< యోబు~ గ్రంథము 8 >
1 ౧ అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు.
Pamenepo Bilidadi wa ku Suki anayankha kuti,
2 ౨ నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి.
“Kodi udzakhala ukuyankhula zoterezi mpaka liti? Mawu ako ali ngati mphepo yamkuntho.
3 ౩ దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా?
Kodi Mulungu amapotoza chiweruzo cholungama? Kodi Wamphamvuzonse amalephera kuchita zachilungamo?
4 ౪ ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో.
Pamene ana ako anamuchimwira Mulungu, Iye anawapereka kuti alangidwe chifukwa cha tchimo lawo.
5 ౫ నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.
Koma utayangʼana kwa Mulungu, ndi kudandaulira Wamphamvuzonse,
6 ౬ నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.
ngati uli wangwiro ndi wolungama mtima ngakhale tsopano Iye adzachitapo kanthu mʼmalo mwako ndipo adzakubwezeretsa pa malo ako oyenera.
7 ౭ నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
Chiyambi chako chidzaoneka ngati chochepa koma chimaliziro chako chidzakhala chopambana.
8 ౮ మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి.
“Funsa kwa anthu amvulazakale ndipo upeze zimene makolo awo anaziphunzira
9 ౯ గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో.
pakuti ife ndife ana adzulodzuloli ndipo sitidziwa chilichonse, ndipo moyo wathu pa dziko lapansi uli ngati chithunzithunzi.
10 ౧౦ వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా.
Kodi iwo sadzakulangiza ndi kukufotokozera? Kodi sadzakuwuza mawu ochokera pa zimene amazidziwa?
11 ౧౧ బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా?
Kodi bango nʼkumera pa nthaka yopanda chinyontho? Nanga mawango nʼkukula bwino popanda madzi?
12 ౧౨ దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది.
Popanda madzi, zimenezi zimafota zikanali zaziwisi ndi zosadula; zimawuma msangamsanga kuposa bango.
13 ౧౩ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.
Ndimo mmene amachitira anthu onse amene amayiwala Mulungu; ndi mmene chiyembekezo cha munthu wosapembedza Mulungu chimathera.
14 ౧౪ ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది.
Kulimba mtima kwake kumafowoka; zimene iye amadalira zili ngati ukonde wa kangawude.
15 ౧౫ అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
Iye amatsamira ukonde wake, koma umaduka; amawugwiritsitsa koma sulimba.
16 ౧౬ భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి.
Munthu woyipayo ali ngati chomera chothiriridwa bwino chimene chili pa dzuwa, nthambi zake zimatambalala pa munda wake;
17 ౧౭ అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
mizu yake imayanga pa mulu wa miyala ndi kufunafuna malo woti izikike pa miyalapo.
18 ౧౮ అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.
Koma pamene yachotsedwa pamalo pakepo, pamalopo pamakana chomeracho ndi kuti, ‘Ine sindinakuonepo.’
19 ౧౯ అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
Ndithudi chomeracho chimafota, ndipo pa nthakapo pamatuluka zomera zina.
20 ౨౦ ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
“Ndithudi, Mulungu sakana munthu amene alibe cholakwa kapena kulimbikitsa anthu ochita zoyipa.
21 ౨౧ ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు.
Iye adzadzaza mʼkamwa mwako ndi phwete ndipo milomo yako idzafuwula ndi chimwemwe.
22 ౨౨ నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.
Adani ako adzachita manyazi, ndipo malo okhalamo anthu oyipa sadzaonekanso.”