< యోబు~ గ్రంథము 33 >

1 యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను.
Slyšiž tedy, prosím, Jobe, řeči mé, a všech slov mých ušima svýma pozoruj.
2 ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది.
Aj, jižť otvírám ústa svá, mluví jazyk můj v ústech mých.
3 నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి.
Upřímost srdce mého a umění vynesou rtové moji.
4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.
Duch Boha silného učinil mne, a dchnutí Všemohoucího dalo mi život.
5 నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు.
Můžeš-li, odpovídej mi, připrav se proti mně, a postav se.
6 దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి.
Aj, já podlé žádosti tvé buduť místo Boha silného; z bláta sformován jsem i já.
7 నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు.
Pročež strach ze mne nepředěsí tě, a ruka má nebudeť k obtížení.
8 నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది.
Řekl jsi pak přede mnou, a hlas ten řečí tvých slyšel jsem:
9 ఏమంటే “నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి.
Èist jsem, bez přestoupení, nevinný jsem, a nepravosti při mně není.
10 ౧౦ ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు.
Aj, příčiny ku potření mne shledal Bůh, klade mne sobě za nepřítele,
11 ౧౧ ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు” అని నీవంటున్నావు.
Svírá poutami nohy mé, střeže všech stezek mých.
12 ౧౨ నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు.
Aj, tím nejsi spravedliv, odpovídám tobě, nebo větší jest Bůh nežli člověk.
13 ౧౩ నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు.
Oč se s ním nesnadníš? Žeť všech svých věcí nezjevuje?
14 ౧౪ దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు.
Ano jednou mluví Bůh silný, i dvakrát, a nešetří toho člověk.
15 ౧౫ మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు.
Skrze sny u vidění nočním, když připadá hluboký sen na lidi ve spaní na ložci,
16 ౧౬ ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు.
Tehdáž odkrývá ucho lidem, a čemu je učí, to zpečeťuje,
17 ౧౭ మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి,
Aby odtrhl člověka od skutku zlého, a pýchu od muže vzdálil,
18 ౧౮ గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి,
A zachoval duši jeho od jámy, a život jeho aby netrefil na meč.
19 ౧౯ వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు.
Tresce i bolestí na lůži jeho, a všecky kosti jeho násilnou nemocí,
20 ౨౦ రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది.
Tak že sobě život jeho oškliví pokrm, a duše jeho krmi nejlahodnější.
21 ౨౧ వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి.
Hyne tělo jeho patrně, a vyhlédají kosti jeho, jichž prvé nebylo vídati.
22 ౨౨ వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది.
A tak bývá blízká hrobu duše jeho, a život jeho smrtelných ran.
23 ౨౩ మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే,
Však bude-li míti anděla vykladače jednoho z tisíce, kterýž by za člověka oznámil pokání jeho:
24 ౨౪ ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో “పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది” అని గనక అంటే,
Tedy smiluje se nad ním, a dí: Vyprosť jej, ať nesstoupí do porušení, oblíbilť jsem mzdu vyplacení.
25 ౨౫ అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది.
I odmladne tělo jeho nad dítěcí, a navrátí se ke dnům mladosti své.
26 ౨౬ వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు.
Kořiti se bude Bohu, a zamiluje jej, a patřiti bude na něj tváří ochotnou; nadto navrátí člověku spravedlnost jeho.
27 ౨౭ అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు.
Kterýž hledě na lidi, řekne: Zhřešilť jsem byl, a to, což pravého bylo, převrátil jsem, ale nebylo mi to prospěšné.
28 ౨౮ కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.”
Bůh však vykoupil duši mou, aby nešla do jámy, a život můj, aby světlo spatřoval.
29 ౨౯ చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు.
Aj, všeckoť to dělá Bůh silný dvakrát i třikrát při člověku,
30 ౩౦ కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు.
Aby odvrátil duši jeho od jámy, a aby osvícen byl světlem živých.
31 ౩౧ యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను.
Pozoruj, Jobe, poslouchej mne, mlč, ať já mluvím.
32 ౩౨ చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో.
Jestliže máš slova, odpovídej mi, nebo bych chtěl ospravedlniti tebe.
33 ౩౩ అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.
Pakli nic, ty mne poslouchej; mlč, a poučím tě moudrosti.

< యోబు~ గ్రంథము 33 >