< యోహాను 19 >

1 ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు.
པཱིལཱཏོ ཡཱིཤུམ྄ ཨཱནཱིཡ ཀཤཡཱ པྲཱཧཱརཡཏ྄།
2 సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి,
པཤྩཱཏ྄ སེནཱགཎཿ ཀཎྚཀནིརྨྨིཏཾ མུཀུཊཾ ཏསྱ མསྟཀེ སམརྤྱ ཝཱརྟྟཱཀཱིཝརྞཾ རཱཛཔརིཙྪདཾ པརིདྷཱཔྱ,
3 “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు.
ཧེ ཡིཧཱུདཱིཡཱནཱཾ རཱཛན྄ ནམསྐཱར ཨིཏྱུཀྟྭཱ ཏཾ ཙཔེཊེནཱཧནྟུམ྄ ཨཱརབྷཏ།
4 పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు.
ཏདཱ པཱིལཱཏཿ པུནརཔི བཧིརྒཏྭཱ ལོཀཱན྄ ཨཝདཏ྄, ཨསྱ ཀམཔྱཔརཱདྷཾ ན ལབྷེ྅ཧཾ, པཤྱཏ ཏད྄ ཡུཥྨཱན྄ ཛྙཱཔཡིཏུཾ ཡུཥྨཱཀཾ སནྣིདྷཽ བཧིརེནམ྄ ཨཱནཡཱམི།
5 కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు.
ཏཏཿ པརཾ ཡཱིཤུཿ ཀཎྚཀམུཀུཊཝཱན྄ ཝཱརྟྟཱཀཱིཝརྞཝསནཝཱཾཤྩ བཧིརཱགཙྪཏ྄། ཏཏཿ པཱིལཱཏ ཨུཀྟཝཱན྄ ཨེནཾ མནུཥྱཾ པཤྱཏ།
6 ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు.
ཏདཱ པྲདྷཱནཡཱཛཀཱཿ པདཱཏཡཤྩ ཏཾ དྲྀཥྚྭཱ, ཨེནཾ ཀྲུཤེ ཝིདྷ, ཨེནཾ ཀྲུཤེ ཝིདྷ, ཨིཏྱུཀྟྭཱ རཝིཏུཾ ཨཱརབྷནྟ། ཏཏཿ པཱིལཱཏཿ ཀཐིཏཝཱན྄ ཡཱུཡཾ སྭཡམ྄ ཨེནཾ ནཱིཏྭཱ ཀྲུཤེ ཝིདྷཏ, ཨཧམ྄ ཨེཏསྱ ཀམཔྱཔརཱདྷཾ ན པྲཱཔྟཝཱན྄།
7 యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు.
ཡིཧཱུདཱིཡཱཿ པྲཏྱཝདན྄ ཨསྨཱཀཾ ཡཱ ཝྱཝསྠཱསྟེ ཏདནུསཱརེཎཱསྱ པྲཱཎཧནནམ྄ ཨུཙིཏཾ ཡཏོཡཾ སྭམ྄ ཨཱིཤྭརསྱ པུཏྲམཝདཏ྄།
8 పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి,
པཱིལཱཏ ཨིམཱཾ ཀཐཱཾ ཤྲུཏྭཱ མཧཱཏྲཱསཡུཀྟཿ
9 “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు.
སན྄ པུནརཔི རཱཛགྲྀཧ ཨཱགཏྱ ཡཱིཤུཾ པྲྀཥྚཝཱན྄ ཏྭཾ ཀུཏྲཏྱོ ལོཀཿ? ཀིནྟུ ཡཱིཤསྟསྱ ཀིམཔི པྲཏྱུཏྟརཾ ནཱཝདཏ྄།
10 ౧౦ అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
༡ ཏཏཿ པཱིལཱཏ྄ ཀཐིཏཝཱན ཏྭཾ ཀིཾ མཡཱ སཱརྡྡྷཾ ན སཾལཔིཥྱསི? ཏྭཱཾ ཀྲུཤེ ཝེདྷིཏུཾ ཝཱ མོཙཡིཏུཾ ཤཀྟི རྨམཱསྟེ ཨིཏི ཀིཾ ཏྭཾ ན ཛཱནཱསི? ཏདཱ ཡཱིཤུཿ པྲཏྱཝདད྄ ཨཱིཤྭརེཎཱདཾ མམོཔརི ཏཝ ཀིམཔྱདྷིཔཏིཏྭཾ ན ཝིདྱཏེ, ཏཐཱཔི ཡོ ཛནོ མཱཾ ཏཝ ཧསྟེ སམཱརྤཡཏ྄ ཏསྱ མཧཱཔཱཏཀཾ ཛཱཏམ྄།
11 ౧౧ యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు.
