< యోహాను 10 >
1 ౧ మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
“Ngikhuluma iqiniso ukuthi umuntu ongangeni ngesango esibayeni sezimvu kodwa akhwele kwenye indawo ulisela lomphangi.
2 ౨ ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
Umuntu ongena ngesango nguye umelusi wezimvu.
3 ౩ అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
Umlindi wesango uyamvulela, lezimvu ziyalilalela ilizwi lakhe. Izimvu zakhe uzibiza ngamabizo azikhokhele.
4 ౪ తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
Nxa esezivulele zonke ezakhe, uhamba phambi kwazo, izimvu zakhe zimlandele ngoba ziyalazi ilizwi lakhe.
5 ౫ వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.
Kodwa kazisoze zilandele owemzini; iqiniso yikuthi zizambalekela ngoba kazilazi ilizwi lowemzini.”
6 ౬ యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.
UJesu wasebenzisa umzekeliso lo kodwa kabakuzwisisanga lokho ayebatshela khona.
7 ౭ అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.
Ngakho uJesu waphinda wathi, “Ngilitshela iqiniso ukuthi mina ngiyilo isango lezimvu.
8 ౮ నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.
Bonke asebake bafika phambi kwami babengamasela labaphangi kodwa izimvu kazibalalelanga.
9 ౯ నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.
Mina ngiyilo isango; loba ngubani ongena ngami uzasindiswa. Uzangena, aphume, afumane idlelo.
10 ౧౦ దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.
Isela lilanda ukweba lokubulala lokubhubhisa kuphela; mina ngilande ukuze zibe lokuphila, zibe lakho ngokugcweleyo.
11 ౧౧ నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
Ngingumelusi olungileyo. Umelusi olungileyo unikela ukuphila kwakhe izimvu zakhe.
12 ౧౨ జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.
Oqhatshiweyo kasuye umelusi ongumnini wezimvu. Yikho nxa ebona iganyana lisiza, uyazitshiya izimvu abaleke. Iganyana beseliwuhlasela umhlambi liwuhlakaze.
13 ౧౩ జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.
Umuntu lo ubaleka ngoba eyisiqhatshwa, kazikhathaleli izimvu.
14 ౧౪ నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
Mina ngingumelusi olungileyo; ngiyazazi izimvu zami njalo lezimvu zami ziyangazi
15 ౧౫ నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.
njengoba uBaba engazi lami ngiyamazi, nginikela ukuphila kwami ezimvini zami.
16 ౧౬ ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
Ngilazo ezinye izimvu ezingasizo zalumhlambi. Lazo kumele ngizilethe. Lazo futhi zizalilalela ilizwi lami ukuze kube lomhlambi owodwa lomelusi oyedwa.
17 ౧౭ నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
Isizatho sokuba uBaba angithande yikuthi ngiyayinikela impilo yami, ngizaphinde ngiyithathe futhi.
18 ౧౮ నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”
Kakho ongithathela yona kodwa ngiyinikela ngokufisa kwami. Ngilalo ilungelo lokuyinikela lelungelo lokuphinde ngiyithathe. Umlayo lo ngawamukela uvela kuBaba.”
19 ౧౯ ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
Amazwi aphinda enza amaJuda adabuka phakathi.
20 ౨౦ వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.
Amanengi kuwo athi, “Uledimoni, uyawumana njalo uyahlanya. Limlalelelani?”
21 ౨౧ ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.
Kodwa amanye athi, “La kayisiwo mazwi omuntu oledimoni. Idimoni lingawavula njani amehlo esiphofu?”
22 ౨౨ ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.
Kwafika uMkhosi Wokuzinikela eJerusalema. Kwakusebusika,
23 ౨౩ అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
uJesu esemagumeni ethempeli ezihambela eKhulusini likaSolomoni.
24 ౨౪ యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
AmaJuda ayembuthanele athi kuye, “Kuzaze kube nini ulokhu usitshiya silengile na? Nxa unguye uKhristu, sitshele kuhle.”
25 ౨౫ అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
UJesu waphendula wathi, “Ngalitshela kodwa kalikholwa. Imimangaliso engiyenzayo ngebizo likaBaba iyangifakazela,
26 ౨౬ అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
kodwa kalikholwa ngoba kalisizo zimvu zami.
27 ౨౭ నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.
Ezami izimvu ziyalilalela ilizwi lami; ngiyazazi lazo ziyangilandela.
28 ౨౮ నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు. (aiōn , aiōnios )
Ngizipha ukuphila okungapheliyo, kazisoze zabhubha; kakho ongazihlwitha esandleni sikaBaba. (aiōn , aiōnios )
29 ౨౯ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.
UBaba wami yena ongiphe zona mkhulu kulakho konke, kakho ongazihlwitha esandleni sikaBaba
30 ౩౦ నేను, నా తండ్రి, ఒకటే!”
Mina loBaba simunye.”
31 ౩౧ అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.
Aphinda njalo amaJuda adobha amatshe ukuba amkhande,
32 ౩౨ యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.
kodwa uJesu wathi kuwo, “Ngilitshengisile imimangaliso emikhulu eminengi evela kuBaba. Yiwuphi phakathi kwayo elingikhandela wona ngamatshe?”
33 ౩౩ అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.
“Kasikukhandeli misebenzi emihle oyenzileyo kodwa sikukhandela ukuhlambaza, ngoba wena, umuntu nje, uzenza uNkulunkulu.”
34 ౩౪ యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
UJesu waphendula wathi, “Kakulotshwanga yini eMthethweni wenu ukuthi, ‘Ngitshilo ukuthi “lingonkulunkulu?”’
35 ౩౫ లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
Nxa wababiza ngokuthi ‘ngonkulunkulu,’ bona labo ilizwi elafika kubo, njalo uMbhalo kawephulwa
36 ౩౬ తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?
pho-ke kungathiwani kulowo uBaba amkhethileyo ukuba ngowakhe wamthumela emhlabeni na? Kungani pho lingibeka icala lokuhlambaza ngoba ngithe ngiyiNdodana kaNkulunkulu?
37 ౩౭ నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.
Lingangikholwa ngaphandle kokuba ngenze okwenziwa nguBaba.
38 ౩౮ అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
Kodwa nxa ngikwenza, lanxa lingangikholwa, kholwani ubufakazi bemimangaliso ukuze lifunde njalo lizwisise ukuthi uBaba ukimi, lami ngikuBaba.”
39 ౩౯ వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.
Baphinda njalo bazama ukumbamba kodwa waphunyuka.
40 ౪౦ యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
UJesu wabuyela ngaphetsheya kweJodani kuleyondawo lapho uJohane ayebhaphathizela khona ensukwini ezedlulayo. Wahlala khona,
41 ౪౧ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.
abantu abanengi beza kuye. Bathi, “Lanxa uJohane engazange enze umangaliso, kodwa konke lokho uJohane akutshoyo ngomuntu lo kwakuliqiniso.”
42 ౪౨ అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.
Kuleyondawo abanengi bakholwa kuJesu.