< యోబు~ గ్రంథము 20 >
1 ౧ అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు,
納阿瑪人左法爾答覆說:
2 ౨ నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది.
因我的思潮起伏,叫我答覆,為此我內心十分急躁。
3 ౩ నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది.
斥責辱罵我的話,我已聽到,我的理智催迫我答覆。
4 ౪ ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా?
你豈不知道,自古以來,自從世上有人以來,
5 ౫ దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.
惡人的歡欣決不久長,無神者的喜樂瞬息即逝﹖
6 ౬ వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.
他的驕傲雖高頂蒼天,他的頭雖插入青雲,
7 ౭ అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.
但他必像幻像,永歸無有;見過他的人必說:「他那裏去了﹖」
8 ౮ కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.
他又像夢境消散,無蹟可尋;又像夜夢,消失無蹤。
9 ౯ వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు.
見過他的眼,再也見不到他;他的住所,再也不認識他。
10 ౧౦ వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు.
他的兒子要賠償窮人的損害,他要親手把財物交還。
11 ౧౧ వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.
他的骨骸雖富有魄力,但要同他一起埋於塵埃。
12 ౧౨ చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు.
邪惡在他口中雖覺甘甜,藏在他的舌下,
13 ౧౩ దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.
他雖愛惜不捨,久久含在口中;
14 ౧౪ అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది.
但那食物在他腹中要起變化,在他五內要變成蛇的毒汁。
15 ౧౫ వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.
他併吞的財富,必要吐出,天主必使之由他腹中嘔出。
16 ౧౬ వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.
他原吸入了蛇的毒汁,毒蛇的舌頭必將他殺死。
17 ౧౭ తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.
他不得觀賞油流如溪,也看不到那流蜜流奶的小河。
18 ౧౮ వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు.
他勞力之所得,應該退還,不得吞下;賺來的財富,不得享用。
19 ౧౯ వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.
因為它壓搾了窮人,使他們無依;強佔了人家的房屋,不得再建。
20 ౨౦ వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు.
因為他口腹之慾總不知足,他所喜愛之物,也救不了他。
21 ౨౧ వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు.
沒有什麼能逃脫他的吞噬,他的幸福決不久長。
22 ౨౨ వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు.
他財產富足時,卻不免拮据,各種的困苦齊集他身。
23 ౨౩ వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.
當他肚腹飽滿時,天主的怒火突然降到,箭如雨點射在他身上。
24 ౨౪ ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.
他逃避過鐵器,銅矢必將他射穿。
25 ౨౫ ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది.
一箭由他的脊背穿透,光亮的箭矢由他的膽囊穿出,死亡的恐怖已落在他身上。
26 ౨౬ వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది.
層層黑暗留作他的寶藏,非人燃起的火要焚燒他,吞盡留在他帳幕的人。
27 ౨౭ వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది.
天要彰顯他的罪惡,地也起來攻擊他。
28 ౨౮ వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది.
洪水沖走他的住宅,在天主義怒之日要全被沖去。
29 ౨౯ దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.
這是惡人由天主所應得的一份,是天主為他所注定的產業。