< యోవేలు 2 >
1 ౧ సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.
Zatrobite na šofar na Sionu in razglasite alarm na moji sveti gori. Naj vsi prebivalci dežele trepetajo, kajti dan Gospodov prihaja, kajti ta je blizu, pri roki;
2 ౨ అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.
dan teme in mračnosti, dan oblakov in goste teme se kot jutro razširjajo nad gorami. Veliko ljudstvo in močno, nikoli ni bilo podobnega niti ga ne bo več za tem, celó do let mnogih rodov.
3 ౩ దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. వాటి వెనుక, మంట మండుతూ ఉంది. అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.
Ogenj požira pred njimi in za njimi gori plamen. Dežela je pred njimi kakor edenski vrt in za njimi zapuščena divjina; da, in nič jim ne bo pobegnilo.
4 ౪ సేన రూపం, గుర్రాల లాగా ఉంది. వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు.
Njihov videz je kakor videz konjev in kakor konjeniki, tako bodo tekli.
5 ౫ వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
Poskakovali bodo kakor hrup bojnih vozov na vrhovih gora, kakor hrup ognjenega plamena, ki požira strnišče, kakor močno ljudstvo, postavljeno v bojno razvrstitev.
6 ౬ వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
Pred njihovim obrazom bo ljudstvo močno zaskrbljeno. Vsi obrazi bodo zbirali črnino.
7 ౭ అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి.
Tekli bodo kakor mogočni možje, obzidje bodo preplezali kakor bojevniki in korakali bodo vsak po svojih poteh in svojih vrst ne bodo pretrgali.
8 ౮ ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.
Niti eden ne bo sunil drugega. Hodili bodo vsak po svoji stezi in ko padejo na meč, ne bodo ranjeni.
9 ౯ పట్టణంలో చొరబడుతున్నాయి. గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.
Tekali bodo sem ter tja po mestu, tekli bodo na obzidje, splezali bodo na hiše, vstopili bodo pri oknih kakor tat.
10 ౧౦ వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.
Zemlja se bo tresla pred njimi, nebo bo trepetalo, sonce in luna bosta otemnela in zvezde bodo umaknile svoje svetlikanje.
11 ౧౧ యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు?
Gospod bo izustil svoj glas pred svojo vojsko, kajti njegov tabor je zelo velik, kajti on je močan, ki izvršuje svojo besedo, kajti dan Gospodov je velik in zelo strašen in kdo ga lahko prenese?
12 ౧౨ యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”
»Zato se tudi sedaj, « govori Gospod, »obrnite celó k meni z vsem svojim srcem in s postom in z jokom in z žalovanjem
13 ౧౩ మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
in pretrgajte svoje srce, ne pa svojih oblačil in obrnite se h Gospodu, svojemu Bogu, kajti on je milostljiv in usmiljen, počasen za jezo in velike prijaznosti in se kesa zla.«
14 ౧౪ ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?
Kdo ve, če se bo vrnil in pokesal in pustil blagoslov za seboj, celó jedilno daritev in pitno daritev Gospodu, svojemu Bogu?
15 ౧౫ సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.
Zatrobite na šofar na Sionu, posvetite post, skličite slovesen zbor,
16 ౧౬ ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
zberite ljudstvo, posvetite skupnost, zberite starešine, naberite otroke in tiste, ki sesajo pri prsih. Naj pride ženin iz svoje sobe in nevesta iz svoje sobice.
17 ౧౭ యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
Naj duhovniki, Gospodovi služabniki, jokajo med preddverjem in oltarjem in naj govorijo: »Prizanesi svojemu ljudstvu, oh Gospod in svoje dediščine ne izroči v zasmeh, da bi nad njimi vladali pogani. Zakaj bi med ljudstvom rekli: ›Kje je njihov Bog?‹«
18 ౧౮ అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.
Potem bo Gospod ljubosumen nad svojo deželo in se usmilil svojega ljudstva.
19 ౧౯ యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. మీరు వాటితో తృప్తి చెందుతారు. ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను.
Da, Gospod bo odgovoril in rekel svojemu ljudstvu: »Glejte, poslal vam bom žito, vino in olje in nasičeni boste s tem in ne bom vas več naredil v zasmeh med pogani,
20 ౨౦ ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.”
toda daleč od vas bom odstranil severno vojsko in pregnal jih bom v jalovo in zapuščeno deželo, s svojim obrazom proti vzhodnemu morju in s svojim zadnjim delom proti skrajnemu morju in njegov smrad se bo vzdignil in njegovo zaudarjanje se bo vzdignilo, ker je storil velike stvari.«
21 ౨౧ దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. యెహోవా గొప్ప పనులు చేశాడు.
Ne boj se, oh dežela, bodi vesela in se raduj, kajti Gospod bo storil velike stvari.
22 ౨౨ పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
Ne bodite prestrašene, ve poljske živali, kajti pašniki divjine poganjajo, kajti drevo rodi svoj sad, figovo drevo in trta predajata svojo moč.
23 ౨౩ సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
Bodite torej veseli, vi sionski otroci in veselite se v Gospodu, svojem Bogu, kajti dal vam je zmerno prvi dež in povzročil bo, da vam bo prišel dež, prvi dež in pozni dež v prvem mesecu.
24 ౨౪ కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.
Tla bodo polna pšenice in kadi bodo prekipevale od vina in olja.
25 ౨౫ “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.
»Povrnil vam bom leta, ki jih je požrla leteča kobilica, škodljiva gosenica, gosenica in kosmata gosenica, moja velika vojska, ki sem jo poslal med vas.
26 ౨౬ మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
Jedli boste v obilju in boste nasičeni in slavili ime Gospoda, svojega Boga, ki je z vami čudovito ravnal in moje ljudstvo nikoli ne bo osramočeno.
27 ౨౭ అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, నేనే మీ యెహోవా దేవుడిననీ, నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
Vedeli boste, da sem jaz v Izraelovi sredi in da sem jaz Gospod, vaš Bog in nihče drug, in moje ljudstvo nikoli ne bo osramočeno.
28 ౨౮ తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
Potem se bo zgodilo, da bom svojega duha izlil na vse meso. Vaši sinovi in vaše hčere bodo prerokovali, vaši starci bodo sanjali sanje, vaši mladeniči bodo videli videnja.
29 ౨౯ ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
Tudi na služabnike in na pomočnice bom v tistih dneh izlil svojega Duha.
30 ౩౦ ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
Pokazal bom čudeže na nebu in na zemlji, kri in ogenj in stebre dima.
31 ౩౧ యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
Sonce se bo spremenilo v temo in luna v kri pred velikim in strašnim dnevom Gospodovega prihoda.«
32 ౩౨ యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”
In zgodilo se bo, da kdorkoli bo klical h Gospodovemu imenu, bo osvobojen, kajti osvoboditev bo na gori Sion in v Jeruzalemu, kakor je rekel Gospod in v ostanku, ki ga bo Gospod poklical.