< యోబు~ గ్రంథము 36 >

1 ఎలీహు ఇంకా ఇలా అన్నాడు.
以利戶又接着說:
2 కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది.
你再容我片時,我就指示你, 因我還有話為上帝說。
3 దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను.
我要將所知道的從遠處引來, 將公義歸給造我的主。
4 నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు.
我的言語真不虛謊; 有知識全備的與你同在。
5 దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది.
上帝有大能,並不藐視人; 他的智慧甚廣。
6 భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు.
他不保護惡人的性命, 卻為困苦人伸冤。
7 నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు.
他時常看顧義人, 使他們和君王同坐寶座, 永遠要被高舉。
8 వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే,
他們若被鎖鍊捆住, 被苦難的繩索纏住,
9 అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు.
他就把他們的作為和過犯指示他們, 叫他們知道有驕傲的行動。
10 ౧౦ ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు.
他也開通他們的耳朵得受教訓, 吩咐他們離開罪孽轉回。
11 ౧౧ వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.
他們若聽從事奉他, 就必度日亨通,歷年福樂;
12 ౧౨ వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు.
若不聽從, 就要被刀殺滅,無知無識而死。
13 ౧౩ అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు.
那心中不敬虔的人積蓄怒氣; 上帝捆綁他們,他們竟不求救;
14 ౧౪ కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది.
必在青年時死亡, 與污穢人一樣喪命。
15 ౧౫ బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు.
上帝藉着困苦救拔困苦人, 趁他們受欺壓開通他們的耳朵。
16 ౧౬ అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు.
上帝也必引你出離患難, 進入寬闊不狹窄之地; 擺在你席上的必滿有肥甘。
17 ౧౭ దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి.
但你滿口有惡人批評的言語; 判斷和刑罰抓住你。
18 ౧౮ కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు.
不可容忿怒觸動你,使你不服責罰; 也不可因贖價大就偏行。
19 ౧౯ నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా?
你的呼求,或是你一切的勢力, 果有靈驗,叫你不受患難嗎?
20 ౨౦ ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు.
不要切慕黑夜, 就是眾民在本處被除滅的時候。
21 ౨౧ పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి.
你要謹慎,不可重看罪孽, 因你選擇罪孽過於選擇苦難。
22 ౨౨ ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు?
上帝行事有高大的能力; 教訓人的有誰像他呢?
23 ౨౩ ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? “నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు” అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు?
誰派定他的道路? 誰能說:你所行的不義?
24 ౨౪ ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు.
你不可忘記稱讚他所行的為大, 就是人所歌頌的。
25 ౨౫ మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు.
他所行的,萬人都看見; 世人也從遠處觀看。
26 ౨౬ ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు.
上帝為大,我們不能全知; 他的年數不能測度。
27 ౨౭ ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.
他吸取水點, 這水點從雲霧中就變成雨;
28 ౨౮ మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి.
雲彩將雨落下,沛然降與世人。
29 ౨౯ నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?
誰能明白雲彩如何鋪張, 和上帝行宮的雷聲呢?
30 ౩౦ చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు.
他將亮光普照在自己的四圍; 他又遮覆海底。
31 ౩౧ ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు.
他用這些審判眾民, 且賜豐富的糧食。
32 ౩౨ తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు.
他以電光遮手, 命閃電擊中敵人。
33 ౩౩ వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.
所發的雷聲顯明他的作為, 又向牲畜指明要起暴風。

< యోబు~ గ్రంథము 36 >