< యోబు~ గ్రంథము 22 >

1 అప్పుడు తేమాను వాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.
پس الیفاز تیمانی در جواب گفت:۱
2 మానవమాత్రులు దేవునికి ప్రయోజనకారులౌతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు.
«آیا مرد به خدا فایده برساند؟ البته مرد دانا برای خویشتن مفید است.۲
3 నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా?
آیا اگر توعادل باشی، برای قادر مطلق خوشی رخ می‌نماید؟ یا اگر طریق خود را راست سازی، او رافایده می‌شود؟۳
4 ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడుతాడా?
آیا به‌سبب ترس تو، تو را توبیخ می‌نماید؟ یا با تو به محاکمه داخل خواهد شد؟۴
5 నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితి లేనివి కావా?
آیا شرارت تو عظیم نیست و عصیان تو بی‌انتهانی،۵
6 ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్ర హీనుల బట్టలు తీసుకున్నావు.
چونکه از برادران خود بی‌سبب گرو گرفتی و لباس برهنگان را کندی،۶
7 దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు.
به تشنگان آب ننوشانیدی، و از گرسنگان نان دریغ داشتی؟۷
8 బాహుబలం గల వాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్న వాడు దానిలో నివసిస్తాడు.
امامرد جبار، زمین از آن او می‌باشد و مرد عالیجاه، در آن ساکن می‌شود.۸
9 వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనివారి చేతులు విరగ్గొట్టావు.
بیوه‌زنان را تهی‌دست رد نمودی، و بازوهای یتیمان شکسته گردید.۹
10 ౧౦ అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది.
بنابراین دامها تو را احاطه می‌نماید و ترس، ناگهان تو را مضطرب می‌سازد.۱۰
11 ౧౧ నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా?
یا تاریکی که آن را نمی بینی و سیلابها تو را می‌پوشاند.۱۱
12 ౧౨ దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి!
آیاخدا مثل آسمانها بلند نیست؟ و سر ستارگان رابنگر چگونه عالی هستند.۱۲
13 ౧౩ “దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలోనుండి ఆయన న్యాయం కనుగొంటాడా?
و تو می‌گویی خداچه می‌داند و آیا از تاریکی غلیظ داوری تواندنمود؟۱۳
14 ౧౪ దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనలను చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు” అని నీవనుకుంటావు.
ابرها ستر اوست پس نمی بیند، و بردایره افلاک می‌خرامد.۱۴
15 ౧౫ పూర్వకాలం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా?
آیا طریق قدما را نشان کردی که مردمان شریر در آن سلوک نمودند،۱۵
16 ౧౬ తమ కాలం రాకముందే వారు హటాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహలవలె కొట్టుకు పోయాయి.
که قبل از زمان خود ربوده شدند، و اساس آنهامثل نهر ریخته شد۱۶
17 ౧౭ “మా దగ్గర నుండి తొలగి పో” అని దేవునితో అంటారు. “సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే” అంటారు.
که به خدا گفتند: از ما دورشو و قادر مطلق برای ما چه تواند کرد؟۱۷
18 ౧౮ అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగు గాక.
و حال آنگاه او خانه های ایشان را از چیزهای نیکو پرساخت. پس مشورت شریران از من دور شود.۱۸
19 ౧౯ నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు.
«عادلان چون آن را بینند، شادی خواهندنمود و بی‌گناهان بر ایشان استهزا خواهند کرد.۱۹
20 ౨౦ “మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది” అంటారు.
آیا مقاومت کنندگان ما منقطع نشدند؟ و آتش بقیه ایشان را نسوزانید؟۲۰
21 ౨౧ ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతిసమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.
پس حال با او انس بگیر و سالم باش. و به این منوال نیکویی به توخواهد رسید.۲۱
22 ౨౨ ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో.
تعلیم را از دهانش قبول نما، وکلمات او را در دل خود بنه.۲۲
23 ౨౩ సర్వశక్తుని వైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు.
اگر به قادرمطلق بازگشت نمایی، بنا خواهی شد. و اگر شرارت رااز خیمه خود دور نمایی۲۳
24 ౨౪ మట్టిలో నీ సిరిసంపదలను, సెలయేటి నీటిలో ఓఫీరు బంగారాన్ని పారవెయ్యి.
و اگر گنج خود را درخاک و طلای اوفیر را در سنگهای نهرهابگذاری،۲۴
25 ౨౫ అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు.
آنگاه قادر مطلق گنج تو و نقره خالص برای تو خواهد بود،۲۵
26 ౨౬ అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు.
زیرا در آنوقت ازقادر مطلق تلذذ خواهی یافت، و روی خود را به طرف خدا برخواهی افراشت.۲۶
27 ౨౭ నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.
نزد او دعاخواهی کرد و او تو را اجابت خواهد نمود، و نذرهای خود را ادا خواهی ساخت.۲۷
28 ౨౮ నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది.
امری راجزم خواهی نمود و برایت برقرار خواهد شد، وروشنایی بر راههایت خواهد تابید.۲۸
29 ౨౯ దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు.
وقتی که ذلیل شوند، خواهی گفت: رفعت باشد، و فروتنان را نجات خواهد داد.۲۹
30 ౩౦ నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.
کسی را که بی‌گناه نباشدخواهد رهانید، و به پاکی دستهای تو رهانیده خواهد شد.»۳۰

< యోబు~ గ్రంథము 22 >