ཏདཱ ཡཱིཤུཿ པྲཏྱཝདད྄ ཨཱིཤྭརེཎཱདཏྟཾ མམོཔརི ཏཝ ཀིམཔྱདྷིཔཏིཏྭཾ ན ཝིདྱཏེ, ཏཐཱཔི ཡོ ཛནོ མཱཾ ཏཝ ཧསྟེ སམཱརྤཡཏ྄ ཏསྱ མཧཱཔཱཏཀཾ ཛཱཏམ྄།
12 ౧౨ అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు.
ཏདཱརབྷྱ པཱིལཱཏསྟཾ མོཙཡིཏུཾ ཙེཥྚིཏཝཱན྄ ཀིནྟུ ཡིཧཱུདཱིཡཱ རུཝནྟོ ཝྱཱཧརན྄ ཡདཱིམཾ མཱནཝཾ ཏྱཛསི ཏརྷི ཏྭཾ ཀཻསརསྱ མིཏྲཾ ན བྷཝསི, ཡོ ཛནཿ སྭཾ རཱཛཱནཾ ཝཀྟི སཨེཝ ཀཻམརསྱ ཝིརུདྡྷཱཾ ཀཐཱཾ ཀཐཡཏི།
13 ౧౩ పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు.
ཨེཏཱཾ ཀཐཱཾ ཤྲུཏྭཱ པཱིལཱཏོ ཡཱིཤུཾ བཧིརཱནཱིཡ ནིསྟཱརོཏྶཝསྱ ཨཱསཱདནདིནསྱ དྭིཏཱིཡཔྲཧརཱཏ྄ པཱུཪྻྭཾ པྲསྟརབནྡྷནནཱམྣི སྠཱནེ ྅རྠཱཏ྄ ཨིབྲཱིཡབྷཱཥཡཱ ཡད྄ གབྦིཐཱ ཀཐྱཏེ ཏསྨིན྄ སྠཱནེ ཝིཙཱརཱསན ཨུཔཱཝིཤཏ྄།
14 ౧౪ అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.
ཨནནྟརཾ པཱིལཱཏོ ཡིཧཱུདཱིཡཱན྄ ཨཝདཏ྄, ཡུཥྨཱཀཾ རཱཛཱནཾ པཤྱཏ།
15 ౧౫ వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
ཀིནྟུ ཨེནཾ དཱུརཱིཀུརུ, ཨེནཾ དཱུརཱིཀུརུ, ཨེནཾ ཀྲུཤེ ཝིདྷ, ཨིཏི ཀཐཱཾ ཀཐཡིཏྭཱ ཏེ རཝིཏུམ྄ ཨཱརབྷནྟ; ཏདཱ པཱིལཱཏཿ ཀཐིཏཝཱན྄ ཡུཥྨཱཀཾ རཱཛཱནཾ ཀིཾ ཀྲུཤེ ཝེདྷིཥྱཱམི? པྲདྷཱནཡཱཛཀཱ ཨུཏྟརམ྄ ཨཝདན྄ ཀཻསརཾ ཝིནཱ ཀོཔི རཱཛཱསྨཱཀཾ ནཱསྟི།
16 ౧౬ అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.
ཏཏཿ པཱིལཱཏོ ཡཱིཤུཾ ཀྲུཤེ ཝེདྷིཏུཾ ཏེཥཱཾ ཧསྟེཥུ སམཱརྤཡཏ྄, ཏཏསྟེ ཏཾ དྷྲྀཏྭཱ ནཱིཏཝནྟཿ།
17 ౧౭ తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.
