< యోబు~ గ్రంథము 8 >

1 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు.
ויען בלדד השוחי ויאמר
2 నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి.
עד-אן תמלל-אלה ורוח כביר אמרי-פיך
3 దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా?
האל יעות משפט ואם-שדי יעות-צדק
4 ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో.
אם-בניך חטאו-לו וישלחם ביד-פשעם
5 నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.
אם-אתה תשחר אל-אל ואל-שדי תתחנן
6 నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.
אם-זך וישר אתה כי-עתה יעיר עליך ושלם נות צדקך
7 నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
והיה ראשיתך מצער ואחריתך ישגה מאד
8 మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి.
כי-שאל-נא לדר רישון וכונן לחקר אבותם
9 గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో.
כי-תמול אנחנו ולא נדע כי צל ימינו עלי-ארץ
10 ౧౦ వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా.
הלא-הם יורוך יאמרו לך ומלבם יוצאו מלים
11 ౧౧ బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా?
היגאה-גמא בלא בצה ישגה-אחו בלי-מים
12 ౧౨ దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది.
עדנו באבו לא יקטף ולפני כל-חציר ייבש
13 ౧౩ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.
כן--ארחות כל-שכחי אל ותקות חנף תאבד
14 ౧౪ ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది.
אשר-יקוט כסלו ובית עכביש מבטחו
15 ౧౫ అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
ישען על-ביתו ולא יעמד יחזיק בו ולא יקום
16 ౧౬ భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి.
רטב הוא לפני-שמש ועל גנתו ינקתו תצא
17 ౧౭ అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
על-גל שרשיו יסבכו בית אבנים יחזה
18 ౧౮ అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.
אם-יבלענו ממקמו וכחש בו לא ראיתיך
19 ౧౯ అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
הן-הוא משוש דרכו ומעפר אחר יצמחו
20 ౨౦ ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
הן-אל לא ימאס-תם ולא-יחזיק ביד-מרעים
21 ౨౧ ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు.
עד-ימלה שחוק פיך ושפתיך תרועה
22 ౨౨ నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.
שנאיך ילבשו-בשת ואהל רשעים איננו

< యోబు~ గ్రంథము 8 >