< యోబు~ గ్రంథము 29 >

1 యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
וַיֹּ֣סֶף אִ֭יֹּוב שְׂאֵ֥ת מְשָׁלֹ֗ו וַיֹּאמַֽר׃
2 గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు!
מִֽי־יִתְּנֵ֥נִי כְיַרְחֵי־קֶ֑דֶם כִּ֝ימֵ֗י אֱלֹ֣והַּ יִשְׁמְרֵֽנִי׃
3 అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను.
בְּהִלֹּ֣ו נֵ֭רֹו עֲלֵ֣י רֹאשִׁ֑י לְ֝אֹורֹו אֵ֣לֶךְ חֹֽשֶׁךְ׃
4 నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది!
כַּאֲשֶׁ֣ר הָ֭יִיתִי בִּימֵ֣י חָרְפִּ֑י בְּסֹ֥וד אֱ֝לֹ֗והַּ עֲלֵ֣י אָהֳלִֽי׃
5 సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు.
בְּעֹ֣וד שַׁ֭דַּי עִמָּדִ֑י סְבִ֖יבֹותַ֣י נְעָרָֽי׃
6 నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది.
בִּרְחֹ֣ץ הֲלִיכַ֣י בְּחֵמָ֑ה וְצ֥וּר יָצ֥וּק עִ֝מָּדִ֗י פַּלְגֵי־שָֽׁמֶן׃
7 పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు,
בְּצֵ֣אתִי שַׁ֣עַר עֲלֵי־קָ֑רֶת בָּ֝רְחֹ֗וב אָכִ֥ין מֹושָׁבִֽי׃
8 యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు.
רָא֣וּנִי נְעָרִ֣ים וְנֶחְבָּ֑אוּ וִֽ֝ישִׁישִׁים קָ֣מוּ עָמָֽדוּ׃
9 అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు.
שָׂ֭רִים עָצְר֣וּ בְמִלִּ֑ים וְ֝כַ֗ף יָשִׂ֥ימוּ לְפִיהֶֽם׃
10 ౧౦ ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది.
קֹול־נְגִידִ֥ים נֶחְבָּ֑אוּ וּ֝לְשֹׁונָ֗ם לְחִכָּ֥ם דָּבֵֽקָה׃
11 ౧౧ నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
כִּ֤י אֹ֣זֶן שָׁ֭מְעָה וַֽתְּאַשְּׁרֵ֑נִי וְעַ֥יִן רָ֝אֲתָ֗ה וַתְּעִידֵֽנִי׃
12 ౧౨ ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.
כִּֽי־אֲ֭מַלֵּט עָנִ֣י מְשַׁוֵּ֑עַ וְ֝יָתֹ֗ום וְֽלֹא־עֹזֵ֥ר לֹֽו׃
13 ౧౩ నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.
בִּרְכַּ֣ת אֹ֭בֵד עָלַ֣י תָּבֹ֑א וְלֵ֖ב אַלְמָנָ֣ה אַרְנִֽן׃
14 ౧౪ నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది.
צֶ֣דֶק לָ֭בַשְׁתִּי וַיִּלְבָּשֵׁ֑נִי כִּמְעִ֥יל וְ֝צָנִ֗יף מִשְׁפָּטִֽי׃
15 ౧౫ గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను.
עֵינַ֣יִם הָ֭יִיתִי לַֽעִוֵּ֑ר וְרַגְלַ֖יִם לַפִּסֵּ֣חַ אָֽנִי׃
16 ౧౬ దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను.
אָ֣ב אָ֭נֹכִֽי לָֽאֶבְיֹונִ֑ים וְרִ֖ב לֹא־יָדַ֣עְתִּי אֶחְקְרֵֽהוּ׃
17 ౧౭ దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను.
וָֽ֭אֲשַׁבְּרָה מְתַלְּעֹ֣ות עַוָּ֑ל וּ֝מִשִּׁנָּ֗יו אַשְׁלִ֥יךְ טָֽרֶף׃
18 ౧౮ అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను.
וָ֭אֹמַר עִם־קִנִּ֣י אֶגְוָ֑ע וְ֝כַחֹ֗ול אַרְבֶּ֥ה יָמִֽים׃
19 ౧౯ నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.
שָׁרְשִׁ֣י פָת֣וּחַ אֱלֵי־מָ֑יִם וְ֝טַ֗ל יָלִ֥ין בִּקְצִירֽ͏ִי׃
20 ౨౦ నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది.
כְּ֭בֹודִי חָדָ֣שׁ עִמָּדִ֑י וְ֝קַשְׁתִּ֗י בְּיָדִ֥י תַחֲלִֽיף׃
21 ౨౧ మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు.
לִֽי־שָׁמְע֥וּ וְיִחֵ֑לּוּ וְ֝יִדְּמ֗וּ לְמֹ֣ו עֲצָתִֽי׃
22 ౨౨ నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి.
אַחֲרֵ֣י דְ֭בָרִי לֹ֣א יִשְׁנ֑וּ וְ֝עָלֵ֗ימֹו תִּטֹּ֥ף מִלָּתִֽי׃
23 ౨౩ వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు.
וְיִֽחֲל֣וּ כַמָּטָ֣ר לִ֑י וּ֝פִיהֶ֗ם פָּעֲר֥וּ לְמַלְקֹֽושׁ׃
24 ౨౪ వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు.
אֶשְׂחַ֣ק אֲ֭לֵהֶם לֹ֣א יַאֲמִ֑ינוּ וְאֹ֥ור פָּ֝נַ֗י לֹ֣א יַפִּילֽוּן׃
25 ౨౫ నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను.
אֶֽבֲחַ֣ר דַּרְכָּם֮ וְאֵשֵׁ֪ב רֹ֥אשׁ וְ֭אֶשְׁכֹּון כְּמֶ֣לֶךְ בַּגְּד֑וּד כַּאֲשֶׁ֖ר אֲבֵלִ֣ים יְנַחֵֽם׃

< యోబు~ గ్రంథము 29 >