< యోహాను 11 >
1 ౧ బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, మార్త అతని సోదరీలు.
Був один хворий [чоловік, на ім’я] Лазар, з Віфанії, села, де жила Марія та її сестра Марта.
2 ౨ ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ.
Марія була жінкою, яка помазала Господа миром і обтерла Йому ноги своїм волоссям. Хворий був її братом.
3 ౩ అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు, “ప్రభూ, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది” అని యేసుకు కబురు పంపించారు.
Сестри послали передати Ісусові: ―Господи, той, кого Ти любиш, захворів.
4 ౪ యేసు అది విని, “ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారుడికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది” అన్నాడు.
Почувши це, Ісус сказав: ―Ця хвороба не на смерть, а на славу Божу, щоб Син Божий був прославлений через неї.
5 ౫ మార్తను, ఆమె సోదరిని లాజరును యేసు ప్రేమించాడు.
Ісус любив Марту, її сестру та Лазаря.
6 ౬ లాజరు జబ్బు పడ్డాడని యేసు విని కూడా తాను ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
Однак коли Він почув, що [Лазар] хворий, то залишився там, де був, ще два дні.
7 ౭ దాని తరువాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి” అన్నాడు.
Потім сказав [Своїм] учням: ―Підемо знову в Юдею.
8 ౮ ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అన్నారు.
Учні сказали Йому: ―Равві, ще недавно юдеї намагалися побити Тебе камінням, а Ти знову йдеш туди?
9 ౯ అందుకు యేసు జవాబిస్తూ, “పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు.
Ісус відповів: ―Чи не дванадцять годин має день? Якщо хтось ходить удень, не спотикається, бо бачить світло цього світу.
10 ౧౦ అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు” అని చెప్పాడు.
А той, хто ходить уночі, спотикається, бо немає світла в ньому.
11 ౧౧ యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను.”
Сказавши це, Він додав: ―Наш друг Лазар заснув, але Я йду розбудити Його.
12 ౧౨ అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.
Його учні сказали: ―Господи, якщо спить, то одужає.
13 ౧౩ యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
Ісус казав про його смерть, а вони думали, що Він говорить про звичайний сон.
14 ౧౪ అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
Тоді Ісус сказав їм прямо: ―Лазар помер.
15 ౧౫ నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి” అన్నాడు.
Але Я радію за вас, що не був там, щоб ви повірили. А зараз підемо до нього.
16 ౧౬ దిదుమ అనే మారుపేరున్న తోమా, “యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి” అని తన తోటి శిష్యులతో అన్నాడు.
Тоді Фома, якого називали Близнюк, сказав іншим учням: ―Ходімо й ми та помремо з Ним!
17 ౧౭ యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు.
Прийшовши туди, Ісус довідався, що [Лазар] уже чотири дні в гробі.
18 ౧౮ బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
Віфанія була близько до Єрусалима, приблизно п’ятнадцять стадіїв.
19 ౧౯ చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
Багато юдеїв прийшли до Марії та Марти, щоб втішити їх після [смерті] брата.
20 ౨౦ అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
Коли Марта почула, що прийшов Ісус, вона вийшла зустріти Його, а Марія залишилася в домі.
21 ౨౧ అప్పుడు మార్త యేసుతో, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
Марта сказала Ісусові: ―Господи, якби Ти був тут, то мій брат не помер би.
22 ౨౨ ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు” అంది.
Але й тепер знаю: Бог дасть Тобі, що лише попросиш у Бога.
23 ౨౩ యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు.
Ісус сказав їй: ―Твій брат воскресне.
24 ౨౪ మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.
Марта відповіла: ―Я знаю, що він воскресне при воскресінні останнього дня.
25 ౨౫ అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
Ісус сказав їй: ―Я – воскресіння й життя. Той, хто вірить у Мене, навіть якщо помре, буде жити.
26 ౨౬ బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు. (aiōn )
І кожен, хто живе й вірить у Мене, ніколи не помре. Ти віриш у це? (aiōn )
27 ౨౭ ఆమె, “అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
Вона сказала: ―Так, Господи, я вірю, що Ти Христос, Син Божий, Який прийшов у світ.
28 ౨౮ ఈ మాట చెప్పిన తరువాత ఆమె వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది.
Сказавши це, вона пішла, потай покликала свою сестру Марію й сказала їй: «Учитель тут, Він кличе тебе».
