< యోబు~ గ్రంథము 37 >
1 ౧ దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది.
Ja, derover skælver mit Hjerte, bævende skifter det Sted!
2 ౨ దేవుని స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి.
Lyt dog til hans bragende Røst, til Drønet, der gaar fra hans Mund!
3 ౩ ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు.
Han slipper det løs under hele Himlen, sit Lys til Jordens Ender;
4 ౪ దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు.
efter det brøler hans Røst, med Højhed brager hans Torden; han sparer ikke paa Lyn, imedens hans Stemme høres.
5 ౫ దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
Underfuldt lyder Guds Tordenrøst, han øver Vælde, vi fatter det ej.
6 ౬ నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.
Thi han siger til Sneen: »Fald ned paa Jorden!« til Byger og Regnskyl: »Bliv stærke!«
7 ౭ మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు.
For alle Mennesker sætter han Segl, at de dødelige alle maa kende hans Gerning.
8 ౮ జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి.
De vilde Dyr søger Ly og holder sig i deres Huler:
9 ౯ దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి.
Fra Kammeret kommer der Storm, fra Nordens Stjerner Kulde.
10 ౧౦ దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది.
Ved Guds Aande bliver der Is, Vandfladen lægges i Fængsel.
11 ౧౧ ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు.
Saa fylder han Skyen med Væde, Skylaget spreder hans Lys;
12 ౧౨ ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి.
det farer hid og did og bugter sig efter hans Tanke og udfører alt, hvad han byder, paa hele den vide Jord,
13 ౧౩ ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.
hvad enten han slynger det ud som Svøbe, eller han sender det for at velsigne.
14 ౧౪ యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.
Job du maa lytte hertil, træd frem og mærk dig Guds Underværker!
15 ౧౫ దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా?
Fatter du, hvorledes Gud kan magte dem og lade Lys straale frem fra sin Sky?
16 ౧౬ మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా?
Fatter du Skyernes Svæven, den Alvises Underværker?
17 ౧౭ దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా?
Du, hvis Klæder ophedes, naar Jorden døser ved Søndenvind?
18 ౧౮ పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా?
Hvælver du Himlen sammen med ham, fast som det støbte Spejl?
19 ౧౯ మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు.
Lær mig, hvad vi skal sige ham! Intet kan vi faa frem for Mørke.
20 ౨౦ నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా?
Meldes det ham, at jeg taler? Siger en Mand, at han er fra Samling?
21 ౨౧ ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది.
Og nu: Man ser ej Lyset, skygget af mørke Skyer, men et Vejr farer hen og renser Himlen,
22 ౨౨ ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు.
fra Norden kommer en Lysning. Over Gud er der frygtelig Højhed,
23 ౨౩ సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు.
og den Almægtige finder vi ikke. Almægtig og rig paa Retfærd bøjer han ikke Retten;
24 ౨౪ తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు.
derfor frygter Mennesker ham, men af selv kloge ænser han ingen.