< యోబు~ గ్రంథము 25 >
1 ౧ అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు.
Και απεκρίθη Βιλδάδ ο Σαυχίτης και είπεν·
2 ౨ అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు.
Εξουσία και φόβος είναι μετ' αυτού· εκτελεί ειρήνην εις τα ύψη αυτού.
3 ౩ ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా?
Υπάρχει αριθμός των στρατευμάτων αυτού; και επί τίνα δεν ανατέλλει το φως αυτού;
4 ౪ మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు?
Πως λοιπόν δύναται άνθρωπος να δικαιωθή ενώπιον του Θεού; ή πως δύναται να ήναι καθαρός ο γεγεννημένος εκ γυναικός;
5 ౫ ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు.
Ιδού, και αυτή η σελήνη δεν είναι λαμπρά, και οι αστέρες δεν είναι καθαροί ενώπιον αυτού.
6 ౬ మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.
Πόσον ολιγώτερον ο άνθρωπος, σαπρία; και ο υιός του ανθρώπου, ο σκώληξ;