< యోబు~ గ్రంథము 17 >
1 ౧ నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నేను బ్రతికే రోజులు ముగిసిపోయాయి. నాకోసం సమాధి సిద్ధంగా ఉంది.
“Yaşama gücüm tükendi, günlerim kısaldı, Mezar gözlüyor beni.
2 ౨ ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టూ చేరారు. నా సమక్షంలోనే వాళ్ళు వివాదాలు రేకెత్తిస్తున్నారు.
Çevremi alaycılar kuşatmış, Gözümü onların aşağılamasıyla açıp kapıyorum.
3 ౩ దేవా, దయచేసి నువ్వే నాకు పూచీకత్తు ఉంటానని మాట ఇవ్వు. నువ్వు కాక ఇంకెవరు నాకు జామీనుగా ఉంటారు.
“Ey Tanrı, kefilim ol kendine karşı, Başka kim var bana güvence verecek?
4 ౪ నువ్వు వాళ్ళ హృదయాలను మూసివేసి జ్ఞానహీనులుగా చేశావు. కనుక వాళ్ళు ఎలాంటి ఘనతా పొందరు.
Çünkü onların aklını anlayışa kapadın, Bu yüzden onları zafere kavuşturmayacaksın.
5 ౫ దోపిడీ సొమ్ము కోసం తన స్నేహితులను నిందించేవాడి పిల్లల కళ్ళు మసకబారతాయి.
Para için dostlarını satan adamın Çocuklarının gözünün feri söner.
6 ౬ ఆయన నన్ను మనుషులందరికీ ఒక సామెతలాగా నిలబెట్టాడు. నలుగురూ నా ముఖం మీద ఉమ్మివేస్తారు.
“Tanrı beni insanların diline düşürdü, Yüzüme tükürmekteler.
7 ౭ అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి.
Kederden gözümün feri söndü, Kollarım bacaklarım çırpı gibi.
8 ౮ యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజాయితీపరులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరం చెందుతారు.
Dürüst insanlar buna şaşıyor, Suçsuzlar tanrısızlara saldırıyor.
9 ౯ అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతారు. నిరపరాధులు అంతకంతకూ వృద్ది చెందుతారు.
Doğrular kendi yolunu tutuyor, Elleri temiz olanlar gittikçe güçleniyor.
10 ౧౦ అప్పుడు మీరంతా మరోసారి నా దగ్గరికి రండి, మీలో ఒక్క జ్ఞాని కూడా నాకు కనిపించడు.
“Ama siz, hepiniz gelin yine deneyin! Aranızda bir bilge bulamayacağım.
11 ౧౧ నా రోజులు ముగిసిపోయాయి. నా తలంపులు వ్యర్ధమైపోయాయి. నా హృదయంలోని కోరికలు భగ్నం అయ్యాయి.
Günlerim geçti, tasarılarım, Dileklerim suya düştü.
12 ౧౨ రాత్రి సమయాన్ని పగలు అనీ, చీకటి కమ్మినప్పుడు అది వెలుగు అనీ వాళ్ళు వాదిస్తారు.
Bu insanlar geceyi gündüze çeviriyorlar, Karanlığa ‘Işık yakındır’ diyorlar.
13 ౧౩ నాకు ఆశ ఏదైనా ఉన్నట్టయితే అది మృత్యులోకం నాకు ఇల్లు కావాలని. చీకటిలో నా పడక సిద్ధం చేసుకోవాలని. (Sheol )
Ölüler diyarını evim diye gözlüyorsam, Yatağımı karanlığa seriyorsam, (Sheol )
14 ౧౪ గొయ్యిని చూసి ‘నువ్వే నాకు తండ్రివి’ అనీ, పురుగును చూసి ‘నువ్వే నాకు తల్లివి, చెల్లివి’ అనీ వాటితో చెప్పాలని ఉంది.
Çukura ‘Babam’, Kurda ‘Annem, kızkardeşim’ diyorsam,
15 ౧౫ అలాంటప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? దాన్ని ఎవరు కనుగొనగలరు?
Umudum nerede? Kim benim için umut görebilir?
16 ౧౬ అది నాతోబాటు మృత్యులోకం అడ్డకమ్ముల దగ్గరికి దిగిపోతుందా? నాతో కలసి మట్టిలో కలసిపోతుందా?” (Sheol )
Umut benimle ölüler diyarına mı inecek? Toprağa birlikte mi gireceğiz?” (Sheol )