< యోహాను 17 >
1 ౧ యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు.
Се глаголав Ісус, і вняв очі свої на небо, й рече: Отче! прийшла година; прослав Сина Твого, щоб і Син Твій прославив Тебе.
2 ౨ నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. (aiōnios )
Яко ж дав єси Йому власть над усяким тїлом, щоб усїм, що дав єси Йому, дав вічне життє. (aiōnios )
3 ౩ ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. (aiōnios )
Се ж життє вічне в тому щоб знали Тебе, єдиного справдешного Бога, та кого післав єси, Ісуса Христа. (aiōnios )
4 ౪ నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను.
Я прославив Тебе на землі: дїло кінчав я, що дав єси менї робити.
5 ౫ తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు.
А тепер прослав мене Ти, Отче, у Тебе самого славою, що мав я в Тебе, І перш нїж сьвіту бути.
6 ౬ లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు.
Обявив я імя Твоє людям, що дав єси менї з сьвіта. Твої буди вони, а Ти менї їх дав, і слово Твоє хоронили вони.
7 ౭ నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు.
Тепер зрозуміли вони, що, скільки дав єси менї, все від Тебе.
8 ౮ ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు.
Бо слова, що дав єси менї, дав я їм; і вони прийняли й зрозуміли справді, що від Тебе прийшов я, і увірували, що Ти мене післав.
9 ౯ “నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను.
Я про них молю, не про сьвіт молю, а про тих, що дав єси менї, бо вони Твої.
10 ౧౦ నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది.
І все моє Твоє, і Твоє моє, і я прославив ся в них.
11 ౧౧ నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు.
І вже більш я не в сьвітї, а сї в сьвітї, і я до Тебе йду. Отче сьвятий, збережи їх в імя Твоє, тих, котрих дав єси менї, щоб були одно, яко ж ми.
12 ౧౨ నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను.
Як був я з ними на сьвітї, я беріг їх в імя Твоє; котрих дав єси менї, стеріг я, і нїхто з них не погиб, тільки Син погибельний, щоб писаннє справдилось.
13 ౧౩ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
Тепер же до Тебе йду, і се глаголю в сьвітї, щоб мали радість мою повну в собі.
14 ౧౪ వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది.
Я дав їм слово Твоє, і сьвіт зненавидів їх, бо вони не з сьвіта, яко ж я не з сьвіта.
15 ౧౫ నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
Не молю, щоб узяв їх із сьвіта, а щоб зберіг їх од зла.
16 ౧౬ నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు.
Не з сьвіта вони, яко ж я не з сьвіта.
17 ౧౭ సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.
Освяти їх правдою Твоєю; слово Твоє правда.
18 ౧౮ “నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను.
Як мене післав єси в сьвіт, і я післав їх у сьвіт.
19 ౧౯ వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
І за них я посьвячую себе, щоб і вони були осьвячені правдою.
20 ౨౦ నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే,
Не про сих же тільки молю, а також і про тих, що задля слова їх увірують у мене,
21 ౨౧ వారు మనలో ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. వారి మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
щоб усї одно були: яко ж Ти, Отче, в менї і я в Тобі, щоб і вони в нас одно були, щоб сьвіт увірував, що Ти мене післав єси.
22 ౨౨ మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.
І славу, що дав єси менї, дав я їм, щоб були одно, яко ми одно.
23 ౨౩ వారిలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వారు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని, లోకం తెలుసుకొనేలా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను.
Я в них і Ти в менї, щоб були звершені в одно, і щоб зрозумів сьвіт, що Ти мене післав єси і полюбив їх, яко ж мене полюбив єси.
24 ౨౪ “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
Отче, которих дав єси менї, хочу, щоб, де я, і вони були зо мною, щоб видїли славу мою, що дав єси менї; бо полюбив єси мене перш основання сьвіта.
25 ౨౫ నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు.
Отче праведний, і сьвіт Тебе не пізнав, я ж пізнав Тебе, і сї пізнали, що Ти мене післав.
26 ౨౬ నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”
І я обявив їм імя Твоє, і обявляти му, щоб любов, якою любив єси мене, в них була, а я в них.