todas as coisas que ele mesmo faz. Ele lhe mostrará obras maiores do que estas, para que você se maravilhe.
21 ౨౧ “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
Pois, assim como o Pai ressuscita os mortos e lhes dá vida, assim também o Filho dá vida a quem deseja.
22 ౨౨ తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
Pois o Pai não julga ninguém, mas deu todo o julgamento ao Filho,
23 ౨౩ దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
para que todos possam honrar o Filho, assim como honram o Pai. Aquele que não honra o Filho não honra o Pai que o enviou.
24 ౨౪ కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. (aiōnios )
“Certamente vos digo, aquele que ouve minha palavra e acredita naquele que me enviou tem a vida eterna, e não entra em juízo, mas passou da morte para a vida”. (aiōnios )
25 ౨౫ మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.
Certamente eu lhes digo que chega a hora, e agora é, quando os mortos ouvirão a voz do Filho de Deus; e aqueles que ouvirem viverão.
26 ౨౬ తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
Pois como o Pai tem vida em si mesmo, assim também deu ao Filho para ter vida em si mesmo.
27 ౨౭ అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.
Ele também lhe deu autoridade para executar o julgamento, porque ele é um filho do homem.
28 ౨౮ “దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
Não se maravilhe com isso, pois chega a hora em que todos os que estão nos túmulos ouvirão sua voz
29 ౨౯ అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
e sairão; os que fizeram o bem, para a ressurreição da vida; e os que fizeram o mal, para a ressurreição do juízo.
30 ౩౦ “నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
Não posso fazer nada de mim mesmo. Como ouço, eu julgo; e meu julgamento é justo, porque não busco minha própria vontade, mas a vontade de meu Pai que me enviou.
31 ౩౧ నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
“Se eu testemunhar sobre mim mesmo, minha testemunha não é válida.
32 ౩౨ నా గురించి సాక్షమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
É outro que testemunha a meu respeito. Eu sei que o testemunho que ele testemunha a meu respeito é verdadeiro.
33 ౩౩ “మీరు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
Você enviou a John, e ele testemunhou a verdade.
34 ౩౪ కానీ నేను పొందిన సాక్ష్యం మనుషులు ఇచ్చినది కాదు. మీ రక్షణ కోసం ఈ మాటలు చెబుతున్నాను.
Mas o testemunho que recebo não é do homem. Entretanto, digo estas coisas para que você possa ser salvo.
35 ౩౫ యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉండే వాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
Ele era a lâmpada ardente e brilhante, e você estava disposto a regozijar-se por um tempo com a luz dele.
36 ౩౬ అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి.
Mas o testemunho que tenho é maior do que o de João; pelas obras que o Pai me deu para realizar, as próprias obras que faço, testemunham sobre mim, que o Pai me enviou.
37 ౩౭ నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
O próprio Pai, que me enviou, testemunhou a meu respeito. Não ouvistes sua voz em nenhum momento, nem vistes sua forma.
38 ౩౮ ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
Vós não tendes a palavra dele vivendo em vós, porque não acreditais naquele que ele enviou.
39 ౩౯ లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. (aiōnios )
“Você pesquisa as Escrituras, porque pensa que nelas você tem a vida eterna; e são elas que testemunham sobre mim. (aiōnios )
40 ౪౦ అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.
No entanto, você não virá até mim, para que possa ter vida.
41 ౪౧ మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
Eu não recebo glória dos homens.
42 ౪౨ ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
Mas eu vos conheço, que não tendes o amor de Deus em vós mesmos.
43 ౪౩ “నేను నా తండ్రి పేరిట వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
Eu vim em nome de meu Pai, e vós não me recebeis. Se outro vier em seu próprio nome, vós o recebereis.
44 ౪౪ ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
Como podeis acreditar, quem recebe glória uns dos outros, e não buscais a glória que vem do único Deus?
45 ౪౫ నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
“Não pense que eu vou acusá-lo ao Pai. Há alguém que te acusa, até mesmo Moisés, em quem você depositou sua esperança.
46 ౪౬ మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
Pois se você acreditasse em Moisés, acreditaria em mim; pois ele escreveu a meu respeito.
47 ౪౭ మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”
Mas se não acreditardes nos escritos dele, como acreditareis nas minhas palavras”?