< యోహాను 2 >
1 ౧ మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది.
anantaraM trutIyadivase gAlIl pradeziye kAnnAnAmni nagare vivAha AsIt tatra ca yIzormAtA tiSThat|
2 ౨ ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
tasmai vivAhAya yIzustasya ziSyAzca nimantritA Asan|
3 ౩ విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది.
tadanantaraM drAkSArasasya nyUnatvAd yIzormAtA tamavadat eteSAM drAkSAraso nAsti|
4 ౪ యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు.
tadA sa tAmavocat he nAri mayA saha tava kiM kAryyaM? mama samaya idAnIM nopatiSThati|
5 ౫ ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది.
tatastasya mAtA dAsAnavocad ayaM yad vadati tadeva kuruta|
6 ౬ యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.
tasmin sthAne yihUdIyAnAM zucitvakaraNavyavahArAnusAreNADhakaikajaladharANi pASANamayAni SaDvRhatpAtrANiAsan|
7 ౭ యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు.
tadA yIzustAn sarvvakalazAn jalaiH pUrayituM tAnAjJApayat, tataste sarvvAn kumbhAnAkarNaM jalaiH paryyapUrayan|
8 ౮ అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.
atha tebhyaH kiJciduttAryya bhojyAdhipAteHsamIpaM netuM sa tAnAdizat, te tadanayan|
9 ౯ ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,
aparaJca tajjalaM kathaM drAkSAraso'bhavat tajjalavAhakAdAsA jJAtuM zaktAH kintu tadbhojyAdhipo jJAtuM nAzaknot tadavalihya varaM saMmbodyAvadata,
10 ౧౦ “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.
lokAH prathamaM uttamadrAkSArasaM dadati taSu yatheSTaM pitavatsu tasmA kiJcidanuttamaJca dadati kintu tvamidAnIM yAvat uttamadrAkSArasaM sthApayasi|
11 ౧౧ యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
itthaM yIzurgAlIlapradeze AzcaryyakArmma prArambha nijamahimAnaM prAkAzayat tataH ziSyAstasmin vyazvasan|
12 ౧౨ ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు.
tataH param sa nijamAtrubhrAtrusziSyaiH sArddhM kapharnAhUmam Agamat kintu tatra bahUdinAni AtiSThat|
13 ౧౩ యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
tadanantaraM yihUdiyAnAM nistArotsave nikaTamAgate yIzu ryirUzAlam nagaram Agacchat|
14 ౧౪ అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు.
tato mandirasya madhye gomeSapArAvatavikrayiNo vANijakScopaviSTAn vilokya
15 ౧౫ ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు.
rajjubhiH kazAM nirmmAya sarvvagomeSAdibhiH sArddhaM tAn mandirAd dUrIkRtavAn|
16 ౧౬ పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు.
vaNijAM mudrAdi vikIryya AsanAni nyUbjIkRtya pArAvatavikrayibhyo'kathayad asmAt sthAnAt sarvANyetAni nayata, mama pitugRhaM vANijyagRhaM mA kArSTa|
17 ౧౭ ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.
tasmAt tanmandirArtha udyogo yastu sa grasatIva mAm| imAM zAstrIyalipiM ziSyAHsamasmaran|
18 ౧౮ అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు.
tataH param yihUdIyalokA yISimavadan tavamidRzakarmmakaraNAt kiM cihnamasmAn darzayasi?
19 ౧౯ దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు.
tato yIzustAnavocad yuSmAbhire tasmin mandire nAzite dinatrayamadhye'haM tad utthApayiSyAmi|
20 ౨౦ అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు.
tadA yihUdiyA vyAhArSuH, etasya mandirasa nirmmANena SaTcatvAriMzad vatsarA gatAH, tvaM kiM dinatrayamadhye tad utthApayiSyasi?
21 ౨౧ అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి.
kintu sa nijadeharUpamandire kathAmimAM kathitavAn|
22 ౨౨ ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
sa yadetAdRzaM gaditavAn tacchiSyAH zmazAnAt tadIyotthAne sati smRtvA dharmmagranthe yIzunoktakathAyAM ca vyazvasiSuH|
23 ౨౩ ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.
anantaraM nistArotsavasya bhojyasamaye yirUzAlam nagare tatkrutAzcaryyakarmmANi vilokya bahubhistasya nAmani vizvasitaM|
24 ౨౪ అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.
kintu sa teSAM kareSu svaM na samarpayat, yataH sa sarvvAnavait|
25 ౨౫ ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.
sa mAnaveSu kasyacit pramANaM nApekSata yato manujAnAM madhye yadyadasti tattat sojAnAt|