< యోహాను 14 >

1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి.
“Kik uwe chunyu chandre. Yieuru kuom Nyasaye, to An bende yieuru kuoma.
2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.
E dala Wuora nitiere udi mangʼeny, kendo ka dine ok en kamano, to dikoro asenyisou. Adhi kuno mondo alosnu kar dak.
3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను.
To ka adhi mi alosonu kar dak, eka abiro duogo kawou mondo un bende ubed koda kama antiere.
4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.
Ageno ni ungʼeyo yo madhi kuma adhiye.”
5 తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
Thoma nowachone niya, “Ruoth wakia kuma idhiye, koro ere kaka dwangʼe yo?”
6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.
Yesu nodwoke niya, “An e yo kendo An e adiera bende An e ngima. Onge ngʼama nyalo biro ir Wuora ka ok okadho kuoma.
7 మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు.
Ka ungʼeya adier, to Wuora bende ubiro ngʼeyo. Chakre kawuononi ungʼeye kendo usenene.”
8 ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు.
Filipo nowachone niya, “Ruoth, nyiswa Wuoro mondo kik wachak wachandi kendo.”
9 యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు?
Yesu nodwoke niya, “Filipo, asebedo kodu kuom kinde mangʼeny, kare in pok ingʼeya? Ngʼato angʼata mosenena oseneno Wuoro, koro ere kaka ikelo wacho ni, ‘Nyiswa Wuoro’?
10 ౧౦ నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు.
Donge iyie ni An ei Wuora kendo Wuora ni e iya? Weche ma awachonu ok gin mana wechena awuon. Chutho, Wuora modak e iya ema timo tichne.
11 ౧౧ తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.
Yie koda ka awacho ni an ei Wuora kendo Wuora ni e iya; to ka ok kamano, to yie kuom ranyisi gi honni ma asebedo ka atimo.
12 ౧౨ నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.
Awachonu adier, ni ngʼato ka ngʼato ma oyie kuoma biro timo gik ma asebedo ka atimo. Bende obiro timo gik madongo moloyo magi, nikech adhi ka Wuora.
13 ౧౩ “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది.
Abiro timo gimoro amora mukwayo e nyinga, eka Wuowi omi Wuoro duongʼ.
14 ౧౪ మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
Gimoro amora ma ukwayo e nyinga anatimnu.”
15 ౧౫ మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
“Ka uhera to ubiro timo gima achikou.
16 ౧౬ “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. (aiōn g165)
Anakwa Wuoro, kendo obiro miyou Jakony machielo mondo obed kodu nyaka chiengʼ. (aiōn g165)
17 ౧౭ ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు.
Jakonyno en Roho mar adier. Piny ok nyal rwake, nikech ok ginyal nene kendo gikiaye. Un to ungʼeye, nimar odak kodu kendo obiro bet eiu.
18 ౧౮ నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.
Ok abi weyou ka nyithi kiye; abiro biro iru.
19 ౧౯ కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
Odongʼ kinde matin to piny ok bi nena kendo. Un to pod ubiro nena, kendo ubiro bedo mangima nikech angima.
20 ౨౦ నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.
Odiechiengʼno unungʼe ni an ei Wuora; kendo ni un e iya, kendo an eiu.
21 ౨౧ నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు.
Ngʼato angʼata mongʼeyo chikena kendo orito, e ngʼama ohera. Ngʼat mohera, Wuora biro hero, kendo an bende abiro here, mi afwenyrane.”
22 ౨౨ యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు.
Eka Judas, ma ok Judas Iskariot, nowachone niya, “To Ruoth, angʼo momiyo wan ema idwaro fwenyorinwa to ok ni piny?”
23 ౨౩ యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.
Yesu nodwoke niya, “Ka ngʼato ohera to obiro rito puonjna, Wuora biro here, kendo wabiro biro ire mi walos kar dakwa kode.
24 ౨౪ నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.
Ngʼama ok ohera ok nyal timo gima apuonjo. Weche muwinjogi ok gin maga awuon, to gin mag Wuora mane oora.
25 ౨౫ మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను.
“Gigi duto asenyisou kapod an kodu.
26 ౨౬ నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.
To Jakony, ma en Roho Maler, ma Wuora biro oro e nyinga, biro puonjou weche duto, kendo obiro paronu gik moko duto ma asenyisou.
27 ౨౭ శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.
Aweyonu kwe; kwe mara ema amiyou. En kwe ma pinyni ok nyal miyou. Kik chunyu parre kendo kik ubed maluor.
28 ౨౮ ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.
“Ne uwinjo ka awacho niya, ‘Adhi to abiro duogo iru kendo.’ Ka dine bed ni uhera, to dine ubedo mamor ni adhi ka Wuora, nimar Wuora duongʼ moloya.
29 ౨౯ ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
Koro asenyisou kapok mano otimore, mondo ka gigo otimore to uyie.
30 ౩౦ ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు.
Ok abi wuoyo kodu amingʼa nimar ruodh pinyni biro, to oonge gi teko kuoma.
31 ౩౧ నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”
Kata kamano, piny nyaka ngʼe ni ahero Wuora kendo ni atimo mana gima Wuora osechika mondo atim. “Kuom mano, chunguru mondo wadhi.

< యోహాను 14 >