< యోబు~ గ్రంథము 6 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
I odpowiedział Ijob, a rzekł:
2 ౨ ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక.
O gdyby pilnie zważono narzekanie moje, a biedę moję pospołu na wagę włożono,
3 ౩ అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్ధమైన మాటలు పలికాను.
Tedyby była cięższą nad piasek morski; przetoż mi słów niestaje.
4 ౪ సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి.
Albowiem strzały Wszechmocnego tkwią we mnie, których jad wysuszył ducha mego, a strachy Boże walczą przeciwko mnie.
5 ౫ అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా?
Izali osieł dziki ryczy nad trawą? albo wół izali ryczy nad paszą swoją?
6 ౬ ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా?
Izali może być jedzona rzecz niesmaczna bez soli? albo jestli jaki smak w białku jajowym?
7 ౭ అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది.
Czego się przedtem nie chciała dotknąć dusza moja, to teraz jest boleścią ciała mego.
8 ౮ నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది!
Bodajże się spełniła prośba moja! Niechże mi Bóg da, czego oczekuję!
9 ౯ దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక. తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక.
Oby się Bogu podobało, żeby mię zniszczył, a żeby mię wyciął, rozpuściwszy rękę swoję!
10 ౧౦ ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది.
Bo mam jeszcze pociechę swoję, (chociaż pałam w boleści, a Bóg mi nie folguje) żem nie taił słów Świętego.
11 ౧౧ నాకున్న బలం ఎంత? నేను దేని కోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి?
Cóż jest za moc moja, abym potrwał? albo co za koniec mój, abym przedłużył żywota mego?
12 ౧౨ నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా?
Izali moc kamienna moc moja? albo ciało moje miedziane?
13 ౧౩ నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా.
Azaż obrony mojej niemasz przy mnie? azaż rozsądek oddalony odemnie?
14 ౧౪ కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు.
Przeciwko temu, którego litość słabieje ku bliźniemu swemu, i który bojaźń Wszechmogącego opuścił?
15 ౧౫ నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు.
Bracia moi omylili mię jako potok; pominęli jako gwałtowne potoki,
16 ౧౬ అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి.
Które bywają mętne od lodu, w których się śnieg ukrywa;
17 ౧౭ వేసవికాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్నచోట్ల నుండి ఆవిరైపోతాయి.
Czasu którego topnieją, zaginą; a czasu gorącości niszczeją z miejsca swego.
18 ౧౮ వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి.
Udawają się tam i sam z dróg swoich; rozciekają się po miejscach bezwodnych, i giną.
19 ౧౯ తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు.
Podróżni ludzie z krainy Teman obaczyli je; a którzy szli do Seba, mieli w nich nadzieję.
20 ౨౦ వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురౌతారు.
Ale się zawstydzili, iż w nich ufali; a gdy tam przyszli, oszukali się.
21 ౨౧ మీరు ఆ ప్రవాహం వలే ఉండీ లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు.
Tak zaiste i wy, bywszy nie jesteście; widząc utrapienie moje, lękacie się.
22 ౨౨ నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా?
Izalim mówił: Przynieście mi co, a z majętności waszej dajcie mi dary?
23 ౨౩ శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా?
I wybawcie mię z rąk nieprzyjaciela, a z rąk okrutników odkupcie mię?
24 ౨౪ నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి.
Nauczcież mię, a ja umilknę; a w czemem zbłądził pokażcie mi.
25 ౨౫ యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి?
O jakoż są mocne słowa prawdziwe! Ale cóż sprawi obwinienie wasze?
26 ౨౬ నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా.
Izali słowa moje obwinić myślicie, a przewiewać mowy utrapionego?
27 ౨౭ మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది.
I na sierotę targacie się, i kopiecie doły pod przyjacielem swoim.
28 ౨౮ దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా?
Przetoż przypatrzcie mi się teraz, a obaczycie, jeźli kłamię przed obliczem waszem.
29 ౨౯ ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, ఈ విషయాల్లో నేను నిర్దోషిని.
Obaczcie się, proszę, a niech nie będzie w was nieprawość; obaczcie się, a poznacie, że jest sprawiedliwość moja przy mnie.
30 ౩౦ నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా?
A iż nie masz w języku mym nieprawości: i nie mamże znać utrapienia mego?