29 ౨౯ మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది.
Почувши це, Марія швидко встала й вийшла до Нього.
30 ౩౦ యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు.
Ісус ще не увійшов до села, а був там, де Його зустріла Марта.
31 ౩౧ మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు.
Юдеї, які були з нею в домі та втішали її, побачивши, що Марія швидко встала й вийшла, пішли за нею. Вони гадали, що вона пішла до гробу, щоб там плакати.
32 ౩౨ అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది.
Коли Марія прийшла туди, де був Ісус, і побачила Його, то впала до Його ніг і сказала Йому: ―Господи, якби Ти був тут, то мій брат не помер би.
33 ౩౩ ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు.
Ісус, побачивши, що вона плаче, і юдеї, які прийшли з нею, теж плачуть, був глибоко зворушений в дусі та засмутився.
34 ౩౪ వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు.
Він запитав: ―Куди ви його поклали? Йому відповіли: ―Господи, іди та подивись!
36 ౩౬ అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.
Тоді юдеї сказали: «Дивись, як Він любив його».
37 ౩౭ వారిలో కొంతమంది, “ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?” అన్నారు.
Але деякі казали: «Невже Той, Хто відкрив очі сліпому, не міг зробити, щоб цей чоловік не помер?»
38 ౩౮ యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది.
Ісус знов відчув зворушення в Собі й пішов до гробу. Це була печера, до якої був привалений камінь.
39 ౩౯ యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది.
Ісус звелів: ―Відваліть камінь. Марта, сестра померлого, сказала: ―Господи, вже чути неприємний запах, бо пройшло чотири дні.
40 ౪౦ యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు.
Ісус сказав: ―Хіба Я не казав тобі, що коли будеш вірити, побачиш славу Божу?
41 ౪౧ కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.
Коли забрали камінь, Ісус подивився на небо й сказав: «Отче, дякую Тобі, що Ти почув Мене.
42 ౪౨ నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు.
Я знаю, що Ти завжди чуєш Мене, але Я сказав це заради людей, які стоять навколо, щоб вони повірили, що Ти послав Мене».
43 ౪౩ ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు.
І, сказавши це, голосно промовив: «Лазарю, вийди сюди!»
44 ౪౪ అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు.
Померлий вийшов. Його руки та ноги були обмотані тканиною, а обличчя обв’язане хустиною. Ісус сказав: ―Розв’яжіть його, і нехай він іде.
45 ౪౫ అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.
Багато юдеїв, які прийшли до Марії та побачили, що Він зробив, повірили в Нього.
46 ౪౬ కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
Але деякі з них пішли до фарисеїв і розповіли, що зробив Ісус.
47 ౪౭ అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
Тоді первосвященники та фарисеї скликали Синедріон і сказали: ―Що нам робити? Цей Чоловік робить багато знамень.
48 ౪౮ మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.
Якщо ми залишимо Його так, то всі повірять у Нього, і прийдуть римляни та знищать це місце й народ.
49 ౪౯ అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు.
Тоді один із них, [на ім’я] Каяфа, який був первосвященником того року, сказав їм: ―Ви нічого не знаєте.
50 ౫౦ మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు.
Хіба не розумієте, що краще для вас, щоб один Чоловік помер за народ, ніж щоб увесь народ загинув?
51 ౫౧ అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు.
Він сказав це не від себе, але, будучи того року первосвященником, він пророкував, що Ісус має померти за народ,
52 ౫౨ ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు.
і не тільки за народ, але й щоб зібрати в одне розсіяних дітей Божих.
53 ౫౩ కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు.
Отже, від цього дня вони змовилися вбити Його.
54 ౫౪ అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు.
Тому Ісус не ходив відкрито серед юдеїв, а пішов звідти до околиць біля пустелі, у місто, яке називається Єфрем. Там перебував з учнями.
55 ౫౫ యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు.
Наближалася юдейська Пасха, і багато [людей] з усього краю йшли до Єрусалима для очищення перед Пасхою.
56 ౫౬ వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?”
Вони шукали Ісуса й, стоячи в Храмі, казали одне до одного: «Як ви вважаєте, чи прийде Він на свято?»
57 ౫౭ యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.
Але первосвященники та фарисеї дали наказ: якщо хтось дізнається, де Він перебуває, нехай повідомить їх, щоб вони схопили Його.