< యోహాను 18 >
1 ౧ యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.
Ie nitsarae’ Iesoà, le nionjoñe mindre amo mpiama’eo nitsake ty saka Kedrone mb’amy goloboney mb’eo le nizilik’ ao rekets’ o mpiama’eo.
2 ౨ యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు.
Nizatse i toetsey ka t’i Jodasy, i hifotetse azey, fa beteke nitolak’ ao t’Iesoà naho o mpiama’eo.
3 ౩ అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు.
Aa ie nahazo mpirimbon-dahin-defoñe naho mpifeleke hirik’ amo mpisorom-beio naho o Fariseoo t’i Jodasy, le niheo mb’eo ninday failo naho jiro vaho fialiañe.
4 ౪ అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు.
Kanao fonga niarofoana’ Iesoà ty hifetsak’ ama’e, le nimb’ am’ iereo mb’eo nanao ty hoe: Ia ty paia’ areo?
5 ౫ వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు.
Tinoi’ iereo ty hoe: Iesoà nte Nazareta. Le hoe re tam’ iereo: Ie iraho. Nijagarodoñe am’iereo ao ka t’i Jodasy nifotetse ama’e.
6 ౬ ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు.
Amy nanoa’e ty hoe: Ie iraho, le nidisa-voly iereo, nivaragidiñe an-tane eo.
7 ౭ ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు.
Aa le nindrai’e i ontane’ey: Ia v’o paia’ areoo? Hoe iereo: Iesoà nte Nazareta.
8 ౮ యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు.
Le tinoi’ Iesoà ty hoe: Fa nanoeko te Ie Raho, aa naho mipay ahy, adono hañavelo iretoañe,
9 ౯ “నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు.
hampañeneke i nitsarae’ey ty hoe: Leo raike tsy nipoke amo natolo’o ahikoo.
10 ౧౦ అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు.
Kanao amam-pibara t’i Simona Petera; napontsoa’e le pinao’e ty mpitoro’ i talèm-pisoroñey, nañitsike ty ravembia’e havana. Malikò ty tahina’ i mpitoroñey.
11 ౧౧ యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.
Le hoe t’Iesoà amy Petera: Aziliho an-traño’e o fibara’oo. Tsy hinomeko hao i fitovy nazotson-dRaeko amakoy?
12 ౧౨ అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.
Aa le nifihine’ i mpirimbon-dahin-defoñey naho i mpiaolo’ey naho o mpifele’ o Tehodao t’Iesoà vaho rinohy.
13 ౧౩ మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ.
Kinozozò’ iereo mb’amy Anasy hey re, ie ty rafoza’ i Kaiafa talèm-pisoroñe amy taoñe zay.
14 ౧౪ ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
I Kaiafay i nanoro o Tehodaoy ty hoe: Mahasoa te ho vilasy ho a’ ondatio t’indaty raike.
15 ౧౫ సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు.
Nañorike Iesoà t’i Simona Petera naho ty mpiamy Iesoà raike. Fa nifohi’ i talèm-pisoroñey i mpiama’e zay, le nindre amy Iesoà re nizilik’ an-kiririsan-talèm-pisoroñe ao.
16 ౧౬ కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు.
Fe nijohañe an-dalam-bey alafe ao t’i Petera. Niakatse amy zao i mpiama’e nifohi’ i taleiy, le nilahatse ami’ty mpañamben-dalañe, vaho nampizilihe’e t’i Petera.
17 ౧౭ గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు.
Le hoe i ampela mpitàn-dalañey amy Petera: Tsy mpiam’ indatiy ka v’iheo? Hoe re: Aiy! tsy izaho.
18 ౧౮ చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు.
Nizorazora eo o mpitoroñeo naho o mpigaritseo, ie fa namiañe afo am-porohañe ao amy te nanara, le namindro; nindre nijohañe am’iereo t’i Petera, namindro.
19 ౧౯ ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు.
Le nañontane Iesoà ty amo mpiama’eo naho o fañòha’eo i talèm-pisoroñey.
20 ౨౦ యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు.
Tinoi’ Iesoà ty hoe: Nivolam-beo’ mbeo ami’ty voatse toy iraho, nainai’e nañoke amo fitontonañeo naho añ’anjomban’ Añahare fivoria’ o Jiosy iabioo, vaho tsy eo ty nivolañeko añ’etake.
