< యోబు~ గ్రంథము 41 >
1 ౧ నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా?
你能用魚鉤釣上鱷魚嗎? 能用繩子壓下牠的舌頭嗎?
2 ౨ నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా?
你能用繩索穿牠的鼻子嗎? 能用鉤穿牠的腮骨嗎?
3 ౩ అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా?
牠豈向你連連懇求, 說柔和的話嗎?
4 ౪ నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా?
豈肯與你立約, 使你拿牠永遠作奴僕嗎?
5 ౫ నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా?
你豈可拿牠當雀鳥玩耍嗎? 豈可為你的幼女將牠拴住嗎?
6 ౬ బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా?
搭夥的漁夫豈可拿牠當貨物嗎? 能把牠分給商人嗎?
7 ౭ దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా?
你能用倒鉤槍扎滿牠的皮, 能用魚叉叉滿牠的頭嗎?
8 ౮ దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు.
你按手在牠身上,想與牠爭戰, 就不再這樣行吧!
9 ౯ దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి.
人指望捉拿牠是徒然的; 一見牠,豈不喪膽嗎?
10 ౧౦ సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు?
沒有那麼兇猛的人敢惹牠。 這樣,誰能在我面前站立得住呢?
11 ౧౧ నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా.
誰先給我甚麼,使我償還呢? 天下萬物都是我的。
12 ౧౨ సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను.
論到鱷魚的肢體和其大力,並美好的骨骼, 我不能緘默不言。
13 ౧౩ ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా?
誰能剝牠的外衣? 誰能進牠上下牙骨之間呢?
14 ౧౪ దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు?
誰能開牠的腮頰? 牠牙齒四圍是可畏的。
15 ౧౫ దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి.
牠以堅固的鱗甲為可誇, 緊緊合閉,封得嚴密。
16 ౧౬ అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు.
這鱗甲一一相連, 甚至氣不得透入其間,
17 ౧౭ అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు.
都是互相聯絡、膠結, 不能分離。
18 ౧౮ అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి.
牠打噴嚏就發出光來; 牠眼睛好像早晨的光線。
19 ౧౯ దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి.
從牠口中發出燒着的火把, 與飛迸的火星;
20 ౨౦ పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది.
從牠鼻孔冒出煙來, 如燒開的鍋和點着的蘆葦。
21 ౨౧ దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి.
牠的氣點着煤炭, 有火焰從牠口中發出。
22 ౨౨ దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది.
牠頸項中存着勁力; 在牠面前的都恐嚇蹦跳。
23 ౨౩ దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు.
牠的肉塊互相聯絡, 緊貼其身,不能搖動。
24 ౨౪ దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం.
牠的心結實如石頭, 如下磨石那樣結實。
25 ౨౫ అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు.
牠一起來,勇士都驚恐, 心裏慌亂,便都昏迷。
26 ౨౬ కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు.
人若用刀,用槍,用標槍, 用尖槍扎牠,都是無用。
27 ౨౭ అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది.
牠以鐵為乾草, 以銅為爛木。
28 ౨౮ బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి.
箭不能恐嚇牠使牠逃避; 彈石在牠看為碎稭。
29 ౨౯ గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది.
棍棒算為禾稭; 牠嗤笑短槍颼的響聲。
30 ౩౦ దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది.
牠肚腹下如尖瓦片; 牠如釘耙經過淤泥。
31 ౩౧ కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది.
牠使深淵開滾如鍋, 使洋海如鍋中的膏油。
32 ౩౨ అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు.
牠行的路隨後發光, 令人想深淵如同白髮。
33 ౩౩ అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు.
在地上沒有像牠造的那樣, 無所懼怕。
34 ౩౪ అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.
凡高大的,牠無不藐視; 牠在驕傲的水族上作王。