< యోబు~ గ్రంథము 9 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు.
ὑπολαβὼν δὲ Ιωβ λέγει
2 ౨ నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు?
ἐπ’ ἀληθείας οἶδα ὅτι οὕτως ἐστίν πῶς γὰρ ἔσται δίκαιος βροτὸς παρὰ κυρίῳ
3 ౩ మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు.
ἐὰν γὰρ βούληται κριθῆναι αὐτῷ οὐ μὴ ὑπακούσῃ αὐτῷ ἵνα μὴ ἀντείπῃ πρὸς ἕνα λόγον αὐτοῦ ἐκ χιλίων
4 ౪ ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు.
σοφὸς γάρ ἐστιν διανοίᾳ κραταιός τε καὶ μέγας τίς σκληρὸς γενόμενος ἐναντίον αὐτοῦ ὑπέμεινεν
5 ౫ పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు.
ὁ παλαιῶν ὄρη καὶ οὐκ οἴδασιν ὁ καταστρέφων αὐτὰ ὀργῇ
6 ౬ భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.
ὁ σείων τὴν ὑπ’ οὐρανὸν ἐκ θεμελίων οἱ δὲ στῦλοι αὐτῆς σαλεύονται
7 ౭ ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు.
ὁ λέγων τῷ ἡλίῳ καὶ οὐκ ἀνατέλλει κατὰ δὲ ἄστρων κατασφραγίζει
8 ౮ ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.
ὁ τανύσας τὸν οὐρανὸν μόνος καὶ περιπατῶν ὡς ἐπ’ ἐδάφους ἐπὶ θαλάσσης
9 ౯ స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.
ὁ ποιῶν Πλειάδα καὶ ἕσπερον καὶ ἀρκτοῦρον καὶ ταμίεια νότου
10 ౧౦ ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.
ὁ ποιῶν μεγάλα καὶ ἀνεξιχνίαστα ἔνδοξά τε καὶ ἐξαίσια ὧν οὐκ ἔστιν ἀριθμός
11 ౧౧ ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు.
ἐὰν ὑπερβῇ με οὐ μὴ ἴδω καὶ ἐὰν παρέλθῃ με οὐδ’ ὧς ἔγνων
12 ౧౨ ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు?
ἐὰν ἀπαλλάξῃ τίς ἀποστρέψει ἢ τίς ἐρεῖ αὐτῷ τί ἐποίησας
13 ౧౩ దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు.
αὐτὸς γὰρ ἀπέστραπται ὀργήν ὑπ’ αὐτοῦ ἐκάμφθησαν κήτη τὰ ὑπ’ οὐρανόν
14 ౧౪ కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?
ἐὰν δέ μου ὑπακούσηται ἦ διακρινεῖ τὰ ῥήματά μου
15 ౧౫ నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను.
ἐάν τε γὰρ ὦ δίκαιος οὐκ εἰσακούσεταί μου τοῦ κρίματος αὐτοῦ δεηθήσομαι
16 ౧౬ నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు.
ἐάν τε καλέσω καὶ ὑπακούσῃ οὐ πιστεύω ὅτι εἰσακήκοέν μου
17 ౧౭ ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు.
μὴ γνόφῳ με ἐκτρίψῃ πολλὰ δέ μου τὰ συντρίμματα πεποίηκεν διὰ κενῆς
18 ౧౮ ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.
οὐκ ἐᾷ γάρ με ἀναπνεῦσαι ἐνέπλησεν δέ με πικρίας
19 ౧౯ బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు.
ὅτι μὲν γὰρ ἰσχύι κρατεῖ τίς οὖν κρίματι αὐτοῦ ἀντιστήσεται
20 ౨౦ నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.
ἐὰν γὰρ ὦ δίκαιος τὸ στόμα μου ἀσεβήσει ἐάν τε ὦ ἄμεμπτος σκολιὸς ἀποβήσομαι
21 ౨౧ నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు.
εἴτε γὰρ ἠσέβησα οὐκ οἶδα τῇ ψυχῇ πλὴν ὅτι ἀφαιρεῖταί μου ἡ ζωή
22 ౨౨ తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు.
διὸ εἶπον μέγαν καὶ δυνάστην ἀπολλύει ὀργή
23 ౨౩ ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు.
ὅτι φαῦλοι ἐν θανάτῳ ἐξαισίῳ ἀλλὰ δίκαιοι καταγελῶνται
24 ౨౪ భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయన గాక ఇంకెవరు?
παραδέδονται γὰρ εἰς χεῖρας ἀσεβοῦς πρόσωπα κριτῶν αὐτῆς συγκαλύπτει εἰ δὲ μὴ αὐτός τίς ἐστιν
25 ౨౫ పరుగు తీసే వాడి కంటే వేగంగా, ఎలాంటి మంచీ లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి.
ὁ δὲ βίος μού ἐστιν ἐλαφρότερος δρομέως ἀπέδρασαν καὶ οὐκ εἴδοσαν
26 ౨౬ రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.
ἦ καὶ ἔστιν ναυσὶν ἴχνος ὁδοῦ ἢ ἀετοῦ πετομένου ζητοῦντος βοράν
27 ౨౭ నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకున్నానా?
ἐάν τε γὰρ εἴπω ἐπιλήσομαι λαλῶν συγκύψας τῷ προσώπῳ στενάξω
28 ౨౮ నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది.
σείομαι πᾶσιν τοῖς μέλεσιν οἶδα γὰρ ὅτι οὐκ ἀθῷόν με ἐάσεις
29 ౨౯ నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?
ἐπειδὴ δέ εἰμι ἀσεβής διὰ τί οὐκ ἀπέθανον
30 ౩౦ నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,
ἐὰν γὰρ ἀπολούσωμαι χιόνι καὶ ἀποκαθάρωμαι χερσὶν καθαραῖς
31 ౩౧ నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
ἱκανῶς ἐν ῥύπῳ με ἔβαψας ἐβδελύξατο δέ με ἡ στολή
32 ౩౨ ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలసి న్యాయస్థానానికి వెళ్ళడం ఎలా?
οὐ γὰρ εἶ ἄνθρωπος κατ’ ἐμέ ᾧ ἀντικρινοῦμαι ἵνα ἔλθωμεν ὁμοθυμαδὸν εἰς κρίσιν
33 ౩౩ మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.
εἴθε ἦν ὁ μεσίτης ἡμῶν καὶ ἐλέγχων καὶ διακούων ἀνὰ μέσον ἀμφοτέρων
34 ౩౪ ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి.
ἀπαλλαξάτω ἀπ’ ἐμοῦ τὴν ῥάβδον ὁ δὲ φόβος αὐτοῦ μή με στροβείτω
35 ౩౫ అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను, అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను.
καὶ οὐ μὴ φοβηθῶ ἀλλὰ λαλήσω οὐ γὰρ οὕτω συνεπίσταμαι