< యోబు~ గ్రంథము 37 >

1 దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది.
И от сих возмятеся сердце мое и отторжеся от места своего.
2 దేవుని స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి.
Послушай слуха во гневе ярости Господни, и поучение изо уст Его изыдет.
3 ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు.
Под всем небом началство его, и свет его на крилу земли.
4 దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు.
Вслед его возопиет гласом, возгремит гласом величия Своего, и не изменит их, яко услышит глас Его.
5 దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
Возгремит Крепкий гласом Своим дивная: сотвори бо велия, ихже не ведахом.
6 నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.
Повелеваяй снегу: буди на земли, и буря дождя, и буря дождев могутства Его.
7 మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు.
В руце всякаго человека знаменает, да познает всяк человек свою немощь.
8 జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి.
Внидоша же зверие под кров и умолкоша на ложи.
9 దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి.
Из хранилищ внутренних находят болезни, и от внешних стран студень.
10 ౧౦ దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది.
И от дыхания Крепка даст лед: управляет же воду, якоже хощет,
11 ౧౧ ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు.
и избранное устрояет облак: разженет облак свет Его,
12 ౧౨ ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి.
и Сам окрестная превратит, якоже хощет, в дела их: вся, елика заповесть им, сия чиноположена суть от Него на земли,
13 ౧౩ ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.
аще в наказание, аще на землю свою, аще на милость обрящет и.
14 ౧౪ యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.
Внуши сия, Иове: стани учайся силе Господни.
15 ౧౫ దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా?
Вемы, яко Господь положи дела Своя, свет сотворив из тмы.
16 ౧౬ మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా?
Весть же различие облаков и велия падения злых.
17 ౧౭ దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా?
Твоя же одежда тепла, почивает же на земли от юга.
18 ౧౮ పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా?
Утверждения с Ним в древности, крепка якоже видение слития.
19 ౧౯ మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు.
Чесо ради, научи мя, что речем Ему? И престанем многа глаголюще.
20 ౨౦ నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా?
Еда книга, или книгочиа ми предстоит? Да стоящь сотворю человеку молчати.
21 ౨౧ ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది.
Не всем же видимь свет: светлый есть в древностех, якоже еже от него на облацех.
22 ౨౨ ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు.
От севера облацы златозарни: в сих велия слава и честь Вседержителева.
23 ౨౩ సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు.
И не обретаем иного подобна крепости Его: иже судит праведно, мниши ли, яко не слышит Той?
24 ౨౪ తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు.
Темже убоятся Его человецы: убоятся же Его и премудрии сердцем.

< యోబు~ గ్రంథము 37 >