< యోబు~ గ్రంథము 21 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
Job progovori i reče:
2 ౨ మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు.
“Slušajte, slušajte dobro što ću reći, utjehu mi takvu barem udijelite.
3 ౩ నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో.
Otrpite da riječ jednu ja izrečem, kad završim, tad se rugajte slobodno.
4 ౪ నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు?
Zar protiv čovjeka dižem ja optužbu? Kako da strpljenje onda ne izgubim?
5 ౫ మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి.
Pogledajte na me: užas će vas spopast', rukom ćete svoja zakloniti usta;
6 ౬ ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది.
pomislim li na to, prestravim se i sam i čitavim svojim tad protrnem tijelom.
7 ౭ భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు?
Zašto na životu ostaju zlikovci i, što su stariji, moćniji bivaju?
8 ౮ వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి.
Potomstvo njihovo s njima napreduje a izdanci im se množe pred očima.
9 ౯ వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది.
Strah nikakav kuće njihove ne mori i šiba ih Božja ostavlja na miru.
10 ౧౦ వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.
Njihovi bikovi plode pouzdano, krave im se tele i ne jalove se.
11 ౧౧ వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు.
K'o jagnjad djeca im slobodno skakuću, veselo igraju njihovi sinovi.
12 ౧౨ వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు.
Oni pjevaju uz harfe i bubnjeve i vesele se uz zvukove svirale.
13 ౧౩ వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. (Sheol )
Dane svoje završavaju u sreći, u Podzemlje oni silaze spokojno. (Sheol )
14 ౧౪ వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు.
A govorili su Bogu: 'Ostavi nas, ne želimo znati za tvoje putove!
15 ౧౫ “మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?” అని వాళ్ళు అడుగుతారు.
TÓa tko je Svesilni da njemu služimo i kakva nam korist da ga zazivamo?'
16 ౧౬ వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక.
Zar svoju sreću u ruci ne imahu, makar do Njega ne drže ništa oni?
17 ౧౭ భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా.
Zar se luč opakog kada ugasila? Zar se na njega oborila nesreća? Zar mu u gnjevu svom On skroji sudbinu?
18 ౧౮ ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా.
Zar je kao slama na vjetru postao, kao pljeva koju vihor svud raznosi?
19 ౧౯ “వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు” అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి.
Hoće l' ga kaznit' Bog u njegovoj djeci? Ne, njega nek' kazni da sam to osjeti!
20 ౨౦ తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి.
Vlastitim očima nek' rasap svoj vidi, neka se napije srdžbe Svesilnoga!
21 ౨౧ వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది?
TÓa što poslije smrti on za dom svoj mari kad će se presjeć' niz njegovih mjeseci?
22 ౨౨ దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా.
Ali tko će Boga učiti mudrosti, njega koji sudi najvišim bićima?
23 ౨౩ ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు.
Jedan umire u punom blagostanju, bez briga ikakvih, u potpunom miru,
24 ౨౪ అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి.
bokova od pretiline otežalih i kostiju sočne moždine prepunih.
25 ౨౫ మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు.
A drugi umire s gorčinom u duši, nikad nikakve ne okusivši sreće.
26 ౨౬ ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి.
Obojica leže zajedno u prahu, crvi ih jednako prekrivaju oba.
27 ౨౭ నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను.
O, znam dobro kakve vaše su namjere, kakve zlosti protiv mene vi snujete.
28 ౨౮ “ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా.
Jer pitate: 'Gdje je kuća plemićeva, šator u kojem stanovahu opaki?'
29 ౨౯ దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా?
Niste li na cesti putnike pitali, zar njihovo svjedočanstvo ne primate:
30 ౩౦ ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.
'Opaki je u dan nesreće pošteđen i u dan Božje jarosti veseo je.'
31 ౩౧ వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు?
Al' na postupcima tko će mu predbacit' i tko će mu vratit' što je počinio?
32 ౩౨ వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది.
A kad ga na kraju na groblje odnesu, na grobni mu humak postavljaju stražu.
33 ౩౩ పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు.
Lake su mu grude zemlje u dolini dok za njime ide čitavo pučanstvo.
34 ౩౪ మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?
O, kako su vaše utjehe isprazne! Kakva su prijevara vaši odgovori!”