< యోబు~ గ్రంథము 26 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.
Ṣùgbọ́n Jobu sì dáhùn wí pé,
2 ౨ శక్తి లేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలం లేని చేతిని ఎంత బాగా రక్షించావు!
“Báwo ni ìwọ ń ṣe ìrànlọ́wọ́ ẹni tí kò ní ipá, báwo ní ìwọ ń ṣe gbe apá ẹni tí kò ní agbára?
3 ౩ జ్ఞానం లేని వాడికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పావు! సంగతిని ఎంత చక్కగా వివరించావు!
Báwo ni ìwọ ń ṣe ìgbìmọ̀ fun ẹni tí kò ní ọgbọ́n, tàbí báwo òye rẹ to pọ to bẹ́ẹ̀?
4 ౪ నువ్వు ఎవరి ఎదుట మాటలు పలికావు? ఎవరి ఆత్మ నీలోనుండి బయలుదేరింది?
Ta ni ó ràn ọ́ lọ́wọ́ láti sọ àwọn ọ̀rọ̀ wọ̀nyí, àti ẹ̀mí ta ni ó gba ẹnu rẹ sọ̀rọ̀?”
5 ౫ బిల్దదు ఇలా అన్నాడు. జలాల కింద నివసించే వారు, మృతులు, నీడలు వణికిపోతారు.
“Àwọn aláìlágbára ti isà òkú wárìrì, lábẹ́ omi pẹ̀lú àwọn tí ń gbé inú rẹ̀.
6 ౬ దేవుని దృష్టికి పాతాళం తెరిచి ఉంది. నాశనకూపం ఆయన ఎదుట బట్టబయలుగా ఉంది. (Sheol )
Ìhòhò ni ipò òkú níwájú Ọlọ́run, ibi ìparun kò sí ní ibojì. (Sheol )
7 ౭ ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.
Òun ní o nà ìhà àríwá ọ̀run ní ibi òfúrufú, ó sì so ayé rọ̀ ní ojú asán.
8 ౮ ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.
Ó di omi pọ̀ nínú ìkùùkuu àwọsánmọ̀ rẹ̀ tí ó nípọn; àwọsánmọ̀ kò sì ya nísàlẹ̀ wọn.
9 ౯ దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.
Ó sì fa ojú ìtẹ́ rẹ̀ sẹ́yìn, ó sì tẹ àwọsánmọ̀ rẹ̀ sí i lórí.
10 ౧౦ వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.
Ó fi ìdè yí omi òkun ká, títí dé ààlà ìmọ́lẹ̀ àti òkùnkùn.
11 ౧౧ ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.
Ọ̀wọ́n òpó ọ̀run wárìrì, ẹnu sì yà wọ́n sì ìbáwí rẹ̀.
12 ౧౨ తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.
Ó fi ipá rẹ̀ dààmú omi Òkun; nípa òye rẹ̀, ó gé agbéraga sí wẹ́wẹ́.
13 ౧౩ ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.
Nípa ẹ̀mí rẹ̀ ni ó ti ṣe ọ̀run ní ọ̀ṣọ́; ọwọ́ rẹ̀ ni ó fi dá ejò wíwọ́ nì.
14 ౧౪ ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?
Kíyèsi i, èyí ní òpin ọ̀nà rẹ̀; ohùn èyí tí a gbọ́ ti kéré tó! Ta ni ẹni náà tí òye àrá agbára rẹ̀ lè yé?”