< యోబు~ గ్రంథము 33 >
1 ౧ యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను.
A przetoż, Ijobie! słuchaj proszę mów moich, a wszystkie słowa moje przyjmij w uszy.
2 ౨ ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది.
Oto teraz otworzę usta moje, a język mój będzie mówił w podniebieniu mojem.
3 ౩ నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి.
Szczerością serca mego będą słowa moje, a czyste zdania wargi moje mówić będą.
4 ౪ దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.
Duch Boży uczynił mię, a tchnienie Wszechmocnego ożywiło mię.
5 ౫ నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు.
Możeszli, odpowiedz mi; sporządź się, a stań przeciwko mnie.
6 ౬ దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి.
Oto ja według słów twoich odpowiem ci za Boga, chociażem ja też z błota utworzony.
7 ౭ నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు.
Oto strach mój nie zatrwoży cię, a ręka moja nie obciąży cię.
8 ౮ నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది.
A wszakżeś rzekł w uszy moje, i słyszałem głos słów moich.
9 ౯ ఏమంటే “నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి.
Czystym ja bez przestępstwa; niewinnym ja, i nie masz we mnie nieprawości.
10 ౧౦ ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు.
Oto znajduje Bóg przyczyny przeciwko mnie, a poczytuje mię za nieprzyjaciela swego.
11 ౧౧ ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు” అని నీవంటున్నావు.
Podaje w okowy nogi moje, a podstrzega wszystkich ścieżek moich.
12 ౧౨ నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు.
Otości na to tak odpowiadam: W tem nie jesteś sprawiedliwy; bo większy jest Bóg, niż człowiek.
13 ౧౩ నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు.
Przeczże się z nim spierasz, żeć wszystkich spraw swoich nie objawia?
14 ౧౪ దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు.
Wszak Bóg mówi i raz i drugi, a człowiek tego nie uważa.
15 ౧౫ మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు.
We śnie w widzeniu nocnem, gdy twardy sen przypada na ludzie gdy śpią na łożu:
16 ౧౬ ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు.
Tedy otwiera ucho ludzkie, a to, czem ich ćwiczy, pieczętuje,
17 ౧౭ మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి,
Aby człowieka odwiódł od złej sprawy jego, i pychę od męża aby odjął;
18 ౧౮ గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి,
Aby zahamował duszę jego od dołu, a żywot jego aby na miecz nie trafił.
19 ౧౯ వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు.
Każe go też boleścią na łożu jego, a we wszystkich kościach jego ciężką niemocą.
20 ౨౦ రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది.
Tak, że sobie żywot jego chleb obrzydzi, a dusza jego pokarm wdzięczny.
21 ౨౧ వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి.
Zniszczeje znacznie ciało jego, i wysadzą się kości jego, których nie widać było;
22 ౨౨ వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది.
I przybliża się do grobu dusza jego a żywot jego do rzeczy śmierć przynoszących.
23 ౨౩ మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే,
Jeźli będzie u niego jaki Anioł wymowny, jeden z tysiąca, aby opowiedział człowiekowi powinność jego:
24 ౨౪ ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో “పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది” అని గనక అంటే,
Tedy się nad nim Bóg zmiłuje, a rzecze: Wybaw go, aby nie zstępował do grobu, bom znalazł ubłaganie.
25 ౨౫ అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది.
I odmłodnieje ciało jego jako dziecięce, a nawróci się do dni młodości swojej.
26 ౨౬ వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు.
Będzie się modlił Bogu, i przyjmie go łaskawie, i ogląda z weselem oblicze jego, i przywróci człowiekowi sprawiedliwość jego;
27 ౨౭ అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు.
Który poglądając na ludzi, rzecze: Zgrzeszyłem był, i co było prawego, podwróciłem; ale mi to nie było pożyteczno.
28 ౨౮ కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.”
Lecz Bóg wybawił duszę moję, aby nie zstąpiła do dołu, a żywot mój aby oglądał światłość.
29 ౨౯ చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు.
Oto wszystko to czyni Bóg po dwakroć i po trzykroć z człowiekiem,
30 ౩౦ కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు.
Aby odwrócił duszę jego od dołu, a żeby oświecon był światłością żyjących.
31 ౩౧ యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను.
Uważaj to, Ijobie, słuchaj mię; milcz, a ja będę mówił.
32 ౩౨ చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో.
Wszakże maszli co mówić, a odpowiedzże mi; mów, bobym cię rad usprawiedliwił.
33 ౩౩ అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.
A jeźli niemasz, słuchajże mię, a nauczę cię mądrości.