< యోవేలు 3 >
1 ౧ ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,
Nebo aj, v těch dnech a v ten čas, když zase přivedu zajatý lid Judský a Jeruzalémský,
2 ౨ ఇతర ప్రజలందరినీ సమకూర్చి, యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి నేను అక్కడ వారిని శిక్షిస్తాను. వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు.
Shromáždím také všecky národy, a svedu je do údolí Jozafat, abych se tam soudil s nimi o lid svůj a dědictví své, Izraele, jejž rozptýlili mezi pohany a zemi mou rozdělili.
3 ౩ వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు.
Také o lid můj metali los, a dávali mládence za nevěstku, mladice pak prodávali za víno, aby pili.
4 ౪ తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? మీరు నా మీద ప్రతీకారం చూపించినా మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను.
Anobrž, co vy máte proti mně, ó Tyrští a Sidonští, i všecky končiny Filistinské? Zdaliž se mi odplacujete? Jestliže mi se odplacujete, snadněť a vnáhleť i já obrátím odplatu vaši na hlavu vaši,
5 ౫ మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు.
Kteříž stříbro mé i zlato mé béřete, a klénoty mé výborné vnášíte do chrámů svých,
6 ౬ యూదావారూ యెరూషలేము నగరవాసులూ తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు.
A syny Judské i syny Jeruzalémské prodáváte synům Javanovým, aby je pryč zavodili od pomezí jejich.
7 ౭ మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను.
Aj, já vzbudím je z toho místa, kamž jste je prodali, a obrátím odplatu vaši na hlavu vaši.
8 ౮ మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. యెహోవా ఈ మాట చెప్పాడు.
Prodám zajisté syny i dcery vaše v moc synů Judských, i prodadí je Sabejským, do národu dalekého; neboť jest Hospodin mluvil.
9 ౯ రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి.
Provolejte to mezi národy, vyhlaste boj, probuďte reků, nechť přitáhnou, a dadí se najíti všickni muži váleční.
10 ౧౦ మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.
Skujte motyky své v meče, a srpy své v oštípy; ten, kterýž jest mdlý, nechť řekne: Udatný jsem.
11 ౧౧ చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, మీరంతా త్వరగా సమకూడిరండి. యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.
Shromažďte se a přitáhněte všickni národové okolní, a shlukněte se; způsobiž to, ať tam sstoupí, ó Hospodine, rekové tvoji.
12 ౧౨ రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
Probudíť se a přitáhnou národové ti do údolé Jozafat; nebo tam se posadím, abych soudil všecky ty národy okolní.
13 ౧౩ పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి. వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.
Přičiňte srp, nebo uzralo obilé; poďte, sstupte, nebo plný jest pres, oplývají kádě; mnohá zajisté jest zlost jejich.
14 ౧౪ తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు.
Ale více hromad, hromad v údolí posekání; nebo blízký jest den Hospodinův, v údolí posekání.
15 ౧౫ సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.
Slunce a měsíc zatmí se, a hvězdy potratí blesk svůj.
16 ౧౬ యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.
A Hospodin řváti bude z Siona, a z Jeruzaléma vydá hlas svůj, tak že se třásti budou nebesa i země; nebo Hospodin jest útočiště lidu svého, a síla synů Izraelských.
17 ౧౭ మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
I zvíte, že já Hospodin jsem Bohem vaším, kterýž bydlím na Sionu, hoře svatosti své, a tak Jeruzalém bude svatý, a cizí nepůjdou přes něj více.
18 ౧౮ ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, షిత్తీము లోయను తడుపుతుంది.
I stane se v ten čas, že hory dštíti budou mstem, a pahrbkové oplývati mlékem, a všickni potokové Judští budou plní vody, a studnice z domu Hospodinova vyjde, kteráž zapojí údolé Setim.
19 ౧౯ కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.
Egypt na zpuštění přijde, a země Idumejská hrozně zpuštěna bude pro násilí synům Judským činěné; nebo vylévali krev nevinnou v zemi jejich.
20 ౨౦ యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది.
Juda pak na věky trvati bude, a Jeruzalém od národu do pronárodu.
21 ౨౧ వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.
A očistím ty, jejichž jsem krve neočistil; nebo Hospodin přebývá na Sionu.