ཏཏཿ པརཾ ཡཱིཤུཿ ཀྲུཤཾ ཝཧན྄ ཤིརཿཀཔཱལམ྄ ཨརྠཱད྄ ཡད྄ ཨིབྲཱིཡབྷཱཥཡཱ གུལྒལྟཱཾ ཝདནྟི ཏསྨིན྄ སྠཱན ཨུཔསྠིཏཿ།
18 ౧౮ అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు.
ཏཏསྟེ མདྷྱསྠཱནེ ཏཾ ཏསྱོབྷཡཔཱརྴྭེ དྭཱཝཔརཽ ཀྲུཤེ྅ཝིདྷན྄།
19 ౧౯ పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు.
ཨཔརམ྄ ཨེཥ ཡིཧཱུདཱིཡཱནཱཾ རཱཛཱ ནཱསརཏཱིཡཡཱིཤུཿ, ཨིཏི ཝིཛྙཱཔནཾ ལིཁིཏྭཱ པཱིལཱཏསྟསྱ ཀྲུཤོཔརི སམཡོཛཡཏ྄།
20 ౨౦ యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు.
སཱ ལིཔིཿ ཨིབྲཱིཡཡཱུནཱནཱིཡརོམཱིཡབྷཱཥཱབྷི རླིཁིཏཱ; ཡཱིཤོཿ ཀྲུཤཝེདྷནསྠཱནཾ ནགརསྱ སམཱིཔཾ, ཏསྨཱད྄ བཧཝོ ཡིཧཱུདཱིཡཱསྟཱཾ པཋིཏུམ྄ ཨཱརབྷནྟ།
21 ౨౧ యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు.
ཡིཧཱུདཱིཡཱནཱཾ པྲདྷཱནཡཱཛཀཱཿ པཱིལཱཏམིཏི ནྱཝེདཡན྄ ཡིཧཱུདཱིཡཱནཱཾ རཱཛེཏི ཝཱཀྱཾ ན ཀིནྟུ ཨེཥ སྭཾ ཡིཧཱུདཱིཡཱནཱཾ རཱཛཱནམ྄ ཨཝདད྄ ཨིཏྠཾ ལིཁཏུ།
22 ౨౨ పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు.
ཏཏཿ པཱིལཱཏ ཨུཏྟརཾ དཏྟཝཱན྄ ཡལླེཁནཱིཡཾ ཏལླིཁིཏཝཱན྄།
23 ౨౩ సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి,
ཨིཏྠཾ སེནཱགཎོ ཡཱིཤུཾ ཀྲུཤེ ཝིདྷིཏྭཱ ཏསྱ པརིདྷེཡཝསྟྲཾ ཙཏུརོ བྷཱགཱན྄ ཀྲྀཏྭཱ ཨེཀཻཀསེནཱ ཨེཀཻཀབྷཱགམ྄ ཨགྲྀཧླཏ྄ ཏསྱོཏྟརཱིཡཝསྟྲཉྩཱགྲྀཧླཏ྄། ཀིནྟཱུཏྟརཱིཡཝསྟྲཾ སཱུཙིསེཝནཾ ཝིནཱ སཪྻྭམ྄ ཨཱུཏཾ།
24 ౨౪ వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు. “నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు,” అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
ཏསྨཱཏྟེ ཝྱཱཧརན྄ ཨེཏཏ྄ ཀཿ པྲཱཔྶྱཏི? ཏནྣ ཁཎྜཡིཏྭཱ ཏཏྲ གུཊིཀཱཔཱཏཾ ཀརཝཱམ། ཝིབྷཛནྟེ྅དྷརཱིཡཾ མེ ཝསནཾ ཏེ པརསྤརཾ། མམོཏྟརཱིཡཝསྟྲཱརྠཾ གུཊིཀཱཾ པཱཏཡནྟི ཙ། ཨིཏི ཡདྭཱཀྱཾ དྷརྨྨཔུསྟཀེ ལིཁིཏམཱསྟེ ཏཏ྄ སེནཱགཎེནེཏྠཾ ཝྱཝཧརཎཱཏ྄ སིདྡྷམབྷཝཏ྄།
25 ౨౫ యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు.
