< యోబు~ గ్రంథము 4 >
1 ౧ అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.
提幔人以利法回答說:
2 ౨ ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు?
人若想與你說話,你就厭煩嗎? 但誰能忍住不說呢?
3 ౩ నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు.
你素來教導許多的人, 又堅固軟弱的手。
4 ౪ దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు.
你的言語曾扶助那將要跌倒的人; 你又使軟弱的膝穩固。
5 ౫ అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు.
但現在禍患臨到你,你就昏迷, 挨近你,你便驚惶。
6 ౬ నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?
你的倚靠不是在你敬畏上帝嗎? 你的盼望不是在你行事純正嗎?
7 ౭ జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా?
請你追想:無辜的人有誰滅亡? 正直的人在何處剪除?
8 ౮ నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు.
按我所見,耕罪孽、種毒害的人 都照樣收割。
9 ౯ దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు.
上帝一出氣,他們就滅亡; 上帝一發怒,他們就消沒。
10 ౧౦ సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి.
獅子的吼叫和猛獅的聲音盡都止息; 少壯獅子的牙齒也都敲掉。
11 ౧౧ తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి.
老獅子因絕食而死; 母獅之子也都離散。
12 ౧౨ నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది.
我暗暗地得了默示; 我耳朵也聽其細微的聲音。
13 ౧౩ మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది.
在思念夜中、異象之間, 世人沉睡的時候,
14 ౧౪ నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి.
恐懼、戰兢臨到我身, 使我百骨打戰。
15 ౧౫ ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి.
有靈從我面前經過, 我身上的毫毛直立。
16 ౧౬ ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా?
那靈停住, 我卻不能辨其形狀; 有影像在我眼前。 我在靜默中聽見有聲音說:
17 ౧౭ తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది.
必死的人豈能比上帝公義嗎? 人豈能比造他的主潔淨嗎?
18 ౧౮ తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు.
主不信靠他的臣僕, 並且指他的使者為愚昧;
19 ౧౯ అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!
何況那住在土房、根基在塵土裏、 被蠹蟲所毀壞的人呢?
20 ౨౦ ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు.
早晚之間,就被毀滅, 永歸無有,無人理會。
21 ౨౧ వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.
他帳棚的繩索豈不從中抽出來呢? 他死,且是無智慧而死。