< యోబు~ గ్రంథము 30 >

1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందలు కాసే కుక్కలతో ఉండడానికి తగని వారని నేను తలంచాను.
וְעַתָּ֤ה ׀ שָֽׂחֲק֣וּ עָלַי֮ צְעִירִ֥ים מִמֶּ֗נִּי לְיָ֫מִ֥ים אֲשֶׁר־מָאַ֥סְתִּי אֲבוֹתָ֑ם לָ֝שִׁ֗ית עִם־כַּלְבֵ֥י צֹאנִֽי׃
2 వారి తండ్రుల చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి వయసు మళ్ళిపోవడం చేత వారి సత్తువతగ్గిపోయింది.
גַּם־כֹּ֣חַ יְ֭דֵיהֶם לָ֣מָּה לִּ֑י עָ֝לֵ֗ימוֹ אָ֣בַד כָּֽלַח׃
3 వారు పేదరికం చేత, కరువుచేత, శుష్కించిపోయిన వారు. పాడై నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలోని చీకటి తావుల్లో ఎండిన నేలలో వెదుకులాడుతారు.
בְּחֶ֥סֶר וּבְכָפָ֗ן גַּ֫לְמ֥וּד הַֽעֹרְקִ֥ים צִיָּ֑ה אֶ֝֗מֶשׁ שׁוֹאָ֥ה וּמְשֹׁאָֽה׃
4 వారు తుప్పల్లోని రేవు కాడలను పెరుకుతారు. దూసరి తీగె వారికి ఆహారం.
הַקֹּטְפִ֣ים מַלּ֣וּחַ עֲלֵי־שִׂ֑יחַ וְשֹׁ֖רֶשׁ רְתָמִ֣ים לַחְמָֽם׃
5 వారు మనుషుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముతూ కేకలు వేసినట్టు మనుషులు వారిని తరుముతూ కేకలు వేస్తారు.
מִן־גֵּ֥ו יְגֹרָ֑שׁוּ יָרִ֥יעוּ עָ֝לֵ֗ימוֹ כַּגַּנָּֽב׃
6 భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది.
בַּעֲר֣וּץ נְחָלִ֣ים לִשְׁכֹּ֑ן חֹרֵ֖י עָפָ֣ר וְכֵפִֽים׃
7 తుప్పల్లో వారు గాడిదల్లాగా ఓండ్ర పెడతారు ముళ్లచెట్ల కింద వారు కూర్చుంటారు.
בֵּין־שִׂיחִ֥ים יִנְהָ֑קוּ תַּ֖חַת חָר֣וּל יְסֻפָּֽחוּ׃
8 వారు మోటు వారికి, పేరు లేని పనికి మాలిన వారికి పుట్టినవారు. దేశంలోనుండి కొరడాలతో వారిని తరిమి వేశారు.
בְּֽנֵי־נָ֭בָל גַּם־בְּנֵ֣י בְלִי־שֵׁ֑ם נִ֝כְּא֗וּ מִן־הָאָֽרֶץ׃
9 అలాంటివారి కొడుకులు ఇప్పుడు నా గురించి పాటలు పాడుతారు. నేను వారి వేళాకోళానికి గురి అవుతున్నాను.
וְ֭עַתָּה נְגִינָתָ֣ם הָיִ֑יתִי וָאֱהִ֖י לָהֶ֣ם לְמִלָּֽה׃
10 ౧౦ వారు నన్ను అసహ్యించుకుంటారు. నా దగ్గర నుండి దూరంగా పోతారు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు.
תִּֽ֭עֲבוּנִי רָ֣חֲקוּ מֶ֑נִּי וּ֝מִפָּנַ֗י לֹא־חָ֥שְׂכוּ רֹֽק׃
11 ౧౧ ఆయన నా అల్లె తాడు తప్పించి నన్ను బాధించాడు. కాబట్టి వారు నాకు లోబడక నా అదుపు తప్పి పోయారు.
כִּֽי־יתרו פִ֭תַּח וַיְעַנֵּ֑נִי וְ֝רֶ֗סֶן מִפָּנַ֥י שִׁלֵּֽחוּ׃
12 ౧౨ నా కుడిపక్కన అల్లరిమూక లేస్తుంది. వారు నన్ను తరుముతారు. నాకు ఎదురుగా ముట్టడి దిబ్బ వేస్తారు.
עַל־יָמִין֮ פִּרְחַ֪ח יָ֫ק֥וּמוּ רַגְלַ֥י שִׁלֵּ֑חוּ וַיָּסֹ֥לּוּ עָ֝לַ֗י אָרְח֥וֹת אֵידָֽם׃
13 ౧౩ వారిని అదుపు చేసే వారు లేరు. నా దారిని పాడు చేస్తారు. నా మీదికి ఆపద లాక్కొస్తారు.
נָתְס֗וּ נְֽתִיבָ֫תִ֥י לְהַוָּתִ֥י יֹעִ֑ילוּ לֹ֖א עֹזֵ֣ר לָֽמוֹ׃
14 ౧౪ గొప్ప గండి పడి జలప్రవాహం వచ్చినట్టు వారు వస్తారు. ఆ వినాశంలో వారు కొట్టుకుపోతారు.
כְּפֶ֣רֶץ רָחָ֣ב יֶאֱתָ֑יוּ תַּ֥חַת שֹׁ֝אָ֗ה הִתְגַּלְגָּֽלוּ׃
15 ౧౫ భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘం లాగా నా అభివృద్ధి కదిలి వెళ్లి పోయింది.
