< యోబు~ గ్రంథము 19 >
1 ౧ అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
Wtedy Hiob odpowiedział:
2 ౨ మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు?
Jak długo będziecie dręczyć moją duszę [i] miażdżyć mnie słowami?
3 ౩ పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు.
Już dziesięć razy znieważyliście mnie. Nie wstyd wam, [że] tak się znęcacie nade mną?
4 ౪ నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా?
A niech tak będzie, że zbłądziłem, błąd zostaje po mojej stronie.
5 ౫ మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా?
A jeśli rzeczywiście chcecie się wynosić nade mną i dowodzić mi mojej hańby;
6 ౬ అయితే వినండి. దేవుడు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి.
Wiedzcie, że to Bóg mnie powalił i swoją siecią mnie otoczył.
7 ౭ నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు న్యాయం జరగడం లేదు.
Oto wołam o krzywdę, ale nikt nie słucha; krzyczę, ale nie ma sądu.
8 ౮ ఆయన నా మార్గం చుట్టూ నేను దాట లేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు.
Zagrodził mi drogę, abym nie mógł przejść, i na moich ścieżkach rozpostarł ciemność.
9 ౯ ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు.
Odarł mnie z mojej chwały i zdjął koronę z mojej głowy.
10 ౧౦ అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు.
Zniszczył mnie ze wszystkich stron i ginę; moją nadzieję wyrwał jak drzewo.
11 ౧౧ ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.
Zapłonął przeciwko mnie swoim gniewem i uważa mnie za swego wroga.
12 ౧౨ ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటువేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు.
Przyszły razem jego oddziały, utorowały przeciw mnie swoją drogę i rozbiły obóz dokoła mojego namiotu.
13 ౧౩ ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు.
Moich braci oddalił ode mnie, a moi znajomi ode mnie stronią.
14 ౧౪ నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
Opuścili mnie moi bliscy, a moi przyjaciele o mnie zapomnieli.
15 ౧౫ నా యింటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలే ఉన్నాను.
Przebywający w moim domu i moje służące uważają mnie za obcego. Stałem się cudzoziemcem w ich oczach.
16 ౧౬ నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది.
Wołałem na swego sługę, ale on się nie odzywa, chociaż go błagam swoimi ustami.
17 ౧౭ నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం.
Moim oddechem brzydzi się moja żona, choć błagam ze względu na synów z mojego ciała.
18 ౧౮ చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు.
Nawet małe dzieci mną gardzą; gdy powstaję, urągają mi.
19 ౧౯ నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు.
Brzydzą się mną wszyscy moi najbliżsi; ci, których kocham, stanęli przeciw mnie.
20 ౨౦ నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
Moje kości przylgnęły do mojej skóry i do mego ciała; pozostała tylko skóra wokół zębów.
21 ౨౧ నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.
Zlitujcie się nade mną, zlitujcie się nade mną, moi przyjaciele, bo ręka Boża mnie dotknęła.
22 ౨౨ నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు?
Czemu mnie prześladujecie jak Bóg? Czy nie dość wam mojego ciała?
23 ౨౩ నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను.
Oby teraz zostały zapisane moje słowa! Oby je w księdze utrwalono!
24 ౨౪ నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది!
Oby rylcem z żelaza i ołowiem zostały na wieczną pamiątkę wyryte na skale!
25 ౨౫ నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.
Wiem bowiem, że mój Odkupiciel żyje i że [w] ostateczny [dzień] stanie na ziemi.
26 ౨౬ ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.
A [choć] moja skóra się rozłoży, to w swoim ciele ujrzę Boga.
27 ౨౭ మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.
Ujrzę go ja sam, ujrzą go moje oczy, a nie kto inny, choć moje nerki zniszczały w moim wnętrzu.
28 ౨౮ దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు.
Powinniście mówić: Czemu go prześladujemy? Gdyż we mnie znajduje się korzeń sprawy.
29 ౨౯ అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు.
Wy sami lękajcie się miecza, bo gniew za nieprawość sprowadza miecz, abyście wiedzieli, że jest sąd.