< యోహాను 20 >
1 ౧ ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.
Naluwunjuwunju jumapili, kuweriti kwangali ntiti, Mariya Magidalena kagenditi kulipumba lya mpanga na kaliwona libuwi lilii liwusiwa pamlyangu gwa lipumba.
2 ౨ కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది.
Su kagenda mbiru mpaka kwa Simoni Peteru na ulii mfundwa yumonga ndomweni Yesu kamfiriti, kawagambira, “Wamwusiya Mtuwa Mulipumba lya mpanga na tuvimana ndiri pawamtuliti.”
3 ౩ కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు.
Peteru na mfundwa yumonga ulii wagenda kulipumba.
4 ౪ వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు.
Woseri wawili watugiti, Kumbiti mfundwa yumonga ulii katugiti mbiru kuliku Peteru na kalongolera kusoka kulipumba.
5 ౫ అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు.
Pakasunguliliti na kawoniti sanda, kumbiti kingira ndiri mlipumba.
6 ౬ ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.
Simoni Peteru kamfata na kingira mlipumba, amu kayiwona sanda,
7 ౭ అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు.
na shitambala shawamtawiti Yesu Mutuwi. Shitambala ashi washitula ndiri pamuhera na sanda ayi, kumbiti shiweriti shibiringiziwa na shitulwa pahali pa gweka hera.
8 ౮ ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు.
Mfundwa yumonga yakasokiti kulipumba lya mpanga, kingira viraa mulipumba lya mpanga, kawona na kajimira.
9 ౯ అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు.
Waweriti wankali kugamana Malembu Mananagala yagatakuliti kuwera mpaka kazyuki.
10 ౧౦ అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
Su, wafundwa awa wawuya ukaya.
11 ౧౧ కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
Mariya kaweriti kagoloka kunja ku lipumba lya mpanga, kankulira. Pakiwiti kankali kankulira, kang'ong'onariti na kusungulira mulipumba lya mpanga,
12 ౧౨ ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
na kawawona wantumintumi wa kumpindi wawili yawavaliti nguwu neru mbuu, walivagiti palii nshimba ya Yesu payiweriti yigonjekwa, yumu kumtuwi na mmonga kumagulu.
13 ౧౩ వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది.
Wamahoka awa wamkosiya, “Mdala, shagulira shishi?” Yomberi kawagambira, “Wamwusiya Mtuwa gwangu na nukumana ndiri kwawamtuliti!”
14 ౧౪ ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు.
Pakatakuliti aga, kagalambuka kumbeli, kamwona Yesu kagoloka paliya, kumbiti kammana ndiri kuwera ndo Yesu.
15 ౧౫ యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది.
Yesu kamkosiya, “Mdala, shagulira shishi?” Gwankumsakula Gani? Mariya, kaliholiti kuwera ayu ndo mlolera shiwunga, kamgambira, “Mtuwa, handa ndo gwenga gumwusiya, gung'ambiri pagumturiti, naneni hang'endi na kumtola.”
16 ౧౬ అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.
Yesu kamgambira, “Mariya!” Yomberi kagalambuka, kamgambira kwa Shiebraniya, “Raboni” Yani “mfunda.”
17 ౧౭ యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు.
Yesu kamgambira, “Nangunkola, toziya nankali kugenda kumpindi kwa Tati. Kumbiti gugendi kwa walongu wangu guwagambiri, Nankugenda kumpindi kwa Tati gwangu na Tati gwenu, Mlungu gwangu na Mlungu gwenu.”
18 ౧౮ మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
Mariya Magidalena kagenda na kawagambira weri visoweru vilii wafundwa kuwera kamwona Mtuwa na kuwagambira gawamgambira.
19 ౧౯ ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
Iweriti pamihi pa lishaka lya jumapili. Wafundwa waweriti waliwona pamuhera mnumba na milyangu iweriti itatwa toziya wawatiriti watuwa wa Shiyawudi. Su, Yesu kiza, kagoloka pakati pawu, kawagambira, “Ponga kwamwenga!”
20 ౨౦ ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
Pakamaliriti kutakula aga, kawalanguziya mawoku gakuwi na lubavu lyakuwi. Su, wafundwa awa wasekelera nentu kumwona Mtuwa.
21 ౨౧ అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు.
Yesu kawagambira kayi, “Ponga kwamwenga! Handa viraa Tati ntambu yakantumiti neni, naneni nankuwatuma mwenga.”
22 ౨౨ ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి.
Pakamaliriti kutakula aga, kawatekelera na kuwagambira, “Mumwanki Rohu Mnanagala.
23 ౨౩ మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
Pamuwalegeziya wantu vidoda vyawu, hawalegeziwi, pamuwalegeziya ndiri, hapeni walekiziwi.”
24 ౨౪ పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.
Tomasi, yumu gwa walii lilongu na wawili yawamshema mawira kaweriti ndiri pamuhera nawomberi shipindi Yesu pakiziti.
25 ౨౫ మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు.
Su, wafundwa wamonga walii wamgambira yomberi, “Tumwoniti Mtuwa.” Tomasi kawagambira, “Pamona ndiri mumawoku mwakuwi shilanguliru zya misumali na kuyingiziya shyala shangu pakati palikovu ali na kuyingiziya liwoku lyangu mluwavu lwakuwi, hapeni njimiri.”
26 ౨౬ ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు.
Pa mashaka manane wafundwa waweriti kayi pamuhera mnumba mulii na Tomasi kaweriti pamuhera nawomberi. Milyangu iweriti itatwa, kumbiti Yesu kiza, kagoloka pakati pawu, pakatakula, “Ponga iweri pamuhera na mwenga!”
27 ౨౭ తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు.
Shakapanu kamgambira Tomasi, “Gutuli shyala shaku panu na guloli mawoku gangu, shakapanu gunyoshi liwoku lyaku na gunkoli lubavu lwangu. Guleki kwamini ndiri kwaku, gwenga gwamini!”
28 ౨౮ దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
Tomasi kamwankula, “Mtuwa gwangu na Mlungu gwangu!”
29 ౨౯ అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు.
Yesu kamgambira, “Hashi, gujimira toziya gumona? Mbaka woseri yawanjimira pamberi pa kumona neni!”
30 ౩౦ యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
Yesu katenditi pawulongolu pa wafundwa wakuwi malangaliru gamonga mavuwa galembitwi ndiri munkati mushintola ashi.
31 ౩౧ కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
Kumbiti aga wagalembiti su mpati kwamini handa Yesu ndo Kristu, Mwana gwa Mlungu na kwa kumjimira mpati kuwera na ukomu.