הָהְפַּ֥ךְ עָלַ֗י בַּלָּ֫ה֥וֹת תִּרְדֹּ֣ף כָּ֭רוּחַ נְדִבָתִ֑י וּ֝כְעָ֗ב עָבְרָ֥ה יְשֻׁעָתִֽי׃
16 ౧౬ నా ప్రాణం నాలోనుంచి పార బోసినట్టు అయిపోయింది. కష్టకాలం నన్ను చేజిక్కించుకుంది.
וְעַתָּ֗ה עָ֭לַי תִּשְׁתַּפֵּ֣ךְ נַפְשִׁ֑י יֹ֭אחֲז֣וּנִי יְמֵי־עֹֽנִי׃
17 ౧౭ రాత్రివేళ నా ఎముకలు నాలో విరుగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు.
לַ֗יְלָה עֲ֭צָמַי נִקַּ֣ר מֵעָלָ֑י וְ֝עֹרְקַ֗י לֹ֣א יִשְׁכָּבֽוּן׃
18 ౧౮ దేవుని మహా బలం నా వస్త్రాన్ని ఒడిసి పట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకు పోతున్నది.
בְּרָב־כֹּ֭חַ יִתְחַפֵּ֣שׂ לְבוּשִׁ֑י כְּפִ֖י כֻתָּנְתִּ֣י יַֽאַזְרֵֽנִי׃
19 ౧౯ ఆయన నన్ను బురదలోకి తోసాడు. నేను దుమ్ములాగా బూడిదలాగా ఉన్నాను.
הֹרָ֥נִי לַחֹ֑מֶר וָ֝אֶתְמַשֵּׁ֗ל כֶּעָפָ֥ר וָאֵֽפֶר׃
20 ౨౦ ఓ దేవా నీకు మొర పెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు.
אֲשַׁוַּ֣ע אֵ֭לֶיךָ וְלֹ֣א תַעֲנֵ֑נִי עָ֝מַ֗דְתִּי וַתִּתְבֹּ֥נֶן בִּֽי׃
21 ౨౧ నువ్వు మారిపోయావు. నా పట్ల కఠినుడివైపోయావు. నీ బాహుబలంతో నన్ను హింసిస్తున్నావు.
תֵּהָפֵ֣ךְ לְאַכְזָ֣ר לִ֑י בְּעֹ֖צֶם יָדְךָ֣ תִשְׂטְמֵֽנִי׃
22 ౨౨ గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు.
תִּשָּׂאֵ֣נִי אֶל־ר֭וּחַ תַּרְכִּיבֵ֑נִי וּ֝תְמֹגְגֵ֗נִי תשוה׃
23 ౨౩ నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు.
כִּֽי־יָ֭דַעְתִּי מָ֣וֶת תְּשִׁיבֵ֑נִי וּבֵ֖ית מוֹעֵ֣ד לְכָל־חָֽי׃
24 ౨౪ ఎవరైనా పడిపోతూ ఉన్నప్పుడు సహాయం కోసం చెయ్యి చాపడా? ఆపదలో రక్షించమని మొర పెట్టడా?
אַ֣ךְ לֹא־בְ֭עִי יִשְׁלַח־יָ֑ד אִם־בְּ֝פִיד֗וֹ לָהֶ֥ן שֽׁוּעַ׃
25 ౨౫ బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?
אִם־לֹ֣א בָ֭כִיתִי לִקְשֵׁה־י֑וֹם עָֽגְמָ֥ה נַ֝פְשִׁ֗י לָאֶבְיֽוֹן׃
26 ౨౬ నాకు మేలు కలుగుతుందని నేను ఆశించాను. కానీ నాకు కీడు సంభవించింది. వెలుగు కోసం నేను కనిపెట్టగా చీకటి దక్కింది.
כִּ֤י ט֣וֹב קִ֭וִּיתִי וַיָּ֣בֹא רָ֑ע וַֽאֲיַחֲלָ֥ה לְ֝א֗וֹר וַיָּ֥בֹא אֹֽפֶל׃
27 ౨౭ నా పేగులు మానక మండుతున్నాయి అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి.
מֵעַ֖י רֻתְּח֥וּ וְלֹא־דָ֗מּוּ קִדְּמֻ֥נִי יְמֵי־עֹֽנִי׃
28 ౨౮ సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను.
קֹדֵ֣ר הִ֭לַּכְתִּי בְּלֹ֣א חַמָּ֑ה קַ֖מְתִּי בַקָּהָ֣ל אֲשַׁוֵּֽעַ׃
29 ౨౯ నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను.
אָ֭ח הָיִ֣יתִי לְתַנִּ֑ים וְ֝רֵ֗עַ לִבְנ֥וֹת יַעֲנָֽה׃
30 ౩౦ నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి.
ע֭וֹרִי שָׁחַ֣ר מֵעָלָ֑י וְעַצְמִי־חָ֝֗רָה מִנִּי־חֹֽרֶב׃
31 ౩౧ నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది.
וַיְהִ֣י לְ֭אֵבֶל כִּנֹּרִ֑י וְ֝עֻגָבִ֗י לְק֣וֹל בֹּכִֽים׃

< యోబు~ గ్రంథము 30 >