ཏདཱནཱིཾ ཡཱིཤོ རྨཱཏཱ མཱཏུ རྦྷགིནཱི ཙ ཡཱ ཀླིཡཔཱ བྷཱཪྻྱཱ མརིཡམ྄ མགྡལཱིནཱི མརིཡམ྄ ཙ ཨེཏཱསྟསྱ ཀྲུཤསྱ སནྣིདྷཽ སམཏིཥྛན྄།
26 ౨౬ ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు.
ཏཏོ ཡཱིཤུཿ སྭམཱཏརཾ པྲིཡཏམཤིཥྱཉྩ སམཱིཔེ དཎྜཱཡམཱནཽ ཝིལོཀྱ མཱཏརམ྄ ཨཝདཏ྄, ཧེ ཡོཥིད྄ ཨེནཾ ཏཝ པུཏྲཾ པཤྱ,
27 ౨౭ తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
ཤིཥྱནྟྭཝདཏ྄, ཨེནཱཾ ཏཝ མཱཏརཾ པཤྱ། ཏཏཿ ས ཤིཥྱསྟདྒྷཊིཀཱཡཱཾ ཏཱཾ ནིཛགྲྀཧཾ ནཱིཏཝཱན྄།
28 ౨౮ దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు.
ཨནནྟརཾ སཪྻྭཾ ཀརྨྨཱདྷུནཱ སམྤནྣམབྷཱུཏ྄ ཡཱིཤུརིཏི ཛྙཱཏྭཱ དྷརྨྨཔུསྟཀསྱ ཝཙནཾ ཡཐཱ སིདྡྷཾ བྷཝཏི ཏདརྠམ྄ ཨཀཐཡཏ྄ མམ པིཔཱསཱ ཛཱཏཱ།
29 ౨౯ అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.
ཏཏསྟསྨིན྄ སྠཱནེ ཨམླརསེན པཱུརྞཔཱཏྲསྠིཏྱཱ ཏེ སྤཉྫམེཀཾ ཏདམླརསེནཱརྡྲཱིཀྲྀཏྱ ཨེསོབྣལེ ཏད྄ ཡོཛཡིཏྭཱ ཏསྱ མུཁསྱ སནྣིདྷཱཝསྠཱཔཡན྄།
30 ౩౦ యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.
ཏདཱ ཡཱིཤུརམླརསཾ གྲྀཧཱིཏྭཱ སཪྻྭཾ སིདྡྷམ྄ ཨིཏི ཀཐཱཾ ཀཐཡིཏྭཱ མསྟཀཾ ནམཡན྄ པྲཱཎཱན྄ པཪྻྱཏྱཛཏ྄།
31 ౩౧ అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు.
ཏདྭིནམ྄ ཨཱསཱདནདིནཾ ཏསྨཱཏ྄ པརེ྅ཧནི ཝིཤྲཱམཝཱརེ དེཧཱ ཡཐཱ ཀྲུཤོཔརི ན ཏིཥྛནྟི, ཡཏཿ ས ཝིཤྲཱམཝཱརོ མཧཱདིནམཱསཱིཏ྄, ཏསྨཱད྄ ཡིཧཱུདཱིཡཱཿ པཱིལཱཏནིཀཊཾ གཏྭཱ ཏེཥཱཾ པཱདབྷཉྫནསྱ སྠཱནཱནྟརནཡནསྱ ཙཱནུམཏིཾ པྲཱརྠཡནྟ།
32 ౩౨ కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు.
ཨཏཿ སེནཱ ཨཱགཏྱ ཡཱིཤུནཱ སཧ ཀྲུཤེ ཧཏཡོཿ པྲཐམདྭིཏཱིཡཙོརཡོཿ པཱདཱན྄ ཨབྷཉྫན྄;
33 ౩౩ వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.
