< యోహాను 16 >

1 “మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను.
این را به شما گفتم تا لغزش نخورید.۱
2 వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.
شما را از کنایس بیرون خواهندنمود؛ بلکه ساعتی می‌آید که هر‌که شما را بکشد، گمان برد که خدا را خدمت می‌کند.۲
3 నేను గాని, తండ్రి గాని వారికి తెలియదు కాబట్టి అలా చేస్తారు.
و این کارهارا با شما خواهند کرد، بجهت آنکه نه پدر راشناخته‌اند و نه مرا.۳
4 అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు.
لیکن این را به شما گفتم تاوقتی که ساعت آید به‌خاطر آورید که من به شماگفتم. و این را از اول به شما نگفتم، زیرا که با شمابودم.۴
5 అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు.
«اما الان نزد فرستنده خود می‌روم و کسی ازشما از من نمی پرسد به کجا می‌روی.۵
6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది.
ولیکن چون این را به شما گفتم، دل شما از غم پر شده است.۶
7 “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను.
و من به شما راست می‌گویم که رفتن من برای شما مفید است، زیرا اگر نروم تسلی دهنده نزد شما نخواهد آمد. اما اگر بروم او را نزد شمامی فرستم.۷
8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు.
و چون او آید، جهان را بر گناه وعدالت و داوری ملزم خواهد نمود.۸
9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు.
اما بر گناه، زیرا که به من ایمان نمی آورند.۹
10 ౧౦ నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు.
و اما بر عدالت، از آن سبب که نزد پدر خود می‌روم و دیگر مرانخواهید دید.۱۰
11 ౧౧ ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
و اما بر داوری، از آنرو که بررئیس این جهان حکم شده است.۱۱
12 ౧౨ “నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు.
«و بسیار چیزهای دیگر نیز دارم به شمابگویم، لکن الان طاقت تحمل آنها را ندارید.۱۲
13 ౧౩ అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.
ولیکن چون او یعنی روح راستی آید، شما را به جمیع راستی هدایت خواهد کرد زیرا که از خودتکلم نمی کند بلکه به آنچه شنیده است سخن خواهد گفت و از امور آینده به شما خبر‌خواهدداد.۱۳
14 ౧౪ ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు.
او مرا جلال خواهد داد زیرا که از آنچه آن من است خواهد گرفت و به شما خبر‌خواهد داد.۱۴
15 ౧౫ నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
هر‌چه از آن پدر است، از آن من است. از این جهت گفتم که از آنچه آن من است، می‌گیرد و به شما خبر‌خواهد داد.۱۵
16 ౧౬ “కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.”
«بعد از اندکی مرانخواهید دید و بعد از اندکی باز مرا خواهید دیدزیرا که نزد پدر می‌روم.»۱۶
17 ౧౭ ఆయన శిష్యుల్లో కొంతమంది “ఆయన కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంటున్నాడు. ఇది ఏమిటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు,
آنگاه بعضی از شاگردانش به یکدیگرگفتند: «چه چیز است اینکه به ما می‌گوید که اندکی مرا نخواهید دید و بعد از اندکی باز مراخواهید دید و زیرا که نزد پدر می‌روم؟»۱۷
18 ౧౮ కాబట్టి వారు, కొద్ది కాలం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు” అనుకున్నారు.
پس گفتند: «چه چیز است این اندکی که می‌گوید؟ نمی دانیم چه می‌گوید.»۱۸
19 ౧౯ వారు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వారితో, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు’ అని నేను అన్నదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తున్నారా?
عیسی چون دانست که می‌خواهند از او سوال کنند، بدیشان گفت: «آیا در میان خود از این سوال می‌کنید که گفتم اندکی دیگر مرا نخواهید دید پس بعد از اندکی بازمرا خواهید دید.۱۹
20 ౨౦ నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది.
آمین آمین به شما می‌گویم که شما گریه و زاری خواهید کرد و جهان شادی خواهد نمود. شما محزون می‌شوید لکن حزن شما به خوشی مبدل خواهد شد.۲۰
21 ౨౧ స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.
زن در حین زاییدن محزون می‌شود، زیرا که ساعت او رسیده است. و لیکن چون طفل را زایید، آن زحمت رادیگر یاد نمی آورد به‌سبب خوشی از اینکه انسانی در جهان تولد یافت.۲۱
22 ౨౨ “అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు.
پس شما همچنین الان محزون می‌باشید، لکن باز شما را خواهم دیدو دل شما خوش خواهد گشت و هیچ‌کس آن خوشی را از شما نخواهد گرفت.۲۲
23 ౨౩ ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.
و در آن روزچیزی از من سوال نخواهید کرد. آمین آمین به شما می‌گویم که هر‌آنچه از پدر به اسم من طلب کنید به شما عطا خواهد کرد.۲۳
24 ౨౪ ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు.
تا کنون به اسم من چیزی طلب نکردید، بطلبید تا بیابید و خوشی شما کامل گردد.۲۴
25 ౨౫ ఈ సంగతులు ఇంతవరకూ తేలికగా అర్థం కాని భాషలో మీకు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది అప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను.
این چیزها را به مثلها به شماگفتم، لکن ساعتی می‌آید که دیگر به مثلها به شماحرف نمی زنم بلکه از پدر به شما آشکارا خبرخواهم داد.۲۵
26 ౨౬ ఆ రోజున మీరు నా పేరట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడం లేదు.
«در آن روز به اسم من طلب خواهید کرد وبه شما نمی گویم که من بجهت شما از پدر سوال می‌کنم،۲۶
27 ౨౭ ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
زیرا خود پدر شما را دوست می‌دارد، چونکه شما مرا دوست داشتید و ایمان آوردیدکه من از نزد خدا بیرون آمدم.۲۷
28 ౨౮ నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు.
از نزد پدر بیرون آمدم و در جهان وارد شدم، و باز جهان را گذارده، نزد پدر می‌روم.»۲۸
29 ౨౯ ఆయన శిష్యులు, “చూడు, ఇప్పుడు నువ్వు అర్థం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు.
شاگردانش بدو گفتند: «هان اکنون علانیه سخن می‌گویی و هیچ مثل نمی گویی.۲۹
30 ౩౦ నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేము తెలుసుకున్నాం. దీని వలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
الان دانستیم که همه‌چیز رامی دانی و لازم نیست که کسی از تو بپرسد. بدین جهت باور می‌کنیم که از خدا بیرون آمدی.»۳۰
31 ౩౧ యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా?
عیسی به ایشان جواب داد: «آیا الان باورمی کنید؟۳۱
32 ౩౨ మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.
اینک ساعتی می‌آید بلکه الان آمده است که متفرق خواهید شد هریکی به نزدخاصان خود و مرا تنها خواهید گذارد. لیکن تنهانیستم زیرا که پدر با من است.۳۲
33 ౩౩ నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.
بدین چیزها به شما تکلم کردم تا در من سلامتی داشته باشید. در جهان برای شما زحمت خواهد شد. و لکن خاطرجمع دارید زیرا که من بر جهان غالب شده‌ام.»۳۳

< యోహాను 16 >