< యోబు~ గ్రంథము 18 >
1 ౧ అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు.
Bildad iz Šuaha progovori tad i reče:
2 ౨ ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను.
“Kada kaniš obuzdat' svoje besjede? Opameti se sad da razgovaramo!
3 ౩ నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు?
Zašto nas držiš za stoku nerazumnu, zar smo životinje u tvojim očima?
4 ౪ అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకొంటున్నావు. నీ కోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా?
O ti, koji se od jarosti razdireš, hoćeš li da zemlja zbog tebe opusti da iz svoga mjesta iskoče pećine?
5 ౫ భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి.
Al' ugasit će se svjetlost opakoga, i neće mu sjati plamen na ognjištu.
6 ౬ వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
Potamnjet će svjetlo u njegovu šatoru i nad njime će se utrnut' svjetiljka.
7 ౭ వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి.
Krepki mu koraci postaju sputani, o vlastite on se spotiče namjere.
8 ౮ వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి.
Jer njegove noge vode ga u zamku, i evo ga gdje već korača po mreži.
9 ౯ వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు.
Tanka mu je zamka nogu uhvatila, i evo, užeta čvrsto ga pritežu.
10 ౧౦ వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది.
Njega vreba omča skrivena na zemlji, njega čeka klopka putem kojim hodi.
11 ౧౧ అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి.
Odasvuda strahovi ga prepadaju, ustopice sveudilj ga proganjaju.
12 ౧౨ వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది.
Glad je požderala svu snagu njegovu, nesreća je uvijek o njegovu boku.
13 ౧౩ అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది.
Boleština kobna kožu mu razjeda, prvenac mu smrti nagriza udove.
14 ౧౪ వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు.
Njega izvlače iz šatora njegova da bi ga odveli vladaru strahota.
15 ౧౫ వాళ్లకు సంబంధంలేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసస్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది.
U njegovu stanu tuđinac stanuje, po njegovu domu prosipaju sumpor.
16 ౧౬ వాళ్ళ వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి.
Odozdo se suši njegovo korijenje, a odozgo grane sve mu redom sahnu.
17 ౧౭ భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
Spomen će se njegov zatrti na zemlji, njegovo se ime s lica zemlje briše.
18 ౧౮ వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు.
Iz svjetlosti njega u tminu tjeraju, izagnat' ga hoće iz kruga zemaljskog.
19 ౧౯ వాళ్లకు కొడుకులు, మనవలు ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
U rodu mu nema roda ni poroda, nit' preživjela na njegovu ognjištu.
20 ౨౦ వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్తులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనౌతారు.
Sudba je njegova Zapad osupnula, i čitav je Istok obuzela strepnja.
21 ౨౧ భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది.
Evo, takav usud snalazi zlikovca i dom onog koji ne priznaje Boga.”