< యోబు~ గ్రంథము 23 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.
Y respondió Job, y dijo:
2 ౨ నేటివరకూ నేను రోషంతో మొర పెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది.
Hoy también hablaré con amargura, y será más grave mi llaga que mi gemido.
3 ౩ ఆయన నివాసస్థానం దగ్గరికి నేను చేరేలా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలిస్తే ఎంత బావుణ్ను.
¡Quién diese que le conociese, y le hallase! yo iría hasta su trono.
4 ౪ ఆయన సమక్షంలో నేను నా వాదన వినిపిస్తాను. వాదోపవాదాలతో నా నోరు నింపుకుంటాను.
Ordenaría juicio delante de él, y mi boca henchiría de argumentos.
5 ౫ ఆయన నాకు జవాబుగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను. ఆయన నాతో పలికే మాటలను అర్థం చేసుకుంటాను.
Yo sabría lo que él me respondería, y entendería lo que me dijese.
6 ౬ ఆయన తన అధికబలంతో నాతో వ్యాజ్యెమాడుతాడా? ఆయన అలా చేయడు. నా మనవి ఆలకిస్తాడు.
¿Pleitearía conmigo con multitud de fuerza? No: antes él la pondría en mí.
7 ౭ అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడగలుగుతాడు. కాబట్టి నేను నా న్యాయాధిపతి ఇచ్చే శిక్ష శాశ్వతంగా తప్పించుకుంటాను.
Allí el recto disputaría con él; y escaparía para siempre de él que me condena.
8 ౮ నేను తూర్పు దిశకు వెళ్లినా ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్లినా ఆయన కనబడడం లేదు.
He aquí, yo iré al oriente, y no le hallaré, y al occidente, y no le entenderé.
9 ౯ ఆయన పనులు జరిగించే ఉత్తరదిశకు పోయినా ఆయన నాకు కానరావడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు. నేనాయనను చూడలేను.
Si al norte él obrare, yo no le veré: al mediodía se esconderá, y no le veré.
10 ౧౦ నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తరవాత నేను బంగారంలాగా కనిపిస్తాను.
Mas él conoció mi camino: probóme, y salí como oro.
11 ౧౧ నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను.
Mis pies tomaron su rastro: guardé su camino, y no me aparté.
12 ౧౨ ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను.
Del mandamiento de sus labios nunca me quité: las palabras de su boca guardé más que mi comida.
13 ౧౩ అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.
Y si él se determina en una cosa, ¿quién le apartará? Su alma deseó, e hizo.
14 ౧౪ నా కోసం తాను సంకల్పించిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాటి పనులను ఆయన అసంఖ్యాకంగా జరిగిస్తాడు.
Por tanto él acabará lo que ha determinado de mí; y muchas cosas como estas hay en él.
15 ౧౫ కాబట్టి ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించిన ప్రతిసారీ ఆయనకు భయపడుతున్నాను.
Por lo cual yo me espantaré delante de su rostro: consideraré, y temerle he.
16 ౧౬ దేవుడు నా హృదయాన్ని కుంగజేశాడు. సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు.
Dios ha enternecido mi corazón, y el Omnipotente me ha espantado.
17 ౧౭ అంధకారం కమ్మినా గాఢాంధకారం నన్ను కమ్మినా నేను నాశనమైపోలేదు.
¿Por qué yo no fui cortado delante de las tinieblas, y cubrió con oscuridad mi rostro?