< యోవేలు 2 >

1 సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.
Trubite u trubu na Sionu, i vièite na svetoj gori mojoj, neka drkæu svi stanovnici zemaljski, jer ide dan Gospodnji, jer je blizu,
2 అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.
Dan, kada je mrak i tama, dan, kada je oblak i magla; kako se zora razastire povrh gora, tako ide narod velik i silan, kakoga nije bilo otkad je vijeka niti æe ga poslije kad biti od koljena do koljena.
3 దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. వాటి వెనుక, మంట మండుతూ ఉంది. అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.
Pred njim proždire oganj, a za njim pali plamen; zemlja je pred njim kao vrt Edemski, a za njim pustinja pusta, ništa neæe uteæi od njega.
4 సేన రూపం, గుర్రాల లాగా ఉంది. వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు.
Na oèima su kao konji i trèaæe kao konjici.
5 వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
Skakaæe povrh gora topoæuæi kao kola, praskajuæi kao plamen ognjeni koji sažiže strnjiku, kao silan narod spreman za boj.
6 వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
Pred njim æe se prepadati narodi, svako æe lice pocrnjeti.
7 అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి.
Oni æe trèati kao junaci, kao vojnici skakaæe na zid, i svaki æe iæi svojim putem, niti æe otstupati sa svoje staze.
8 ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.
I jedan drugoga neæe tiskati, svaki æe iæi svojim putem, i na maèeve naviruæi neæe se raniti.
9 పట్టణంలో చొరబడుతున్నాయి. గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.
Po gradu æe hoditi, po zidovima æe trèati, u kuæe æe se peti, ulaziæe kroz prozore kao lupež.
10 ౧౦ వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.
Pred njima æe se zemlja tresti, nebesa æe se pokolebati, sunce æe i mjesec pomrknuti i zvijezde æe ustegnuti svjetlost svoju.
11 ౧౧ యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు?
A Gospod æe pustiti glas svoj pred vojskom svojom, jer æe oko njegov biti vrlo velik, jer æe biti silan onaj koji æe izvršiti volju njegovu; jer æe dan Gospodnji biti velik i vrlo strašan, i ko æe ga podnijeti?
12 ౧౨ యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”
Zato još govori Gospod: obratite se k meni svijem srcem svojim i posteæi i plaèuæi i tužeæi.
13 ౧౩ మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
I razderite srca svoja a ne haljine svoje, i obratite se ka Gospodu Bogu svojemu, jer je milostiv i žalostiv, spor na gnjev i obilan milosrðem i kaje se oda zla.
14 ౧౪ ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?
Ko zna, neæe li se povratiti i raskajati se, i ostaviti iza toga blagoslov, dar i naljev za Gospoda Boga vašega.
15 ౧౫ సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.
Trubite u trubu na Sionu, naredite post, proglasite svetkovinu.
16 ౧౬ ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
Saberite narod, osveštajte sabor, skupite starce, saberite djecu i koja sisaju; ženik neka izide iz svoje klijeti i nevjesta iz ložnice svoje.
17 ౧౭ యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
Izmeðu trijema i oltara neka plaèu sveštenici, sluge Gospodnje, i neka reku: prosti, Gospode, narodu svojemu, i ne daj našljedstva svojega pod sramotu, da njim obladaju narodi; zašto da reku u narodima: gdje im je Bog?
18 ౧౮ అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.
I Gospod æe revnovati za zemlju svoju i požaliæe narod svoj.
19 ౧౯ యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. మీరు వాటితో తృప్తి చెందుతారు. ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను.
I Gospod æe odgovoriti i reæi æe svome narodu: evo, ja æu vam poslati žita i vina i ulja, i biæete ga siti, i neæu vas više dati pod sramotu meðu narodima.
20 ౨౦ ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.”
Jer æu udaljiti od vas sjeverca, i odagnati ga u zemlju suhu i pustu, prednju èetu njegovu u istoèno more a zadnju u more zapadno, i podignuæe se smrad njegov, i trulež æe se njegov podignuti, pošto uèini velike stvari.
21 ౨౧ దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. యెహోవా గొప్ప పనులు చేశాడు.
Ne boj se, zemljo, raduj se i veseli se, jer æe Gospod uèiniti velike stvari.
22 ౨౨ పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
Ne bojte se, zvijeri poljske; jer æe se zelenjeti pasišta u pustinji i drveta æe nositi rod svoj, smokva æe i loza vinova davati silu svoju.
23 ౨౩ సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
I vi, sinovi Sionski, radujte se i veselite se u Gospodu Bogu svojem, jer æe vam dati dažd na vrijeme, i spustiæe vam dažd rani i pozni na vrijeme.
24 ౨౪ కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.
I gumna æe se napuniti žita, a kace æe se preljevati vinom i uljem.
25 ౨౫ “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.
I naknadiæu vam godine koje izjede skakavac, hrušt i crv i gusjenica, velika vojska moja, koju slah na vas.
26 ౨౬ మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
I ješæete izobila, i biæete siti i hvaliæete ime Gospoda Boga svojega, koji uèini s vama èudesa, i narod moj neæe se posramiti dovijeka.
27 ౨౭ అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, నేనే మీ యెహోవా దేవుడిననీ, నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
I poznaæete da sam ja usred Izrailja, i da sam ja Gospod Bog vaš, i da nema drugoga, i narod moj neæe se posramiti dovijeka.
28 ౨౮ తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
I poslije æu izliti duh svoj na svako tijelo, i proricaæe sinovi vaši i kæeri vaše, starci æe vaši sanjati sne, mladiæi æe vaši viðati utvare.
29 ౨౯ ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
I na sluge æu i na sluškinje u one dane izliti duh svoj;
30 ౩౦ ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
I uèiniæu èudesa na nebu i na zemlji, krv i oganj i pušenje dima.
31 ౩౧ యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
Sunce æe se pretvoriti u tamu i mjesec u krv prije nego doðe veliki i strašni dan Gospodnji.
32 ౩౨ యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”
I svaki koji prizove ime Gospodnje spašæe se; jer æe na gori Sionu i u Jerusalimu biti spasenje, kao što je rekao Gospod, i u ostatku koji pozove Gospod.

< యోవేలు 2 >