< యోబు~ గ్రంథము 18 >

1 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు.
Then Baldad the Sauchite answered and said,
2 ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను.
How long will you continue? forbear, that we also may speak.
3 నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు?
For therefore have we been silent before you like brutes?
4 అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకొంటున్నావు. నీ కోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా?
Anger has possessed you: for what if you should die; would [the earth] under heaven be desolate? or shall the mountains be overthrown from their foundations?
5 భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి.
But the light of the ungodly shall be quenched, and their flame shall not go up.
6 వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
His light [shall be] darkness in [his] habitation, and his lamp shall be put out with him.
7 వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి.
Let the meanest of men spoil his goods, and let his counsel deceive [him].
8 వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి.
His foot also has been caught in a snare, [and] let it be entangled in a net.
9 వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు.
And let snares come upon him: he shall strengthen those that thirst for his destruction.
10 ౧౦ వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది.
His snare is hid in the earth, and that which shall take him is by the path.
11 ౧౧ అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి.
Let pains destroy him round about, and let many [enemies] come about him,
12 ౧౨ వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది.
[vex him] with distressing hunger: and a signal destruction has been prepared for him.
13 ౧౩ అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది.
Let the soles of his feet be devoured: and death shall consume his beauty.
14 ౧౪ వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు.
And let health be utterly banished from his tabernacle, and let distress seize upon him with a charge from the king.
15 ౧౫ వాళ్లకు సంబంధంలేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసస్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది.
It shall dwell in his tabernacle in his night: his excellency shall be sown with brimstone.
16 ౧౬ వాళ్ళ వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి.
His roots shall be dried up from beneath, and his crop shall fall away from above.
17 ౧౭ భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
Let his memorial perish out of the earth, and his name shall be publicly cast out.
18 ౧౮ వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు.
Let [one] drive him from light into darkness.
19 ౧౯ వాళ్లకు కొడుకులు, మనవలు ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
He shall not be known amongst his people, nor his house preserved on the earth.
20 ౨౦ వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్తులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనౌతారు.
But strangers shall dwell in his possessions: the last groaned for him, and wonder seized the first.
21 ౨౧ భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది.
These are the houses of the unrighteous, and this is the place of them that know not the Lord.

< యోబు~ గ్రంథము 18 >