< యోహాను 17 >

1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు.
ততঃ পৰং যীশুৰেতাঃ কথাঃ কথযিৎৱা স্ৱৰ্গং ৱিলোক্যৈতৎ প্ৰাৰ্থযৎ, হে পিতঃ সময উপস্থিতৱান্; যথা তৱ পুত্ৰস্তৱ মহিমানং প্ৰকাশযতি তদৰ্থং ৎৱং নিজপুত্ৰস্য মহিমানং প্ৰকাশয|
2 నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. (aiōnios g166)
ৎৱং যোল্লোকান্ তস্য হস্তে সমৰ্পিতৱান্ স যথা তেভ্যোঽনন্তাযু ৰ্দদাতি তদৰ্থং ৎৱং প্ৰাণিমাত্ৰাণাম্ অধিপতিৎৱভাৰং তস্মৈ দত্তৱান্| (aiōnios g166)
3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. (aiōnios g166)
যস্ত্ৱম্ অদ্ৱিতীযঃ সত্য ঈশ্ৱৰস্ত্ৱযা প্ৰেৰিতশ্চ যীশুঃ খ্ৰীষ্ট এতযোৰুভযোঃ পৰিচযে প্ৰাপ্তেঽনন্তাযু ৰ্ভৱতি| (aiōnios g166)
4 నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను.
ৎৱং যস্য কৰ্ম্মণো ভাৰং মহ্যং দত্তৱান্, তৎ সম্পন্নং কৃৎৱা জগত্যস্মিন্ তৱ মহিমানং প্ৰাকাশযং|
5 తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు.
অতএৱ হে পিত ৰ্জগত্যৱিদ্যমানে ৎৱযা সহ তিষ্ঠতো মম যো মহিমাসীৎ সম্প্ৰতি তৱ সমীপে মাং তং মহিমানং প্ৰাপয|
6 లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు.
অন্যচ্চ ৎৱম্ এতজ্জগতো যাল্লোকান্ মহ্যম্ অদদা অহং তেভ্যস্তৱ নাম্নস্তত্ত্ৱজ্ঞানম্ অদদাং, তে তৱৈৱাসন্, ৎৱং তান্ মহ্যমদদাঃ, তস্মাত্তে তৱোপদেশম্ অগৃহ্লন্|
7 నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు.
ৎৱং মহ্যং যৎ কিঞ্চিদ্ অদদাস্তৎসৰ্ৱ্ৱং ৎৱত্তো জাযতে ইত্যধুনাজানন্|
8 ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు.
মহ্যং যমুপদেশম্ অদদা অহমপি তেভ্যস্তমুপদেশম্ অদদাং তেপি তমগৃহ্লন্ ৎৱত্তোহং নিৰ্গত্য ৎৱযা প্ৰেৰিতোভৱম্ অত্ৰ চ ৱ্যশ্ৱসন্|
9 “నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను.
তেষামেৱ নিমিত্তং প্ৰাৰ্থযেঽহং জগতো লোকনিমিত্তং ন প্ৰাৰ্থযে কিন্তু যাল্লোকান্ মহ্যম্ অদদাস্তেষামেৱ নিমিত্তং প্ৰাৰ্থযেঽহং যতস্তে তৱৈৱাসতে|
10 ౧౦ నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది.
১০যে মম তে তৱ যে চ তৱ তে মম তথা তৈ ৰ্মম মহিমা প্ৰকাশ্যতে|
11 ౧౧ నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు.
১১সাম্প্ৰতম্ অস্মিন্ জগতি মমাৱস্থিতেঃ শেষম্ অভৱৎ অহং তৱ সমীপং গচ্ছামি কিন্তু তে জগতি স্থাস্যন্তি; হে পৱিত্ৰ পিতৰাৱযো ৰ্যথৈকৎৱমাস্তে তথা তেষামপ্যেকৎৱং ভৱতি তদৰ্থং যাল্লোকান্ মহ্যম্ অদদাস্তান্ স্ৱনাম্না ৰক্ষ|
12 ౧౨ నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను.
১২যাৱন্তি দিনানি জগত্যস্মিন্ তৈঃ সহাহমাসং তাৱন্তি দিনানি তান্ তৱ নাম্নাহং ৰক্ষিতৱান্; যাল্লোকান্ মহ্যম্ অদদাস্তান্ সৰ্ৱ্ৱান্ অহমৰক্ষং, তেষাং মধ্যে কেৱলং ৱিনাশপাত্ৰং হাৰিতং তেন ধৰ্ম্মপুস্তকস্য ৱচনং প্ৰত্যক্ষং ভৱতি|
13 ౧౩ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
১৩কিন্ত্ৱধুনা তৱ সন্নিধিং গচ্ছামি মযা যথা তেষাং সম্পূৰ্ণানন্দো ভৱতি তদৰ্থমহং জগতি তিষ্ঠন্ এতাঃ কথা অকথযম্|
14 ౧౪ వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది.
