< యోబు~ గ్రంథము 40 >
1 ౧ యెహోవా యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
És felelt az Örökkévaló Jóbnak és mondta:
2 ౨ ఆక్షేపణలు చేయాలని చూసేవాడు సర్వశక్తుడైన దేవుణ్ణి సరిదిద్దాలని చూడవచ్చా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు జవాబియ్యాలి.
Pörölni mer-e a Mindenhatóval a gáncsoló? Istennek a feddője feleljen rá!
3 ౩ అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.
S felelt Jób az Örökkévalónak és mondta:
4 ౪ చూడు, నేను నీచుణ్ణి. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను.
Lám, csekély vagyok, mit válaszoljak neked? Szájamra tettem kezemet;
5 ౫ ఒక సారి మాట్లాడాను. నేను మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను. ఇకపై పలకను.
egyet szóltam – nem felelhetek, kettőt, de nem teszem többé.
6 ౬ అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
S felelt az Örökkévaló Jóbnak a viharból és mondta:
7 ౭ పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకో. నేను నీకు ప్రశ్నవేస్తాను. జవాబియ్యి.
Övezd csak fel férfiként ágyékidat, hadd kérdelek s te tudasd velem.
8 ౮ నేను అన్యాయం చేసానని అంటావా? నిర్దోషివని నువ్వు తీర్పు పొందడం కోసం నా మీద అపరాధం మోపుతావా?
Vajon ítéletemet bontod-e meg, kárhoztatsz engem, hogy neked legyen igazad?
9 ౯ దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?
Hát van-e karod olyan mint Istené, és olyan hanggal. dörögsz-e mint ő?
10 ౧౦ ఆడంబర మహాత్మ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. గౌరవప్రభావాలు ధరించుకో.
Ékesítsd csak magadat büszkeséggel és fenséggel, dicsőséget és díszt ölts fel!
11 ౧౧ నీ ఆగ్రహాన్ని నలుదెసలా విసిరి వెయ్యి. గర్విష్టులందరినీ చూసి వారిని కూలగొట్టు.
Szórd szét haragod kitöréseit, s láss minden büszkét és alacsonyítsd le;
12 ౧౨ గర్విష్టులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచి వెయ్యి.
láss minden büszkét és alázd meg és zúzd össze a gonoszokat a maguk helyén;
13 ౧౩ కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టు. సమాధిలో వారిని బంధించు.
rejtsd el őket a porba egyaránt, kötözd le arczukat a rejtekbe:
14 ౧౪ అప్పుడు నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకుంటాను.
akkor én is magasztallak téged, hogy tenjobbod segít neked.
15 ౧౫ నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది.
Íme csak a víziló, melyet alkottam, mint tégedet: füvet eszik mint a marha.
16 ౧౬ చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది.
Íme csak, derekában van az ereje, és hatalma hasának izmaiban.
17 ౧౭ దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడ కండరాలు దృఢంగా అతికి ఉన్నాయి.
Mereszti farkát, akár a czédrus, czombjainak inai összefonódnak.
18 ౧౮ దాని ఎముకలు ఇత్తడి గొట్టాల్లాగా ఉన్నాయి. దాని కాళ్ళు ఇనప కడ్డీల్లాగా ఉన్నాయి.
Csontjai érczcsatornák, tagjai akár a vasdorong.
19 ౧౯ అది దేవుడు సృష్టించిన వాటిలో ముఖ్యమైనది. దాన్ని చేసిన దేవుడే దాన్ని ఓడించ గలడు.
Ő Isten útjainak eleje, a ki alkotta, oda nyújtotta kardját
20 ౨౦ పర్వతాలు దానికి మేత మొలిపిస్తాయి. అడవి మృగాలన్నీ అక్కడ ఆడుకుంటాయి.
Mert takarmányt a hegyek teremnek neki, s a mező minden vadja játszadozik ott.
21 ౨౧ తామర చెట్ల కింద జమ్ముగడ్డి చాటున పర్రలో అది పండుకుంటుంది.
Lótuscserjék alatt fekszik, nádnak és mocsárnak rejtekében.
22 ౨౨ తామర తూడులు దానికి నీడనిస్తాయి. సెలయేరు ఒడ్డున ఉన్న నిరవంజి చెట్లు దాని చుట్టూ ఉంటాయి.
Befödik őt árnyékául lótus-cserjék, a patak fűzei körülveszik őt.
23 ౨౩ నదీప్రవాహం పొంగి పొర్లినా అది భయపడదు. యొర్దాను లాంటి ప్రవాహం పొంగి దాని ముట్టె దాకా వచ్చినా అది బెదరదు.
Ha folyam szorongatja, nem ijed meg, bizakodik, midőn egy Jordán tör szájába.
24 ౨౪ ఎవరైనా దాన్ని కొక్కీ వేసి పట్టుకోగలరా? ముక్కుకు పగ్గం వేయగలరా?
Szemei láttára megfoghatni-e őt, tőrökkel átlyukasztva az orrát?