21 ౨౧ నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు.
Ino ty añontanea’o ahy? Añontaneo o nahajanjiñe i vinolako am’iereoio, fohi’ iereo o nitaroñekoo.
22 ౨౨ యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు.
Ie nanao izay t’Iesoà, le tinampifi’ ty mpigaritse nijohañe eo, vaho nanoa’e ty hoe: Zao hao ty toi’o i talèm-pisoroñey?
23 ౨౩ యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు.
Tinoi’ Iesoà: Naho nandilatse an-tsaontsy iraho, italilio ty tsy nimete; fe naho nitò, akore t’ie nanampifia’o?
24 ౨౪ తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు.
Aa le nampanesè’ i Anasy an-drohy mb’amy Kaiafa talèm-pisoroñe mb’eo re.
25 ౨౫ అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు.
Ie amy zao, namindro ey t’i Petera, le nañontanea’iereo ty hoe: Tsy mpiama’e ka v’iheo? Niliere’e ami’ty hoe: Tsy ie iraho.
26 ౨౬ పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు.
Le hoe ty mpitoron-talèm-pisoroñe, longo’ i nikitsihe’ i Petera ravembiay: Tsy nitreako nindre ama’e amy ala vondroy v’iheo?
27 ౨౭ పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
Nandietse indraike t’i Petera; vaho nikekeo i akoholahiy.
28 ౨౮ వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు.
Ie nimaraindray, nendese’ iereo boak’ amy Kaiafa mb’ amy anjomba i mpizakaiy mb’eo t’Iesoà, f’ie tsy nimoak’ añ’ anjombam-pizaka ao tsy mone haleotse tsy mete hikama i Fihelañey.
29 ౨౯ కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు.
Aa le niakatse mb’am’iereo mb’eo t’i Pilato, nanao ty hoe: Inoñe ty anisìa’ areo t’indaty tìañe?
30 ౩౦ వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు.
Le hoe ty natoi’ iereo: Naho tsy mpanan-tahin-dre, tsy ho nasese’ay ama’o.
31 ౩౧ అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు.
Endeso re, hoe t’i Pilato, zakao an-dili’ areo. Aa le hoe o Tehodao tama’e: Tsy aman-jo hamono ondaty zahay,
32 ౩౨ తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు.
hañeneke ty tsara’ Iesoà nitaroñe’e ty havilasy hivetraha’ey.
33 ౩౩ అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు.
Le nizilik’ añ’anjombam-pizakañ’ ao indraike t’i Pilato nitsikaotse Iesoà naho nanoa’e ty hoe: Mpanjaka’ o Jiosio v’iheo?
34 ౩౪ యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు.
Tinoi’ Iesoà ty hoe: Saontsi’o hao, hera nisaontsie’ ty ila’e ahy?
35 ౩౫ అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు.
Hoe t’i Pilato: Jiosy v-o ahoo? I foko’oy naho o mpisorom-beio ty nanese Azo amako; ino o nanoe’oo?
36 ౩౬ యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు.
Tinoi’ Iesoà ty hoe: Tsy ami’ty voatse toy ty fifeheako; fa naho ni-hirik’ ami’ty voatse toy ty fifeheako, le nialy ho ahy o mpitorokoo tsy hasese amo Tehodao; fe tsy boak’ atoañe ty fifeheako.
37 ౩౭ అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా?” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు.
Aa le hoe t’i Pilato ama’e: Mpanjaka v’Iheo! Tinoi’ Iesoà: Saontsi’o te mpanjaka; izay ty nisamahañ’ ahy, naho ty nivotrahako ami’ty voatse toy, hitaroñako ty hatò. Hene mahajanjiñe ty feoko ze mpiami’ ty hatò.
38 ౩౮ పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,
Hoe t’i Pilato tama’e: Ino ze o hatò zao? Ie nanao izay, le niavotse mb’ amo Tehodao indraike, nanao ty hoe: Tsy treako ty hakeo ama’e.
39 ౩౯ పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు.
Fe aman-dily nahareo, ty hañahàko t’indaty amy Fihelañey. No’ areo arè te havotsoko ama’ areo t’i Mpanjaka’ o Jiosio?
40 ౪౦ అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.
Nindrai’ iareo an-tazataza ty hoe: Tsy t’indaty tia fa i Barabasy. Malaso i Barabasy izay.