< యోబు~ గ్రంథము 38 >
1 ౧ అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
S felelt az Örökkévaló Jóbnak a viharból és mondta:
2 ౨ జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు?
Ki az, ki elhomályosítja a tanácsot, tudás nélküli szavakkal.
3 ౩ పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి.
Övezd csak föl férfiként ágyékodat, hadd kérdelek, s te tudasd velem.
4 ౪ నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.
Hol voltál, midőn alapítottam a földet, jelentsd ki, ha tudsz értelmet!
5 ౫ నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు?
Ki vonta méreteit, ha tudod, vagy ki nyújtotta ki reá a mérőzsinórt?
6 ౬ దాని పునాదులు దేనిపై ఉన్నాయి?
Mire süllyesztettek le oszloplábai, vagy ki vetette oda sarokkövét?
7 ౭ ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?
Midőn együtt ujjongtak a reggel csillagai s riadoztak mind az Istenfiak;
8 ౮ సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?
s elrekesztette ajtókkal a tengert, midőn előtörve kijött a méhből;
9 ౯ నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా?
midőn felhőt tettem öltözetévé és sűrű ködöt pólyájává,
10 ౧౦ సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు,
és reája szabtam törvényemet és elhelyeztem reteszt meg ajtókat,
11 ౧౧ “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?
és mondtam, idáig jöjj s ne tovább, s itt legyen határa vetve hullámaid gőgjének!
12 ౧౨ నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా?
Világéletedben rendeltél-e reggelt, tudattad-e a hajnallal az ő helyét?
13 ౧౩ దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా?
Hogy megragadja a földnek széleit, hogy lerázassanak róla a gonoszok:
14 ౧౪ ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి.
elváltozik mint pecsét agyag, a minden előáll mint egy ruha;
15 ౧౫ దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది.
s megvonatik a gonoszoktól világosságuk, s a fölemelt kar megtöretik.
16 ౧౬ సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా?
Eljutottál-e a tenger örvényéig, s a mélység fenekén járkáltál-e?
17 ౧౭ మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా?
Feltárultak-e neked a halál kapui s láttad-e a vakhomálynak kapuit?
18 ౧౮ భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.
Figyeltél-e a föld tágasságáig? Jelentsd ki, ha mindezt tudod.
19 ౧౯ వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది?
Melyik az út oda, a hol lakik a világosság, és a sötétségnek merre van helye,
20 ౨౦ వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా?
hogy elvinnéd határához, a hogy értenéd házának ösvényét?
21 ౨౧ ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.
Tudhatod, mert akkor születtél, és sok a te napjaidnak száma!
22 ౨౨ నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా?
Eljutottál-e a hó tárházaihoz, és a jégeső tárházait láttad-e,
23 ౨౩ ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.
melyet tartogattam szorongatás idejére, harcz és háború napjaira.
24 ౨౪ మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాలా వీస్తుంది?
Melyik az út oda, a hol szétoszlik a világosság, szétterjed a keleti szél a földre?
25 ౨౫ మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,
Ki hasított csatornát az áradatnak és utat a mennydörgés villámának,
26 ౨౬ చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,
hogy esőt hullasson földre, hol nincs férfi, pusztára, melyben ember nincs.
27 ౨౭ వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?
Hogy jól lakasson pusztát és pusztaságot, és hogy sarjasztóvá tegye a pázsit eredőjét?
28 ౨౮ వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?
Van-e az esőnek apja, vagy ki nemzette a harmat cseppjeit?
29 ౨౯ మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?
Kinek méhéből eredt a jég, s az égnek derét ki szülte?
30 ౩౦ జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.
Mint a kő összezsugorodnak a vizek, s a mélység felszíne összefogódzik.
31 ౩౧ కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?
Megkötöd-e a fiastyúknak kötelékeit, vagy megoldod-e órión pórázait;
32 ౩౨ వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?
kihozod-e a csillagzatokat idején, és a gönczölszekeret fiaival együtt vezeted-e?
33 ౩౩ ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?
Ismered-e az ég törvényeit, avagy te állapítod-e meg kormányát a földön?
34 ౩౪ జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా?
Emeled-e a hangodat a felhőhöz, hogy víznek bősége borítson el téged?
35 ౩౫ మెరుపులు బయలుదేరి వెళ్లి “చిత్తం ఇదుగో ఉన్నాం” అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా?
Kiküldesz-e villámokat, hogy menjenek s hogy azt mondják neked: íme itt vagyunk?
36 ౩౬ మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చిన వాడెవడు?
Ki helyezett a vesékbe bölcsséget, vagy ki adott a gondolatba értelmességet?
37 ౩౭ నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్ట గలవాడెవడు?
Ki számlálja meg a fellegeket bölcsséggel s az ég tömlőit ki folyatja ki?
38 ౩౮ మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు?
Mikor tömörré tömörül a por s a göröngyök összetapadnak?
39 ౩౯ ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?
Vadászol-e a nőoroszlánnak ragadmányt, s a fioroszlánok vágyát kitöltöd-e;
40 ౪౦ సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?
midőn guggolnak az odúkban, lesre ülnek a bozótban?
41 ౪౧ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?
Ki készíti el a hollónak az ő prédáját, midőn gyermekei Istenhez fohászkodnak, kóvályognak eledel nélkül?