১৪তৱোপদেশং তেভ্যোঽদদাং জগতা সহ যথা মম সম্বন্ধো নাস্তি তথা জজতা সহ তেষামপি সম্বন্ধাভাৱাজ্ জগতো লোকাস্তান্ ঋতীযন্তে|
15 ౧౫ నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
১৫ৎৱং জগতস্তান্ গৃহাণেতি ন প্ৰাৰ্থযে কিন্ত্ৱশুভাদ্ ৰক্ষেতি প্ৰাৰ্থযেহম্|
16 ౧౬ నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు.
১৬অহং যথা জগৎসম্বন্ধীযো ন ভৱামি তথা তেপি জগৎসম্বন্ধীযা ন ভৱন্তি|
17 ౧౭ సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.
১৭তৱ সত্যকথযা তান্ পৱিত্ৰীকুৰু তৱ ৱাক্যমেৱ সত্যং|
18 ౧౮ “నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను.
১৮ৎৱং যথা মাং জগতি প্ৰৈৰযস্তথাহমপি তান্ জগতি প্ৰৈৰযং|
19 ౧౯ వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
১৯তেষাং হিতাৰ্থং যথাহং স্ৱং পৱিত্ৰীকৰোমি তথা সত্যকথযা তেপি পৱিত্ৰীভৱন্তু|
20 ౨౦ నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే,
২০কেৱলং এতেষামৰ্থে প্ৰাৰ্থযেঽহম্ ইতি ন কিন্ত্ৱেতেষামুপদেশেন যে জনা মযি ৱিশ্ৱসিষ্যন্তি তেষামপ্যৰ্থে প্ৰাৰ্থেযেঽহম্|
21 ౨౧ వారు మనలో ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. వారి మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
২১হে পিতস্তেষাং সৰ্ৱ্ৱেষাম্ একৎৱং ভৱতু তৱ যথা মযি মম চ যথা ৎৱয্যেকৎৱং তথা তেষামপ্যাৱযোৰেকৎৱং ভৱতু তেন ৎৱং মাং প্ৰেৰিতৱান্ ইতি জগতো লোকাঃ প্ৰতিযন্তু|
22 ౨౨ మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.
২২যথাৱযোৰেকৎৱং তথা তেষামপ্যেকৎৱং ভৱতু তেষ্ৱহং মযি চ ৎৱম্ ইত্থং তেষাং সম্পূৰ্ণমেকৎৱং ভৱতু, ৎৱং প্ৰেৰিতৱান্ ৎৱং মযি যথা প্ৰীযসে চ তথা তেষ্ৱপি প্ৰীতৱান্ এতদ্যথা জগতো লোকা জানন্তি
23 ౨౩ వారిలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వారు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని, లోకం తెలుసుకొనేలా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను.
২৩তদৰ্থং ৎৱং যং মহিমানং মহ্যম্ অদদাস্তং মহিমানম্ অহমপি তেভ্যো দত্তৱান্|
24 ౨౪ “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
২৪হে পিত ৰ্জগতো নিৰ্ম্মাণাৎ পূৰ্ৱ্ৱং মযি স্নেহং কৃৎৱা যং মহিমানং দত্তৱান্ মম তং মহিমানং যথা তে পশ্যন্তি তদৰ্থং যাল্লোকান্ মহ্যং দত্তৱান্ অহং যত্ৰ তিষ্ঠামি তেপি যথা তত্ৰ তিষ্ঠন্তি মমৈষা ৱাঞ্ছা|
25 ౨౫ నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు.
২৫হে যথাৰ্থিক পিত ৰ্জগতো লোকৈস্ত্ৱয্যজ্ঞাতেপি ৎৱামহং জানে ৎৱং মাং প্ৰেৰিতৱান্ ইতীমে শিষ্যা জানন্তি|
26 ౨౬ నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”
২৬যথাহং তেষু তিষ্ঠামি তথা মযি যেন প্ৰেম্না প্ৰেমাকৰোস্তৎ তেষু তিষ্ঠতি তদৰ্থং তৱ নামাহং তান্ জ্ঞাপিতৱান্ পুনৰপি জ্ঞাপযিষ্যামি|

< యోహాను 17 >