< యోహాను 15 >

1 “నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు.
Nene na mzabibu ghwa bhukweli, ni dadi jhangu ndo n'kulima ghwa mizabibu.
2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు.
Kila litafi mugati mwa nene ambalyo lihogola lepi litunda libhosibhwa ili libhwesiyi kuhogola zaidi.
3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు.
Muenga tayari mujhele mwebhanofu kwandabha jha bhujumbe ambabho ni bhajobhili.
4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు.
Mtamayi mgati mwa nene ni nene mwa muenga. Kama litafi kyalibhwesyalepi kuhogola lyene palibelikujha mu mzabibu, kadhalika namu, mkabelayi kutama mwanene.
5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
Nene na mzabibu; muenga matafi. Jhaibetakudumu mugati mwa nene nani nibetakujha mwa muene, munu ojho ihogola matunda mini, kwa kujha pasipo nene wibhwesyalepi kubhomba khenu kyokyoha khela.
6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి.
Ikajhiajhi munu jhejhioha ibetalepi kusalila mugati mwa nene ibetakutaghibhwa kama litafi ni kujhoma; bhanu bhibhonganya matafi ni kutagha mu muoto, ni kuteketela.
7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.
Ikajhiayi mwibetakudumu mugati mwa nene, ni kama malobhi ghangu ghatamisyi mwa muenga, mus'okayi lyolyoha lya mwilonda namu mwibetakubhombibhwa.
8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.
Katika e'le Dadi jhangu atukusibhu, kwamba mwihogola matunda mingi ni kwamba bhanafunzi bhanene.
9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి.
Kama dadijhangu kya aniganili nene, nani pia nibhaganili muenga; mudumumuayi mu lipendo lyangu.
10 ౧౦ నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.
Ikajhiajhi mwibeta kusikamula amri sya nene, mwibeta kutamisya mu lipendo lya muene.
11 ౧౧ మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.
Nijobhili mambo agha kwa muenga ili furaha jha nene jhijhelayi mugati mwa muenga ili kwamba furaha jha muenga jhibhombekayi kujha timilifu.
12 ౧౨ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.
Ejhe ndo amri jha nene, kwamba mgananayi jhomu kwa jhomu kama kyanibhaganili nene.
13 ౧౩ స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు.
Ajhelepi munu jha ajhe ni bhupendo mbaha kuliko obho, kujha aghapisiayi maisha gha muene kwandabha jha bhalongomunu.
14 ౧౪ నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.
Muenga bhalongobhangu kama mwibetakubhomba ghala ghanibhalaghisi.
15 ౧౫ “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను.
Nikabhakuta lepi bhatumwa, kwa kujha n'tumwa amanyilepi khela kyaibhomba bwana ghwa muene. Nibhakutili muenga marafiki, kwa ndabha nibhajobhili muenga mambo ghoha ambagho ni ghap'eliki kuhomela kwa Dadi.
16 ౧౬ మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను.
Mwanichuguili lepi nene, bali nene nabhachaguili muenga ni kubhabheka mlotayi kuhogola matunda ni litunda lya muega libhwesyayi kutama. E'le lijhele naha ili kyamwis'oka kwa Dadi kwa lihina lya nene, ibetakubhapela.
17 ౧౭ మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
Mambo agha nikabhalaghisya, kujha mgananayi khila munu ni njhinu.
18 ౧౮ “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి.
Kamam ulimwengu ghwibetakubhadadila, mmanyayi kujha bhwanidadila nene kabla jha kubhadadila muenga.
19 ౧౯ మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
Kama ngamujhele bha ulimwengu, ulimwengu gha ubhaganili kama ghwa bhene; Lakini kwa ndabha bhaulimwengu lepi na kwa ndabha nabhachaguili kuh'omela ku ulimwengu, kwandabha ejhe ulimwengu ukabhachukila.
20 ౨౦ “‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు.
Mkhombokayi lilobhi lya nabhajobhili, 'N'tumwa mbaha lepi kuliko bwana ghwa muene.' Ikajhelayi bhanitesisi nene, bhibetakubhatesya ni muenga pia; kama bhakamuili lilobhi lya nene, ngabhalikamuili lya jhomu pia.
21 ౨౧ వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు.
Bhibetakubhabhombela mbombo agha ghoha kwandabha jha lihina lya nene, kwa ndabha bhammanyilepi jhola jhaanilaghisi.
22 ౨౨ నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు.
Kama nganihidilepi ni kubhajobhela, ngabhajhelepi bhabhomba dhambi; lakini henu bhajhelepi ni udhuru kwa dhambi sya bhene.
23 ౨౩ “నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు.
Jhaakanida dila nene akan'dadila ni Dadi pia.
24 ౨౪ ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు.
Ikajhiajhi nibhombilepi mbombo miongoni mwa bhene ambayo ajhelepi hata mmonga jha ajhibhombili, ngabhajhele bhaduli dhambi; lakini henu bhabhombili ghoha mabhele bhabhuene na bhanidadili nene ni Dadi jhangu.
25 ౨౫ ‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.
E'le lihomlea ili lilobhi litimilayi ambalyo lilembibhu mu sheria sya bhene: 'Bhakanidadila nene bila sababu.'
26 ౨౬ “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు.
Wakati mfariji ahidili, ambajhe nikandaghisya kwa muenga kuhomela kwa Dadi, ojho ndo, Roho ghwa kweli, ambajhe ihomela kwa Dadi, ibetakunishuhudila.
27 ౨౭ మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.
Namu pia mwibetakunishuhudila kwa ndabha nijhele pamonga nani kuhomela kubhwandelu.

< యోహాను 15 >