< యోబు~ గ్రంథము 29 >
1 ౧ యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
Jób pedig folytatá az ő beszédét, és monda:
2 ౨ గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు!
Oh, vajha olyan volnék, mint a hajdani hónapokban, a mikor Isten őrzött engem!
3 ౩ అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను.
Mikor az ő szövétneke fénylett fejem fölött, s világánál jártam a setétet;
4 ౪ నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది!
A mint java-korom napjaiban valék, a mikor Isten gondossága borult sátoromra!
5 ౫ సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు.
Mikor még a Mindenható velem volt, és körültem voltak gyermekeim;
6 ౬ నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది.
Mikor lábaimat édes tejben mostam, és mellettem a szikla olajpatakokat ontott;
7 ౭ పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు,
Mikor a kapuhoz mentem, fel a városon; a köztéren székemet fölállítám:
8 ౮ యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు.
Ha megláttak az ifjak, félrevonultak, az öregek is fölkeltek és állottak.
9 ౯ అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు.
A fejedelmek abbahagyták a beszédet, és tenyeröket szájukra tették.
10 ౧౦ ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది.
A főemberek szava elnémult, és nyelvök az ínyökhöz ragadt.
11 ౧౧ నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
Mert a mely fül hallott, boldognak mondott engem, és a mely szem látott, bizonyságot tett én felőlem.
12 ౧౨ ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.
Mert megmentém a kiáltozó szegényt, és az árvát, a kinek nem volt segítsége.
13 ౧౩ నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.
A veszni indultnak áldása szállt reám, az özvegynek szívét megörvendeztetém.
14 ౧౪ నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది.
Az igazságot magamra öltém és az is magára ölte engem; palást és süveg gyanánt volt az én ítéletem.
15 ౧౫ గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను.
A vaknak én szeme valék, és a sántának lába.
16 ౧౬ దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను.
A szűkölködőknek én atyjok valék, az ismeretlennek ügyét is jól meghányám-vetém.
17 ౧౭ దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను.
Az álnoknak zápfogait kitördösém, és fogai közül a prédát kiütém vala.
18 ౧౮ అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను.
Azt gondoltam azért: fészkemmel veszek el, és mint a homok, megsokasodnak napjaim.
19 ౧౯ నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.
Gyökerem a víznek nyitva lesz, és ágamon hál meg a harmat.
20 ౨౦ నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది.
Dicsőségem megújul velem, és kézívem erősebbé lesz kezemben.
21 ౨౧ మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు.
Hallgattak és figyeltek reám, és elnémultak az én tanácsomra.
22 ౨౨ నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి.
Az én szavaim után nem szóltak többet, s harmatként hullt rájok beszédem.
23 ౨౩ వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు.
Mint az esőre, úgy vártak rám, és szájukat tátották, mint tavaszi záporra.
24 ౨౪ వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు.
Ha rájok mosolyogtam, nem bizakodtak el, és arczom derüjét nem sötétíték be.
25 ౨౫ నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను.
Örömest választottam útjokat, mint főember ültem ott; úgy laktam ott, mint király a hadseregben, mint a ki bánkódókat vigasztal.