< యోబు~ గ్రంథము 39 >

1 అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
Знаш ли време кад се дивокозе козе? И јеси ли видео кад се кошуте легу?
2 అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా?
Јеси ли избројао месеце, докле носе? Знаш ли време кад се легу?
3 అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి.
Како се савијају, млад своју испуштају, и опраштају се болова?
4 వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
Како јача млад њихова, расте по пољу и отишавши не враћа се к њима?
5 అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు?
Ко је пустио дивљег магарца да је слободан, и ремене дивљем магарцу ко је разрешио?
6 నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను.
Коме одредих пустињу за кућу и за стан слатину.
7 పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు.
Он се смеје вреви градској, и не слуша вике настојникове.
8 పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది.
Шта налази у горама, оно му је пића, и тражи сваку зелен.
9 అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా?
Би ли ти једнорог хтео служити? Би ли ноћивао за јаслама твојим?
10 ౧౦ పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా?
Можеш ли везати ужем једнорога да оре? Хоће ли влачити бразде за тобом?
11 ౧౧ అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా?
Хоћеш ли се ослонити на њ што му је снага велика? И оставити на њему свој посао?
12 ౧౨ అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా?
Хоћеш ли се поуздати у њ да ће ти свести летину и на гумно твоје сложити?
13 ౧౩ నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా?
Јеси ли ти дао пауну лепа крила и перје чапљи или ноју?
14 ౧౪ లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది.
Који снесе на земљи јајца своја, и остави их да их прах греје?
15 ౧౫ దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
И не мисли да ће их нога разбити и звер пољска згазити;
16 ౧౬ తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు.
Немилостив је птићима својим као да нису његови, и да му труд не буде узалуд не боји се.
17 ౧౭ దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు.
Јер му Бог није дао мудрости нити му је уделио разума.
18 ౧౮ అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
Кад се подигне у вис, смеје се коњу и коњику.
19 ౧౯ గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా?
Јеси ли ти дао коњу јачину? Јеси ли ти окитио врат његов рзањем?
20 ౨౦ మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం.
Хоћеш ли га поплашити као скакавца? Фркање ноздрва његових страшно је;
21 ౨౧ అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
Копа земљу, весео је од силе, иде на сусрет оружју;
22 ౨౨ అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు.
Смеје се страху и не плаши се нити узмиче испред мача;
23 ౨౩ దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
Кад звекће над њим тул и сева копље и сулица;
24 ౨౪ పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది.
Од немирноће и љутине копа земљу, и не може да стоји кад труба затруби.
25 ౨౫ బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
Кад труба затруби, он вришти, из далека чује бој, вику војвода и поклич.
26 ౨౬ డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
Еда ли по твом разуму лети јастреб? Шири крила своја на југ?
27 ౨౭ గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?
Еда ли се на твоју заповест диже у вис орао, и на висини вије гнездо?
28 ౨౮ అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
На стени станује и бави се, на врх стене, на тврдом месту.
29 ౨౯ అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
Одатле гледа хране, далеко му виде очи.
30 ౩౦ దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది.
И птићи његови пију крв, и где су мртва телеса онде је он.

< యోబు~ గ్రంథము 39 >