< యోబు~ గ్రంథము 14 >

1 స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.
“Umuntu ozelwe ngumfazi ulensuku ezilutshwane njalo ezigcwele inhlupho.
2 అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.
Uyaqhakaza njengeluba aphinde abune; njengesithunzi esithi tshazi, akemi.
3 అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా?
Onjalo ungala ulokhu umkhangele na? Ungamisa phambi kwakho umthonisise na?
4 అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు.
Ngubani ongaveza okuhlambulukileyo kokungcolileyo na? Kakho!
5 మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు.
Insuku zomuntu zimisiwe; uzibekile izinyanga zokuphila kwakhe wabeka lemikhawulo angeke ayeqe.
6 అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.
Ngakho-ke myekele ungazihluphi ngaye, aze aqede lesosikhathi sakhe njengomuntu oqhatshiweyo.
7 చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.
Kungaba lethemba ngesihlahla; singaganyulwa siyahluma njalo, amahlumela aso kawayikwehluleka ukukhula.
8 నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది.
Impande zaso zingaguga phansi emhlabathini lesiphunzi saso sife emhlabathini,
9 అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.
kodwa singezwa amanzi siyahluma sikhuphe ingatsha njengesihlahla esitsha.
10 ౧౦ అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?
Kodwa umuntu uyafa alaliswe phansi; uphefumula okokucina angabe esabakhona.
11 ౧౧ సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.
Njengamanzi esitsha olwandle lanjengomfula ucitsha amanzi wome qha,
12 ౧౨ ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.
ngokunjalo umuntu ulala phansi angabe esavuka; kuze kutshabalale amazulu abantu kabayikuvuka kumbe baphatshanyiswe ebuthongweni babo.
13 ౧౩ నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. (Sheol h7585)
Kube uyangifihla ethuneni ungithukuze ulaka lwakho luze ludlule! Kube ungibekela isikhathi ube usungikhumbula! (Sheol h7585)
14 ౧౪ మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.
Umuntu angafa uphinde aphile na? Zonke insuku zokutshikatshika kwami ngizalindela isikhathi sokuyekelwa kwami.
15 ౧౫ అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.
Uzabiza lami ngizasabela; uzasifisa lesosidalwa esenziwa yizandla zakho.
16 ౧౬ అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి.
Ngeqiniso lapho uzabala izinyathelo zami kodwa kawuyikulandelela izono zami.
17 ౧౭ నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.
Iziphambeko zami zizananyekwa emgodleni; uzasigubuzela isono sami.
18 ౧౮ కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.
Kodwa njengentaba ikhumuzeka ize ibhidlike, lanjengedwala ligudluka endaweni yalo,
19 ౧౯ నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు.
njengamanzi awagubhayo amatshe lezikhukhula zikhukhula umhlabathi, kanjalo uyalibhidliza ithemba lomuntu.
20 ౨౦ నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు.
Umehlula kanye angaphindi abekhona, adlule; uyabuguqula ubuso bakho umxotshe.
21 ౨౧ ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు.
Nxa amadodana akhe ezuza udumo, kawakwazi; nxa izizukulwane zakhe zisehliswa, kazikuboni.
22 ౨౨ తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.
Bezwa kuphela ubuhlungu bemizimba yabo bazikhalele bona.”

< యోబు~ గ్రంథము 14 >