ཀིནྟུ ཡཱིཤོཿ སནྣིདྷིཾ གཏྭཱ ས མྲྀཏ ཨིཏི དྲྀཥྚྭཱ ཏསྱ པཱདཽ ནཱབྷཉྫན྄།
34 ౩౪ అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి.
པཤྩཱད྄ ཨེཀོ ཡོདྡྷཱ ཤཱུལཱགྷཱཏེན ཏསྱ ཀུཀྵིམ྄ ཨཝིདྷཏ྄ ཏཏྐྵཎཱཏ྄ ཏསྨཱད྄ རཀྟཾ ཛལཉྩ ནིརགཙྪཏ྄།
35 ౩౫ ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే.
ཡོ ཛནོ྅སྱ སཱཀྵྱཾ དདཱཏི ས སྭཡཾ དྲྀཥྚཝཱན྄ ཏསྱེདཾ སཱཀྵྱཾ སཏྱཾ ཏསྱ ཀཐཱ ཡུཥྨཱཀཾ ཝིཤྭཱསཾ ཛནཡིཏུཾ ཡོགྱཱ ཏཏ྄ ས ཛཱནཱཏི།
36 ౩౬ “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి.
ཏསྱཻཀམ྄ ཨསྡྷྱཔི ན བྷཾཀྵྱཏེ,
37 ౩౭ “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
ཏདྭད྄ ཨནྱཤཱསྟྲེཔི ལིཁྱཏེ, ཡཐཱ, "དྲྀཥྚིཔཱཏཾ ཀརིཥྱནྟི ཏེ྅ཝིདྷན྄ ཡནྟུ ཏམྤྲཏི། "
38 ౩౮ ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు.
ཨརིམཐཱིཡནགརསྱ ཡཱུཥཕྣཱམཱ ཤིཥྱ ཨེཀ ཨཱསཱིཏ྄ ཀིནྟུ ཡིཧཱུདཱིཡེབྷྱོ བྷཡཱཏ྄ པྲཀཱཤིཏོ ན བྷཝཏི; ས ཡཱིཤོ རྡེཧཾ ནེཏུཾ པཱིལཱཏསྱཱནུམཏིཾ པྲཱརྠཡཏ, ཏཏཿ པཱིལཱཏེནཱནུམཏེ སཏི ས གཏྭཱ ཡཱིཤོ རྡེཧམ྄ ཨནཡཏ྄།
39 ౩౯ మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.
ཨཔརཾ ཡོ ནིཀདཱིམོ རཱཏྲཽ ཡཱིཤོཿ སམཱིཔམ྄ ཨགཙྪཏ྄ སོཔི གནྡྷརསེན མིཤྲིཏཾ པྲཱཡེཎ པཉྩཱཤཏྶེཊཀམགུརུཾ གྲྀཧཱིཏྭཱགཙྪཏ྄།
40 ౪౦ వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం.
ཏཏསྟེ ཡིཧཱུདཱིཡཱནཱཾ ཤྨཤཱནེ སྠཱཔནརཱིཏྱནུསཱརེཎ ཏཏྶུགནྡྷིདྲཝྱེཎ སཧིཏཾ ཏསྱ དེཧཾ ཝསྟྲེཎཱཝེཥྚཡན྄།
41 ౪౧ ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.
ཨཔརཉྩ ཡཏྲ སྠཱནེ ཏཾ ཀྲུཤེ྅ཝིདྷན྄ ཏསྱ ནིཀཊསྠོདྱཱནེ ཡཏྲ ཀིམཔི མྲྀཏདེཧཾ ཀདཱཔི ནཱསྠཱཔྱཏ ཏཱདྲྀཤམ྄ ཨེཀཾ ནཱུཏནཾ ཤྨཤཱནམ྄ ཨཱསཱིཏ྄།
42 ౪౨ ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.
ཡིཧཱུདཱིཡཱནཱམ྄ ཨཱསཱདནདིནཱགམནཱཏ྄ ཏེ ཏསྨིན྄ སམཱིཔསྠཤྨཤཱནེ ཡཱིཤུམ྄ ཨཤཱཡཡན྄།

< యోహాను 19 >