< యోబు~ గ్రంథము 27 >
1 ౧ యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
约伯接着说:
2 ౨ నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.
神夺去我的理,全能者使我心中愁苦。 我指着永生的 神起誓:
3 ౩ నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,
我的生命尚在我里面; 神所赐呼吸之气仍在我的鼻孔内。
4 ౪ నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.
我的嘴决不说非义之言; 我的舌也不说诡诈之语。
5 ౫ మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.
我断不以你们为是; 我至死必不以自己为不正!
6 ౬ నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.
我持定我的义,必不放松; 在世的日子,我心必不责备我。
7 ౭ నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక. నన్నెదిరించేవారు నీతి లేని వారుగా కనబడతారు గాక.
愿我的仇敌如恶人一样; 愿那起来攻击我的,如不义之人一般。
8 ౮ దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?
不敬虔的人虽然得利, 神夺取其命的时候还有什么指望呢?
9 ౯ వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా?
患难临到他, 神岂能听他的呼求?
10 ౧౦ వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా?
他岂以全能者为乐, 随时求告 神呢?
11 ౧౧ దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను.
神的作为,我要指教你们; 全能者所行的,我也不隐瞒。
12 ౧౨ మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు?
你们自己也都见过, 为何全然变为虚妄呢?
13 ౧౩ దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే.
神为恶人所定的分, 强暴人从全能者所得的报乃是这样:
14 ౧౪ వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు.
倘或他的儿女增多,还是被刀所杀; 他的子孙必不得饱食。
15 ౧౫ వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు.
他所遗留的人必死而埋葬; 他的寡妇也不哀哭。
16 ౧౬ ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా,
他虽积蓄银子如尘沙, 预备衣服如泥土;
17 ౧౭ వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు.
他只管预备,义人却要穿上; 他的银子,无辜的人要分取。
18 ౧౮ వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు.
他建造房屋如虫做窝, 又如守望者所搭的棚。
19 ౧౯ అతడు ధనికుడుగా పడుకుంటాడు గానీ అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది.
他虽富足躺卧,却不得收殓, 转眼之间就不在了。
20 ౨౦ భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది.
惊恐如波涛将他追上; 暴风在夜间将他刮去。
21 ౨౧ తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది.
东风把他飘去, 又刮他离开本处。
22 ౨౨ ఆగకుండా తూర్పు గాలి అతని మీద విసిరి కొడుతుంది. వాడు దాని చేతిలోనుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు.
神要向他射箭,并不留情; 他恨不得逃脱 神的手。
23 ౨౩ అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది.
人要向他拍掌, 并要发叱声,使他离开本处。