< యోబు~ గ్రంథము 5 >
1 ౧ నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
Call out now; is there anyone who will answer you? To which of the holy ones will you turn?
2 ౨ తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
For anger kills the foolish man; jealousy kills the silly one.
3 ౩ మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
I have seen a foolish person taking root, but suddenly I cursed his home.
4 ౪ అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
His children are far from safety; they are crushed in the city gate. There is no one to rescue them.
5 ౫ ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
The hungry eat up their harvest; they even take it from among the thorns. The thirsty pant for their wealth.
6 ౬ దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
For difficulties do not come out from the soil; neither does trouble sprout from the ground.
7 ౭ నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
Instead, mankind is born for trouble, just as sparks fly upward.
8 ౮ అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
But as for me, I would turn to God himself; to him I would commit my cause—
9 ౯ ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
he who does great and unsearchable things, marvelous things without number.
10 ౧౦ ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
He gives rain on the earth, and sends water on the fields.
11 ౧౧ ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
He does this in order to set up on high those who are low; to raise to safety those who mourn.
12 ౧౨ వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
He breaks the plans of the crafty people, so that their hands cannot achieve success.
13 ౧౩ దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
He traps wise people in their own crafty actions; the plans of twisted people are hurried to their end.
14 ౧౪ వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
They encounter darkness in the daytime, and grope at noonday as if it were night.
15 ౧౫ బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
But he saves the poor person from the sword in their mouths and the needy person from the hand of mighty people.
16 ౧౬ కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
So the poor person has hope, and injustice shuts her own mouth.
17 ౧౭ దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
See, blessed is the man whom God corrects; therefore, do not despise the chastening of the Almighty.
18 ౧౮ ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
For he wounds and then binds up; he wounds and then his hands heal.
19 ౧౯ ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
He will rescue you out of six troubles; indeed, in seven troubles, no evil will touch you.
20 ౨౦ కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
In famine he will ransom you from death, and in war from the hands of the sword.
21 ౨౧ దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
You will be hidden from the scourge of the tongue; and you will not be afraid of destruction when it comes.
22 ౨౨ కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
You will laugh at destruction and famine, and you will not be afraid of beasts of the earth.
23 ౨౩ నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
For you will have a covenant with the stones in your field, and the beasts of the field will be at peace with you.
24 ౨౪ నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
You will know that your tent is in safety; you will visit your sheepfold and you will not miss anything.
25 ౨౫ నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
You will also know that your seed will be great, that your offspring will be like the grass on the ground.
26 ౨౬ ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
You will come to your grave at a full age, like a stack of grain bundles that goes up at its time.
27 ౨౭ ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.
See, we have examined this matter; it is like this; listen to it, and know it for yourself.”