< యోబు~ గ్రంథము 35 >
1 ౧ ఎలీహు ఇలా జవాబు ఇచ్చాడు.
エリフはまた答えて言った、
2 ౨ నువ్వు నిర్దోషివని అనుకుంటున్నావా? “నేను దేవుడి కన్నా నీతిపరుణ్ణి” అనుకుంటున్నావా?
「あなたはこれを正しいと思うのか、あなたは『神の前に自分は正しい』と言うのか。
3 ౩ “నేను నీతిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? పాపం చేస్తే నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి?” అని నువ్వు చెబుతున్నావే.
あなたは言う、『これはわたしになんの益があるか、罪を犯したのとくらべてなんのまさるところがあるか』と。
4 ౪ నీకూ నీ మిత్రులకు కూడా నేను సమాధానం చెబుతాను.
わたしはあなたおよび、あなたと共にいるあなたの友人たちに答えよう。
5 ౫ ఆకాశం వైపు తేరి చూడు. నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు.
天を仰ぎ見よ、あなたの上なる高き空を望み見よ。
6 ౬ నువ్వు పాపం చేసినా ఆయనకు నష్టమేమిటి? నీ అతిక్రమాలు పోగుపడినా ఆయనకి నువ్వు చేసిందేమిటి?
あなたが罪を犯しても、彼になんのさしさわりがあるか。あなたのとがが多くても、彼に何をなし得ようか。
7 ౭ నువ్వు నీతిమంతుడివైతే ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ దగ్గర నుండి ఏమైనా తీసుకుంటాడా?
またあなたは正しくても、彼に何を与え得ようか。彼はあなたの手から何を受けられるであろうか。
8 ౮ నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది. నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది.
あなたの悪はただあなたのような人にかかわり、あなたの義はただ人の子にかかわるのみだ。
9 ౯ అనేకమైన అణచివేత క్రియల వలన ప్రజలు అక్రోశిస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు.
しえたげの多いために叫び、力ある者の腕のゆえに呼ばわる人々がある。
10 ౧౦ అయితే “రాత్రిలో మనకు పాటలు ఇస్తూ,
しかし、ひとりとして言う者はない、『わが造り主なる神はどこにおられるか、彼は夜の間に歌を与え、
11 ౧౧ భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుతూ, ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు?” అనుకునే వారెవరూ లేరు.
地の獣よりも多く、われわれを教え、空の鳥よりも、われわれを賢くされる方である』と。
12 ౧౨ వారు దుష్టుల గర్వాన్ని బట్టి మొర పెడతారు గాని ఆయన జవాబివ్వడం లేదు.
彼らが叫んでも答えられないのは、悪しき者の高ぶりによる。
13 ౧౩ దేవుడు ఒక్కనాటికీ వ్యర్థమైన మాటలు ఆలకించడు. సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
まことに神はむなしい叫びを聞かれない。また全能者はこれを顧みられない。
14 ౧౪ ఆయన కనిపించడం లేదని నువ్వు చెబితే మరి ఇంకెంతగా ఆయన పెడచెవిన పెడతాడు! వాదం ఆయన ఎదుటనే ఉంది. ఆయన కోసం నువ్వు కనిపెట్టవలసిందే.
あなたが彼を見ないと言う時はなおさらだ。さばきは神の前にある。あなたは彼を待つべきである。
15 ౧౫ “ఆయన ఎవరినీ కోపంతో దండించడు, మనుషుల అహంకారాన్ని ఆయన పట్టించుకోడు” అని నీవంటే మరి ఇంకెంతో నిశ్చయంగా ఆయన జవాబు చెప్పకుండా మౌనం దాలుస్తాడు గదా.
今彼が怒りをもって罰せず、罪とがを深く心にとめられないゆえに
16 ౧౬ కాబట్టి యోబు కేవలం బుద్ధితక్కువ మాటలు పలకడానికే తన నోరు తెరిచాడు. జ్ఞానం లేని మాటలనే రాసులు పోస్తున్నాడు.
ヨブは口を開いてむなしい事を述べ、無知の言葉をしげくする」。